Swetha
OTT Movie Suggestion: హర్రర్ సినిమాలను ఇష్టపడే వారికి ఈ సినిమాను ఎలా మిస్ అయ్యాము అనే ఫీలింగ్ తెప్పిస్తుంది ఈ సినిమా. ఇప్పటివరకు ఈ సినిమాను మిస్ చేసి ఉంటే కనుక వెంటనే చూసేయండి. మరి ఈ సినిమా ఏంటి ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది అనే విషయాలను చూసేద్దాం.
OTT Movie Suggestion: హర్రర్ సినిమాలను ఇష్టపడే వారికి ఈ సినిమాను ఎలా మిస్ అయ్యాము అనే ఫీలింగ్ తెప్పిస్తుంది ఈ సినిమా. ఇప్పటివరకు ఈ సినిమాను మిస్ చేసి ఉంటే కనుక వెంటనే చూసేయండి. మరి ఈ సినిమా ఏంటి ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది అనే విషయాలను చూసేద్దాం.
Swetha
హర్రర్ సినిమాలనే ఇష్టమైతే ఇప్పుడు చెప్పుకోబోయే సినిమాను అసలు మిస్ కాకండి. ఒకవేళ భయం అయితే దైర్యం తెచ్చుకుని ఈ సినిమాను చూసేయండి. ఒకవేళ ఈ సినిమాను మిస్ చేస్తే మాత్రం మంచి స్టోరీ ప్లాట్ ను మిస్ చేసినట్లే. ఓటీటీ లో హారర్ కంటెంట్ జోనర్ తో ఎన్నో సినిమాలు ఉన్నాయి కనుక కొన్ని సినిమాలను ప్రేక్షకులు మిస్ చేసే అవకాశం ఉంది. ఇప్పుడు చెప్పుకోబోయే సినిమాను కూడా మీరు మిస్ చేసి ఉంటే మాత్రం వెంటనే చూసేయండి. ఖచ్చితంగా ఈ సినిమా బెస్ట్ హర్రర్ ఫీలింగ్ ను కలిగిస్తుంది. మరి ఈ సినిమా ఏంటి ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది అనే విషయాలను చూసేద్దాం.
హారర్ మూవీస్ ను తెరకెక్కించడంలో హాలీవుడ్ మేకర్స్ తర్వాతే ఎవరైనా.. అలాంటి ప్రముఖ దర్శకులను సైతం మెప్పించిన హార్రర్ సినిమా ఇది. ముందు ఈ మూవీ కథ విషయానికొచ్చేద్దాం … ఎందులకంటే ఇది చూసిన తర్వాత ఈ సినిమా చూడాలా వద్దా అనే సందేహం ఉన్న వారికి కూడా సినిమా చూసేయాలి అనిపిస్తుంది. కాబట్టి ముందు ఈ సినిమా స్టోరీ లైన్ ఏంటంటే.. ఓ ముసలావిడ మరణంతో ఈ సినిమా స్టార్ట్ అవుతుంది. ఆమె కూతురు కుటుంబం చుట్టూ ఈ సినిమా కథ కొనసాగుతుంది. ఆ ముసలావిడ చనిపోవడంతో ఆమె కూతురు ఆని తన భర్త పిల్లలతో కలిసి దహన సంస్కారాలకు వస్తుంది. అంతా పూర్తైన కొద్దీ రోజులకు ఆనికి ఎందుకో తన తల్లి ఆత్మ వెంటాడుతున్నట్లు అనిపిస్తుంది. మరోపక్క ఆని కూతురు చార్లీ కి చిన్నతనం నుంచి సైకిక్ సమస్య ఉంటుంది. స్కూల్ లో చనిపోయిన పావురం తలను తీసుకొచ్చి దానికి పూజలు చేయడం లాంటి పిచ్చి పనులు చేస్తూ ఉంటుంది.
కట్ చేస్తే ఆని కొడుకు ఓ రోజు తన ఫ్రెండ్స్ తో పార్టీకి వెళ్తూ.. ఆని చెప్పిందని తన చెల్లి చార్లీ ని కూడా పార్టీకి తీసుకుని వెళ్తాడు. పార్టీకి వెళ్లిన కాసేపటి వరకు అంతా బాగానే ఉంటుంది. కానీ కొద్దీ సేపటికి చార్లీకి ఊపిరి ఆడదు. దీనితో పీటర్ తనను తీసుకుని బయటకు వచ్చి.. హై స్పీడ్ లో కార్ నడుపుతూ ఇంటికి తీసుకువెళ్తున్న క్రమంలో.. చార్లీ గాలి కోసం తల బయటపెడుతుంది. సరిగ్గా అదే సమయంలో ఆ కార్ కు ఎదో అడ్డుగా రావడంతో.. కారును ఒక్కసారిగా పక్కకు తిప్పినపుడు.. చార్లీ తల పక్కనే ఉన్న స్థంభానికి తగిలి తెగి పడిపోతుంది. దీనితో అతను షాక్ లో ఉంటాడు. కారులోని చార్లీ మొండెం చూసి ఆనీ విపరీతంగా ఏడుస్తుంది.ఇక అప్పటినుంచి ఆ కుటుంబంలో వింత సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఆ తర్వాత ఏం జరిగింది ! చార్లీ ప్రమాదవ శాత్తు చనిపోయిందా ! లేదా ఇంకేదైనా కారణం ఉందా ! చెల్లిని కోల్పోయిన అన్న ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటాడు ! చివరికి ఈ కథ ఎలా ముగిసింది ! ఇవన్నీ తెలియాలంటే “హెరిడెటరీ” అనే ఈ సినిమాను చూడాల్సిందే.
ఈ స్టోరీ లైన్ చదువుతున్నపుడు నార్మల్ గా అనిపించినా.. ఒన్స్ ఈ సినిమాలో సీన్స్ చూస్తే మాత్రం కదలకుండా కూర్చుని చూడాలని అనిపిస్తూ ఉంటుంది. చాలా డిస్టర్బింగ్ సీన్స్ ఉంటాయి. కాబట్టి సెన్సిటివ్ పీపుల్ కాస్త దైర్యం తెచ్చుకుని చూడాల్సిన సినిమా ఇది. ఈ సినిమా ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. మరి ఈ సినిమాను ఇప్పటివరకు ఎవరైనా మిస్ చేస్తే మాత్రం వెంటనే చూసేయండి. ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.