iDreamPost
android-app
ios-app

Investigation Thriller In OTT: OTTలో ఈ మూవీ చూశాక.. టబుపై మీ అభిప్రాయం మారిపోద్ది!

  • Published May 23, 2024 | 6:59 PM Updated Updated May 23, 2024 | 6:59 PM

OTT Movie Suggestion: క్రైమ్, సస్పెన్స్, ఇన్వెస్టిగేషన్ ఇలాంటి సినిమాలను ఎన్ని చూసిన ఇంకా ఇంకా చూడాలని అనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు చెప్పుకోబోయే సినిమా కూడా అలాంటిదే. పైగా ఈ మధ్య కాలంలో వచ్చినా సినిమానే. ఒకవేళ ఈ సినిమాను కనుక మిస్ చేసి ఉంటే వెంటనే చూసేయండి.

OTT Movie Suggestion: క్రైమ్, సస్పెన్స్, ఇన్వెస్టిగేషన్ ఇలాంటి సినిమాలను ఎన్ని చూసిన ఇంకా ఇంకా చూడాలని అనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు చెప్పుకోబోయే సినిమా కూడా అలాంటిదే. పైగా ఈ మధ్య కాలంలో వచ్చినా సినిమానే. ఒకవేళ ఈ సినిమాను కనుక మిస్ చేసి ఉంటే వెంటనే చూసేయండి.

  • Published May 23, 2024 | 6:59 PMUpdated May 23, 2024 | 6:59 PM
Investigation Thriller In OTT:  OTTలో ఈ మూవీ చూశాక.. టబుపై మీ అభిప్రాయం మారిపోద్ది!

ఏదైనా ఓ క్రైమ్ జరిగినప్పుడు ఆ క్రైమ్ ఎలా జరిగింది.. ఆ కేసును ఎలా సాల్వ్ చేశారు. ఆ సమయంలో వారికి ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి ఇలాంటి విషయాలు తెలుసుకోవాలనే ఆసక్తి అందరికి ఉంటుంది. ఇలాంటి తరహాలో క్రైమ్, సస్పెన్స్, ఇన్వెస్టిగేషన్స్ జోనర్ లో ఎన్నో సినిమాలు వస్తూ ఉన్నాయి. ఈ సినిమాలన్నిటిలో కాన్సెప్ట్ ఒకటే అయినా కానీ.. కనెక్టింగ్ ప్లాట్స్ మాత్రం రకరకాలుగా ఉంటాయి. అందుకే ఈ జోనర్ లో ఎన్ని సినిమాలు వచ్చినా కూడా ఇంకా ఇంకా చూడాలని అనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు చెప్పుకోబోయే సినిమా కూడా అలాంటిదే. పైగా ఇది ఈ మధ్య కాలంలో వచ్చిన సినిమానే. మరి ఈ సినిమాను ఇప్పటివరకు మిస్ అయి ఉంటే మాత్రం వెంటనే చూసేయండి. మరి ఈ సినిమా ఏంటో ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో చూసేద్దాం.

దానికంటే ముందు ఈ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ కథేంటో చూసేద్దాం.. ఈ సినిమాలో రీసెర్చ్ అండ్ వింగ్ ఎలా పని చేస్తుందో వివరించే కథ ఇది. జీవ్, కృష్ణ మెహ్రా రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్ లో అధికారులు. ఢిల్లీలో ఉన్న “రా” ప్రధాన కార్యాలయంలో పనిచేసే రవి అనే వ్యక్తి అక్కడి సమాచారాన్ని ఉగ్ర వాదులకు చేరవేస్తున్నాడని జీవ్ అనుమానిస్తాడు. దీనితో అతనిపై నిఘా పెట్టాలని కృష్ణ మెహ్రా ను ఆదేశిస్తాడు. ఇక వచ్చిన ఆదేశాల ప్రకారం.. కృష్ణ మెహ్రా ఓ టీమ్ ను ఏర్పాటు చేసుకుంటుంది. “ఆపరేషన్ బ్రూటస్” పేరుతో ఆ బృందం రంగంలోకి దిగుతుంది. ఓ పార్టీకి హాజరైన హీనా రెహమాన్ హత్య కు గురయ్యే సీన్ తో ఈ సినిమా స్టార్ట్ అవుతుంది. అసలు ఎవరు ఈ హీనా రెహమాన్ ? ఆమెను ఎవరు హత్య చేసి ఉంటారు ? ఆపరేషన్ బ్రూటస్ బృందానికి ఎదురైన సవాళ్లు ఏంటి ? జీవ అనుమానించినట్లుగా రవి నిజంగా దేశ ద్రోహేనా ? రవి చర్యల వెనుక ఇంకా ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు ? ఆ హత్యకు రవికి ఏదైనా సంబంధం ఉందా ? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం తెలియాలంటే ఈ సినిమాను చూడాల్సిందే.

ఈ సినిమా పేరు “ఖుఫియా” .. 2023 లో వచ్చిన ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులో ఉంది. కాగా ఈ సినిమాలో మెయిన్ లీడ్ లో నటించిన నటి మాత్రం అందరికి పరిచయమే. ఆమె మరెవరో కాదు టబు. ఇక ఈ సినిమాలో టబుతో పాటు ఆశిష్ విద్యార్థి, అలీ ఫజల్, వామికా గబ్బీ , అతుల్ కులకర్ణి ముఖ్య పాత్రలలో కనిపించారు. ఇన్వెస్టిగేషన్, క్రైమ్ థ్రిల్లర్స్ ను ఇష్టపడే వారికి ఈ సినిమా ఖచ్చితంగా నచ్చేస్తుంది. మరి ఈ సినిమాను ఇప్పటివరకు ఎవరైనా మిస్ చేసి ఉంటే మాత్రం వెంటనే చూసేయండి. ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.