Swetha
Top 10 Under Rated Telugu Movie of All Time: ఇప్పటివరకు ఇండస్ట్రీలో ఎన్నో సినిమాలు వచ్చాయి. అయితే వాటిలో కొన్ని సినిమాలకు మాత్రం కథ బావున్నా కానీ.. కలెక్షన్స్ పరంగా దెబ్బ తినడంతో ఆయా సినిమాలకు పెద్దగా బజ్ క్రియేట్ అవ్వదు. మరి ఇప్పటివరకు వచ్చిన సినిమాలలో అండర్ రేటెడ్ మూవీస్ ఏంటో చూసేద్దాం.
Top 10 Under Rated Telugu Movie of All Time: ఇప్పటివరకు ఇండస్ట్రీలో ఎన్నో సినిమాలు వచ్చాయి. అయితే వాటిలో కొన్ని సినిమాలకు మాత్రం కథ బావున్నా కానీ.. కలెక్షన్స్ పరంగా దెబ్బ తినడంతో ఆయా సినిమాలకు పెద్దగా బజ్ క్రియేట్ అవ్వదు. మరి ఇప్పటివరకు వచ్చిన సినిమాలలో అండర్ రేటెడ్ మూవీస్ ఏంటో చూసేద్దాం.
Swetha
ప్రతి వారం ఎన్నో సినిమాలు రిలీజ్ అవుతూనే ఉన్నాయి. కొన్ని థియేటర్ లో రిలీజ్ అయితే మరికొన్ని ఓటీటీ లో రిలీజ్ అవుతున్నాయి. ఎక్కడా కూడా మూవీ లవర్స్ ను నిరాశపరచకుండా ఎప్పటికప్పుడు మంచి ఎంటర్టైన్మెంట్ అందించేలా.. ఎన్నో సినిమాలు రిలీజ్ అవుతూ ఉన్నాయి. అయితే వచ్చిన ప్రతి సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోవాలనే రూల్ ఎక్కడా లేదు. కథను బట్టి, ప్రేక్షకుల ఆ సినిమాను అంచనా వేసేదాన్ని బట్టి .. కొన్ని సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి.. మరికొన్ని సినిమాలు నిరాశ పరుస్తాయి. ఆయా సినిమాలకు వారు పడే కష్టం ఒకటే అయినా కూడా.. ఆ సినిమాకు థియేటర్ లో వచ్చే రెస్పాన్స్ ను బట్టి ఆయా సినిమాలను జడ్జ్ చేస్తూ ఉంటారు. అలా కథ పరంగా కొన్ని సినిమాలు బావున్నా కూడా కలెక్షన్స్ పరంగా దెబ్బ తినడంతో.. కొన్ని సినిమాలకు అంతగా పేరు సంపాదించుకోలేకపోతాయి. అలాంటి అండర్ రేటెడ్ సినిమాలేంటో.. ఇప్పుడు అవి ఏ ఓటీటీ లో అందుబాటులో ఉన్నాయనే విషయాలను చూసేద్దాం.
థియేటర్ లో రిలీజ్ అయినా కూడా కథ పరంగా కంటెంట్ ఉన్నా కానీ, అనేక కారణాల వలన అంత టాక్ తెచ్చుకోలేకపోతాయి కొన్ని సినిమాలు. అవి ఎప్పుడో సోషల్ మీడియాలో కనిపించినప్పుడు వాటి గురించి సెర్చ్ చేస్తూ ఉంటారు ప్రేక్షకులు. ఇప్పుడు చెప్పుకోబోయే సినిమాలు కూడా అలాంటివే. పైగా అవేమి హాలీవుడ్ బాలీవుడ్ చిత్రాలు కాదు. అన్ని తెలుగు సినిమాలే. మరి ఆ సినిమాలేంటో.. ఏ ఓటీటీ లో ఉన్నాయో చూసేద్దాం.
శ్రీ విష్ణు, నివేద పేతు రాజ్, అమృతా శ్రీనివాసన్ ప్రధాన పాత్రలలో నటించిన సినిమా “మెంటల్ మదిలో”. ఈ సినిమా 2017లో వచ్చింది. ఇది ఒక ఫీల్ గుడ్ సినిమా అని చెప్పి తీరాలి. చిన్నపటినుంచి అన్ని విషయాలలో కన్ఫ్యూజన్ తో ఉన్న హీరోకు పెళ్లి చూపుల ద్వారా పరిచయం అవుతుంది హీరోయిన్. ఒకరినొకరు బాగా ఇష్టపడతారు. కానీ అనుకోకుండా కొన్ని కారణాల వలన వాళ్ళ పెళ్లి పోస్ట్ పోన్ అవుతుంది . ఈ క్రమంలో హీరో మరొక అమ్మాయికి దగ్గరవుతాడు. ఆ తర్వాత ఏమి జరిగింది అనేది కథ. ప్రస్తుతం ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతుంది.
1978 లో శ్రీకాకుళంలోని ఓ చిన్న గ్రామంలో జరిగిన కొన్ని సంఘటనల ఆధారంగా తెరకెక్కిన సినిమా ఇది. రఘు కుంచె ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా 2020 లో వచ్చింది. ఈ సినిమా స్టోరీ లైన్ ఏంటంటే రఘు కుంచె, అతని తమ్ముడు పేదలను అణచివేయాలని చూస్తారు, మరో వైపు వీరిపై మరో ఇద్దరు వీరిపై తిరుగుబాటు చేస్తారు. ప్రజల కోసం వారు చేసిన తిరుగుబాటు ఎంతవరకు కొనసాగింది అనేది ఈ సినిమా కథ. ఈ సినిమా ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులో ఉంది.
అజయ్, జ్ఞానేశ్వరి , వివేక్ త్రివేది ప్రధాన పాత్రలలో నటించిన ఈ చిత్రం 2023 లో వచ్చింది. ఒక పోలీస్ ఇన్వెస్టిగేషన్ చుట్టూ ఈ సినిమా కథ కొనసాగుతుంది. ఈ సినిమా ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది.
వరుణ్ తేజ్ , ప్రగ్య జైస్వాల్ జంటగా నటించిన ఈ సినిమా 2015 లో విడుదలైంది. ఈ సినిమా స్టోరీ లైన్ విషయానికొస్తే.. రెండో ప్రపంచ యుద్ధంలో దాదాపు రెండు లక్షల మంది భారత సైనికులు పాల్గొన్నారని, నలబై వేల మంది మరణించారని, మరో ముప్ఫై ఐదు వేల మంది గాయపడ్డారని.. అరవై వేలమంది బందీలుగా చిక్కారన్న సత్యాన్ని వెలికి తీసి, ప్రపంచం ముందు పెట్టిన సినిమా ఇది. ప్రస్తుతం ఈ సినిమా హాట్ స్టార్ లో అందుబాటులో ఉంది.
నటుడు సత్యదేవ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా 2020 లో విడుదలైంది. ఆ సమయంలో కోవిడ్ కారణంగా థియేటర్స్ లేనందు వలన ఈ సినిమాను నేరుగా ఓటీటీ లోనే విడుదల చేశారు. మలయాళంలో విజయవంతమైన ‘మహేశ్ ఇంటే ప్రతికారం’ చిత్రాన్ని తెలుగులోకి ‘ఉమామహేశ్వర ఉగ్ర రూపస్య’గా రీమేక్ చేశారు. ఒక మంచి వాడికి కోపం వస్తే .. దాని పరిణామాలు ఎలా ఉంటాయి అనేదే ఈ సినిమా కథ. ప్రస్తుతం ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులో ఉంది.
ఈ సినిమా ఒక మంచి రొమాంటిక్ ఫిల్మ్ అని చెప్పి తీరాలి. రాజా గౌతమ్, చాందిని చౌదరి ప్రధాన పాత్రలలో నటించిన మను సినిమా క్రౌడ్ ఫండింగ్ విధానంలో తెరకెక్కించారు. కాగా ఈ సినిమా 2018 లో విడుదల అయింది. ఈ సినిమా స్టోరీ లైన్ విషయానికొస్తే .. ఒక యంగ్ ఫోటో గ్రాఫర్, ఒక ఫేమస్ పెయింటర్ కి మధ్య జరిగిన కొన్ని సన్నివేశాలను.. మర్డర్ మిస్టరీ ఇన్వెస్టిగేషన్స్ ను ఈ సినిమాలో చూపిస్తారు. ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులో ఉంది.
ఇప్పటివరకు ఈ సినిమాలను ఏ కారణం చేత అయినా లైట్ తీసుకుని ఉంటే కనుక మంచి మూవీస్ ను మిస్ అయినట్లే. కాబట్టి ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ లో అందుబాటులో ఉన్న ఈ సినిమాలను మిస్ కాకుండా చూసేయండి . మరి ఈ సినిమాలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.