డైరెక్ట్ గా OTT లోకి బాలీవుడ్ రొ*మాంటిక్ కామెడీ.. తెలుగులో కూడా!

OTT Romantic Comedy Thriller: ఇప్పుడు నేరుగా ఓటీటీ లోకి కొన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ వచ్చేస్తున్నాయి. అది కూడా కామెడీ మూవీస్ ట్రెండ్ బాగా కొనసాగడంతో.. ఇప్పుడు మరొక రొ*మాంటిక్ కామెడీ మూవీ ఓటీటీ లో రిలీజ్ కానుంది. మరి ఆ సినిమా ఏంటో చూసేద్దాం.

OTT Romantic Comedy Thriller: ఇప్పుడు నేరుగా ఓటీటీ లోకి కొన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ వచ్చేస్తున్నాయి. అది కూడా కామెడీ మూవీస్ ట్రెండ్ బాగా కొనసాగడంతో.. ఇప్పుడు మరొక రొ*మాంటిక్ కామెడీ మూవీ ఓటీటీ లో రిలీజ్ కానుంది. మరి ఆ సినిమా ఏంటో చూసేద్దాం.

కొంతకాలం ఓటీటీ లో హర్రర్ మూవీస్ ట్రెండ్ బాగా కొనసాగింది. ఎవరు చూసిన ఎక్కువగా హర్రర్ మూవీస్ నే చూస్తూ ఉండేవారు. దీనితో మేకర్స్ కూడా అలాంటి హర్రర్ మూవీస్ నే ఇంకాస్త ఇంట్రెస్టింగ్ గా ప్రేక్షకుల ముందుకు తీసుకుని వస్తున్నారు. ఇక ఇప్పుడు హర్రర్ మూవీస్ కు పోటీగా కామెడీ మూవీస్ ట్రెండ్ లోకి వచ్చేశాయి. గత కొన్ని వారాలుగా కనీసం వారానికి ఒకటి రెండు అయినా కామెడీ చిత్రాలు రిలీజ్ అవుతున్నాయి. ఇంకా రిలీజ్ కు సిద్ధంగా ఉన్న సినిమాలు కూడా చాలానే ఉన్నాయి. పైగా ఈ వారం అయితే ఏకంగా మూడు కామెడీ చిత్రాలు రిలీజ్ కాబోతున్నాయి. ఈ క్రమంలో ఓటీటీ లోకి మరొక ఇంట్రెస్టింగ్ రొ*మాంటిక్ చిత్రం రిలీజ్ కానుంది. మరి ఈ సినిమా ఏంటి ఎక్కడ స్ట్రీమింగ్ కానుంది అనే విషయాలను చూసేద్దాం.

ఈ సినిమా మరేదో కాదు.. సంజయ్ దత్ , రవీనా టాండ‌న్ ముఖ్య పాత్రలలో నటించిన.. కామెడీ మూవీ.. “ఘ‌డ్‌ఛ‌డీ”. అయితే మొదట ఈ సినిమాను థియేటర్ లో రిలీజ్ చేద్దాం అనుకున్నారట కానీ.. ఇప్పుడు డైరెక్ట్ గా ఓటీటీ లోనే రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. ఆల్రెడీ సంజయ్ దత్, రవీనా గురించి అందరికి తెలిసిందే. కెజిఎఫ్ 2 మూవీలో సంజయ్ దత్ విలన్ గాను, ర‌వీనా టాండ‌న్ ప్రైమ్ మినిస్ట‌ర్ పాత్రలోనూ నటించారు. ఇక ఈ సినిమాలో మాత్రం వీరిద్దరూ భార్య భర్తలుగా నటించబోతున్నారు. కాగా ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ జియో సినిమా సొంతం చేసుకోగా.. ఈ సినిమాను ఆగ‌స్ట్ 9 నుంచి స్ట్రీమింగ్ తీసుకురానున్నారు. పైగా ఘ‌డ్‌ఛ‌డీ చిత్రాన్ని హిందీలోనే కాకుండా.. తెలుగు, కన్నడ , మలయాళ భాషల్లో కూడా రిలీజ్ చేయనున్నారు. మరి ఈ రొ*మాంటిక్ కామెడీ చిత్రం ఎలాంటి రెస్పాన్స్ ను సంపాదించుకుంటుందో వేచి చూడాలి.

కాగా ఈ సినిమాలో సంజ‌య్ ద‌త్‌, ర‌వీనా టాండ‌న్‌తో పాటు.. పార్థ్ స‌మ‌తాన్‌, కుషాలీ కుమార్ కూడా కనిపించబోతున్నారు. ఇంకా కొంత షూటింగ్ బ్యాలెన్స్ ఉన్నట్లు సమాచారం. ఇప్పటికైతే ఈ సినిమాకు సంబంధించిన కథ గురించి అంతగా బయటకు రాలేదు కానీ.. ఈ మూవీ కథ అంతా ఓ ప్యాలెస్ చుట్టూ తిరుగుతుందని టాక్. ఈ మూవీకి సంబంధించిన మరిన్ని అప్ డేట్స్ రావాల్సి ఉంది. ఈ మూవీ ఎలా ఉండబోతుందో తెలియాలంటే ఇంకొన్ని డేస్ వెయిట్ చేయాల్సిందే. ఏదేమైనా ఇప్పుడు కామెడీ చిత్రాల ట్రెండ్ బాగా నడుస్తుంది కాబట్టి.. ఈ సినిమా కూడా మంచి హిట్ నే అందుకుంటుందని చెప్పడంలో ఏ మాత్రం సందేహం లేదు. మరి ఈ మూవీ అప్ డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments