iDreamPost
android-app
ios-app

తక్కువ బడ్జెట్ తో వచ్చి సూపర్ హిట్టైన.. ఈ 5 సినిమాలు ఏ OTTలో ఉన్నాయంటే?

  • Published May 11, 2024 | 5:20 PM Updated Updated May 11, 2024 | 5:37 PM

సినిమాలన్నిటిని అందరు చూస్తూ ఉంటారు, కానీ వచ్చిన ప్రతి చిత్రము బ్లాక్ బస్టర్ చిత్రం కాకపోయినా కూడ డీసెంట్ కలెక్షన్స్ ఏ సంపాదించుకుంటూ ఉంటాయి. కొన్ని సినిమాలైతే తక్కువ బడ్జెట్ లో వచ్చి.. భారీ కలెక్షన్స్ ను సంపాదించుకుంటాయి. అలాంటి సినిమాలేంటో చూసేద్దాం.

సినిమాలన్నిటిని అందరు చూస్తూ ఉంటారు, కానీ వచ్చిన ప్రతి చిత్రము బ్లాక్ బస్టర్ చిత్రం కాకపోయినా కూడ డీసెంట్ కలెక్షన్స్ ఏ సంపాదించుకుంటూ ఉంటాయి. కొన్ని సినిమాలైతే తక్కువ బడ్జెట్ లో వచ్చి.. భారీ కలెక్షన్స్ ను సంపాదించుకుంటాయి. అలాంటి సినిమాలేంటో చూసేద్దాం.

  • Published May 11, 2024 | 5:20 PMUpdated May 11, 2024 | 5:37 PM
తక్కువ బడ్జెట్ తో  వచ్చి సూపర్ హిట్టైన.. ఈ 5 సినిమాలు ఏ OTTలో ఉన్నాయంటే?

థియేటర్ లో వచ్చిన ప్రతి సినిమా హిట్ అవ్వాలని రూల్ ఏమి లేదు. అలాగే హై బడ్జెట్ సినిమాలు మాత్రం హిట్ అవుతాయి అనుకోడం కూడా పొరపాటే. ఎందుకంటే తక్కువ బడ్జెట్ తో వస్తున్న సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ ను రాబడుతున్న సంగతి తెలిసిందే. కథ బావుంటే బడ్జెట్ తో .. స్టార్ క్యాస్టింగ్ తో సంబంధం లేదు అని కొన్ని సినిమాలు ఎప్పుడు నిరూపిస్తూ.. ఇండస్ట్రీకి షాక్ ను ఇస్తూనే ఉంటాయి. అందులోను సౌత్ సినిమాలు ఈ విషయంలో చాలా సార్లు ప్రేక్షకులను ఆశ్చర్య పరిచాయి. మరి ఈ క్రమంలో తక్కువ బడ్జెట్ తో థియేటర్ లో అడుగుపెట్టి.. బాక్స్ ఆఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ ను రాబట్టిన కొన్ని సినిమాలు ఏంటో.. అవి ఇప్పుడు ఏ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ లో స్ట్రీమింగ్ అవుతున్నాయో చూసేద్దాం.

బడ్జెట్ తక్కువ కదా అని ఆయా సినిమాలను తక్కువ అంచనా వేస్తే మాత్రం పొరబడినట్లే. అందరిని ఆశ్చర్య పరిచిన సినిమాలేంటో చూసేద్దాం.

ఎవ్రీ ఒన్ ఈజ్ ఏ హీరో : సోనీలివ్

2018 లో వచ్చిన ఈ సినిమా కేవలం 26 కోట్లతో రూపొందించబడి.. థియేట్రికల్ రన్ పూర్తయ్యే టైమ్ కి 177 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ను రాబట్టింది. ఈ మలయాళ సినిమా ప్రస్తుతం సోని లివ్ లో అందుబాటులో ఉంది. ఇప్పటివరకు ఈ సినిమాను ఎవరైనా మిస్ అయ్యి ఉంటే మాత్రం వెంటనే చూసేయండి.

5 super hit movies with low budget

లవ్ టుడే : నెట్ ఫ్లిక్స్

2022 లో వచ్చిన ఈ సినిమా యూత్ లో క్రియేట్ చేసిన సెన్సేషన్ అంతా ఇంతా కాదు. ఈ సినిమా కేవలం 6 కోట్ల బడ్జెట్ తో రూపొందించారు. థియేట్రికల్ రన్ కంప్లీట్ అయ్యేసరికి ఈ సినిమా కలెక్షన్స్ 57 కోట్లు రాబట్టింది. ఈ సినిమాను ఆల్రెడీ అందరు చూసి ఉంటారు. ఒకవేళ మళ్ళీ ఎవరైనా చూడాలని అనుకుంటే మాత్రం.. నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులో ఉంది.

5 super hit movies with low budget

96: ఆహ

ఈ సినిమా ప్రతి ఒక్కరికి తమ ఫస్ట్ లవ్ ను గుర్తు చేస్తూ ఉంటుంది. 2018 లో రిలీజ్ అయిన ఈ సినిమా .. 18 కోట్లతో రూపొందించారు. థియేట్రికల్ రన్ పూర్తయ్యే సరికి ఈ సినిమా 55 కోట్లను రాబట్టింది. ఈ సినిమాను మళ్ళీ చూడాలనుకుంటే మాత్రం ఆహ ప్లాట్ ఫార్మ్ లో అందుబాటులో ఉంది.

5 super hit movies with low budget

కాంతర: నెట్ ఫ్లిక్స్

2022 లో ఎటువంటి అంచనాలు లేకుండా రిలీజ్ అయిన ఈ సినిమా.. థియేటర్స్ లో క్రియేట్ చేసిన సెన్సేషన్ అంతా ఇంతా కాదు. కేవలం 16 కోట్ల బడ్జెట్ తో రూపొందించిన ఈ సినిమా ఎవరు ఊహించిన విధంగా 398 కోట్ల రూపాయల కలెక్షన్స్ ను రాబట్టి.. సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈ సినిమా ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులో ఉంది.

5 super hit movies with low budget

జెర్సీ: అమెజాన్ ప్రైమ్

న్యాచురల్ స్టార్ నాని నటించిన ఈ సినిమా కథ పరంగా ప్రతి ఒక్కరి హృదయాలను కదిలించింది చెప్పి తీరాలి. 2019 లో రిలీజ్ అయిన ఈ సినిమా అందరి ఆల్ టైమ్ ఫేవరేట్ గా నిలిచింది. 30 కోట్ల బడ్జెట్ తో రూపొందించిన ఈ సినిమా 100 కోట్ల కలెక్షన్స్ ను రాబట్టింది. ఈ సినిమా ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులో ఉంది.

5 super hit movies with low budget

ఇప్పటివరకు చెప్పుకున్న సినిమాలను అందరు చూసే ఉంటారు కానీ, కొన్ని సినిమాలను ఎన్ని సార్లు చూసిన మళ్ళీ మళ్ళీ చూడాలని అనిపిస్తూ ఉంటుంది. అలాంటి సినిమాలే ఈ సినిమాలు. మరి మరొక్కసారి ఈ సినిమాలను చూడాలంటే మాత్రం.. ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ లో చూసేయండి. మరి ఈ సినిమాలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.