OTT లోకి రానున్న అదిరిపోయే కామెడీ డ్రామా ‘అడియోస్ అమిగో’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!

Comedy Movie-Adios Amigo OTT Streaming Date: మలయాళీ సినిమాలు చేసే మ్యాజిక్ ఏ వేరు.. తెలుగులో లేకపోయినా కూడా ఈ సినిమాలు ఓటీటీ లోకి వచ్చిన వెంటనే చూసేస్తూ ఉంటారు ప్రేక్షకులు. అలాంటిది తెలుగులో ఉంటే ఇంకాస్త ఇంట్రెస్ట్ పెరుగుతుంది. లేటెస్ట్ గా ఓ మూవీ తెలుగులో ఓటీటీ లో ఎంట్రీ ఇవ్వబోతుంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

Comedy Movie-Adios Amigo OTT Streaming Date: మలయాళీ సినిమాలు చేసే మ్యాజిక్ ఏ వేరు.. తెలుగులో లేకపోయినా కూడా ఈ సినిమాలు ఓటీటీ లోకి వచ్చిన వెంటనే చూసేస్తూ ఉంటారు ప్రేక్షకులు. అలాంటిది తెలుగులో ఉంటే ఇంకాస్త ఇంట్రెస్ట్ పెరుగుతుంది. లేటెస్ట్ గా ఓ మూవీ తెలుగులో ఓటీటీ లో ఎంట్రీ ఇవ్వబోతుంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

ఓటీటీ లోకి ఏవైనా కొత్త సినిమాలు రిలీజ్ అవుతున్నాయంటే.. ఎంతో ఇంట్రెస్ట్ గా ఎదురుచూస్తూ ఉంటారు ప్రేక్షకులు. అందులోను అవి తెలుగు లాంగ్వేజ్ లో ఉన్నాయంటే అసలు మిస్ చేయరు. ఈ క్రమంలో తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ కామెడీ డ్రామా ఓటీటీ లోకి రాబోతుంది. అది కూడా ఓ మలయాళ మూవీ. మలయాళ సినిమాలను ప్రేక్షకులు ఏ రేంజ్ లో ఆదరిస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమా మరేదో కాదు అడియోస్ అమిగో. మలయాళంలో థియేటర్ లో రిలీజ్ అయినా నెల రోజుల్లోనే ఈ మూవీ ఓటీటీ లోకి ఎంట్రీ ఇస్తుంది. మరి ఈ మూవీ ఎప్పటినుంచి ఎక్కడ స్ట్రీమింగ్ కానుంది అనే విషయాలను చూసేద్దాం.

ఆసిఫ్ అలీ, సూరజ్ వెంజరమూడు ప్రధాన పాత్రలలో నటించిన.. అడియోస్ అమిగో సినిమా ఆగస్ట్ 9 న థియేటర్ లో రిలీజ్ అయింది. కామెడీ డ్రామా జోనర్ లో రిలీజ్ అయినా ఈ సినిమాకు.. థియేటర్ లో మిక్స్డ్ టాక్ వచ్చింది. ఇక ఈ సినిమాకు నాహస్ నాజర్ దర్శకత్వం వహించారు. ఇక ఇప్పుడు ఈ సినిమాను నెల తిరగకుండానే ఓటీటీ స్ట్రీమింగ్ కు తీసుకురానున్నారు. సెప్టెంబర్ 6 నుంచి ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్ నెట్ ఫ్లిక్స్ లో ఈ సినిమా స్ట్రీమింగ్ కు రానుంది. మళయాళంతో పాటు తెలుగు, తమిళం , కన్నడ భాషల్లో ఈ సినిమా అందుబాటులోకి రానుంది. కాబట్టి ఈ సినిమాను అసలు మిస్ చేయకుండా చూసేయండి.

ఇక అడియోస్ అమిగో సినిమా స్టోరీ లైన్ విషయానికొస్తే.. ప్రియం అనే వ్యక్తి ఆర్ధిక కష్టాల్లో ఉంటాడు. తన తల్లి గుండె ఆపరేషన్ చేయించాలని తెలిసినప్పటినుంచి.. అతను అనేక ఇబ్బందుల్లో పడతాడు. చేతిలో డబ్బులు లేక అప్పుల్లో ఉంటారు. కానీ అతనికి సహాయం చేయడానికి ఎవరు ముందుకు రారు. ఈ క్రమంలోనే అతనికి ప్రిన్స్ అనే వ్యక్తితో పరిచయం అవుతుంది. అతను చాలా ధనవంతుడు. వీరిద్దరికి మద్యం తాగే అలావాటు ఉండడంతో వారిద్దరూ ఫ్రెండ్స్ గా మారతారు. దీనితో ప్రియన్ అతనిని డబ్బులు అడగాలని అనుకుంటాడు. ఆ తర్వాత ఏం జరిగింది ? వారిద్దరి పరిచయం ఎక్కడి వరకు కొనసాగింది ? తన తల్లికి వైద్యం చేయించాడా లేదా ? ఇవన్నీ తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే. మరి ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments