Swetha
థియేటర్ లో రిలీజ్ అయినా సినిమాలు ఓటీటీలోకి ఎప్పుడెప్పుడు ఎంట్రీ ఇస్తాయా అని అందరూ ఎదురుచూస్తూ ఉంటారు. ఈ క్రమంలో ముగ్గురు హీరోయిన్స్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా "క్రూ" . మరి ఈ సినిమా ఓటీటీ ఎంట్రీ సంగతేంటో చూసేద్దాం.
థియేటర్ లో రిలీజ్ అయినా సినిమాలు ఓటీటీలోకి ఎప్పుడెప్పుడు ఎంట్రీ ఇస్తాయా అని అందరూ ఎదురుచూస్తూ ఉంటారు. ఈ క్రమంలో ముగ్గురు హీరోయిన్స్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా "క్రూ" . మరి ఈ సినిమా ఓటీటీ ఎంట్రీ సంగతేంటో చూసేద్దాం.
Swetha
ప్రతి వారం థియేటర్స్ లో ఎన్నో సినిమాలు విడుదల అవుతూనే ఉంటున్నాయి. ఈ క్రమంలో థియేటర్ లో ఆయా సినిమాలు రిలీజ్ అయిన రోజునే వాటి ఓటీటీ డీటెయిల్స్ గురించి, స్ట్రీమింగ్ డేట్ గురించి విపరీతమైన బజ్ క్రియేట్ అవుతోంది. దీనితో ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ కు రోజు రోజుకు క్రేజ్ బాగా పెరుగుతోంది. ఈ క్రమంలో తాజాగా ముగ్గురు ప్రముఖ హీరోయిన్స్.. టబు, కరీనా కపూర్, కృతి సనన్ ప్రధాన పాత్రలలో నటించిన సినిమా “క్రూ”. ఈ సినిమా టీజర్ విడుదల దగ్గర నుంచే మంచి హైప్ సంపాదించుకోగా.. భారీ అంచనాల మధ్యన మార్చి 29న థియేటర్స్ లో గ్రాండ్ గా రిలీజ్ అయింది. అంచనాలకు తగినట్లే థియేటర్స్ లో కూడా ఈ సినిమా తన సత్తా చూపిస్తూ మంచి కలెక్షన్స్ తో దూసుకుపోతుంది. మరి, ఈ సినిమా ఓటీటీ హక్కులను ఏ ప్లాట్ ఫార్మ్ సొంతం చేసుకుందో.. ఎప్పటినుంచి ఈ సినిమా ఓటీటీ లోకి రానుంది అనే విషయాల గురించి చూసేద్దాం.
ముగ్గు ప్రముఖ హీరోయిన్స్ ప్రధాన పాత్రలలో నటించిన ఈ సినిమాకు రాజేశ్ ఏ కృష్ణన్ దర్శకత్వం వహించారు. కాగా ఈ సినిమాలో టబు, కరీనా కపూర్, కృతి సనన్ ఎయిర్ హోస్టెస్ పాత్రలలో అలరించారు. ఈ సినిమాలో వీరితో పాటు.. దిల్జీత్, కపిల్ శర్మ, రాజేశ్ శర్మ, స్వస్థ ఛటర్జీ, కుల్‍భూషణ్ కర్బంద ముఖ్య పాత్రలలో నటించారు. ఇంకా ఈ చిత్రాన్ని బాలాజీ మోషన్ పిక్చర్స్, అనిల్ కపూర్ ఫిల్మ్స్ & కమ్యూనికేషన్స్ నెట్‍వర్క్ బ్యానర్లపై.. ఏక్తా కపూర్, రియా కపూర్, అనిల్ కపూర్, దిగ్విజయ్ పురోహిత్ కలిసి నిర్మించారు. అయితే ఈ మధ్య కాలంలో దాదాపు థియేటర్స్ లో విడుదలయ్యే సినిమాలన్నీ కూడా.. థియేటర్ రిలీజ్ కు ముందే ఓటీటీ పార్టనర్స్ ఆ సినిమాల డిజిటల్ రైట్స్ ను సొంతం చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో క్రూ సినిమా ఓటీటీ డీటెయిల్స్ కూడా బయటకు వచ్చాయి. ఈ సినిమా డిజిటల్ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. ఇక ఓటీటీ రూల్స్ ప్రకారం.. ఏ సినిమా అయినా థియేటర్ లో రిలీజ్ అయిన 8 వారాల తర్వాత ఓటీటీలోకి ఎంట్రీ ఇస్తుంది. ఈ లెక్కన క్రూ సినిమా మే 24వ తేదీన నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుందనే టాక్ నడుస్తోంది.
క్రూ సినిమా రిలీజ్ అయిన పది రోజులలోనే.. రూ.100 కోట్ల క్లబ్‍లోకి వచ్చేసింది. దీనిని బట్టే ఈ సినిమా రేంజ్ ఏంటో ఈజీగా చెప్పేయొచ్చు.. ఇప్పటికి కూడా ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్స్ కొల్లగొడుతూనే ఉంది. ఇక క్రూ సినిమా కథ విషయానికొస్తే.. ముగ్గురు ఎయిర్ హోస్టెస్ జీతాలు సరిగా వారికీ జీతాలు అందకపోవడంతో.. అక్రమంగా డబ్బు సంపాదించాలని అనుకుంటూ ఉంటారు.
కానీ, కంపెనీ వారు మాత్రం ఎప్పటికప్పుడు వాళ్ళ జీతాలను ఇవ్వకుండా ఏవో ఒక సాకులు చెబుతూనే ఉంటారు. డబ్బు అవసరం ఉంది కాబట్టి.. ఆ సమస్యలను పరిష్కరించుకునేందుకు వీరు అక్రమంగా డబ్బు సంపాదించుకునేందుకు రెడీ అవుతారు. ఈ క్రమంలో వారు ఏ మార్గాన్ని ఎంచుకున్నారు! వాళ్ళకి ఎదురైనా సమస్యలు ఏంటి అనేది తెలుసుకోవాలంటే ఈ సినిమా చూడాల్సిందే. మరి క్రూ సినిమా ఓటీటీ ఎంట్రీ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.