Swetha
భాషతో సంబంధం లేకుండా ఓటీటీలో రిలీజ్ అయ్యే సినిమాలకు.. ఆదరణ బాగా లభిస్తోంది. ఈ క్రమంలో.. తాజాగా ఖైదీ ఫేమ్ అర్జున్ దాస్ హీరోగా నటించిన.. తమిళ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. మరి, ఈ సినిమా ఓటీటీ వివరాల గురించి తెలుసుకుందాం.
భాషతో సంబంధం లేకుండా ఓటీటీలో రిలీజ్ అయ్యే సినిమాలకు.. ఆదరణ బాగా లభిస్తోంది. ఈ క్రమంలో.. తాజాగా ఖైదీ ఫేమ్ అర్జున్ దాస్ హీరోగా నటించిన.. తమిళ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. మరి, ఈ సినిమా ఓటీటీ వివరాల గురించి తెలుసుకుందాం.
Swetha
కేవలం తెలుగు సినిమాలు మాత్రమే కాకుండా.. తమిళ, మలయాళ సినిమాలు కూడా ప్రేక్షకులను బాగా అలరిస్తున్నాయి. ఇతర భాషల సినిమాలన్నిటిని కూడా.. ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చెనందుకు.. కేర్ ఆఫ్ అడ్రస్ గా మారాయి.. ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ ఈ క్రమంలో.. ప్రతి వారం పదుల సంఖ్యలో.. అన్ని భాషల చిత్రాలు, వెబ్ సిరీస్ లు ఓటీటీలో సందడి చేస్తున్నాయి. మరి కొన్ని సినిమాలైతే ఎటువంటి ముందస్తు ప్రకటన లేకుండా.. ఓటీటీ లో సైలెంట్ గా స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా ఖైదీ ఫేమ్ అర్జున్ దాస్ హీరోగా నటించిన తమిళ సినిమా “పోర్” .. మార్చి 29 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. మరి, ఈ సినిమా ఏ ప్లాట్ ఫార్మ్ లో స్ట్రీమింగ్ అవుతుందో, ఈ సినిమా కథ ఎలా ఉండబోతుందో చూసేద్దాం.
ఇక అర్జున్ దాస్ లోకేష్ కనకరాజ్ సినిమాలతో ఇతను బాగా ఫేమస్ అయిపోయాడు. ఇలా ఇతర సినిమాలలో మెయిన్ రోల్స్ చేస్తూనే.. మరోవైపు సినిమాలు చేస్తున్నాడు. ఈ క్రమంలోనే అతను హీరోగా తెరకెక్కిన సినిమా “పోర్”. ఈ సినిమాకు బిజోయ్ నంబియార్ దర్శకత్వం వహించారు. పైగా ఈ సినిమా ఒకేసారి తమిళ, హిందీ భాషలలో తెరకెక్కింది. పోర్ సినిమా తమిళ వెర్షన్ అర్జున్ దాస్, కాళీ దాస్ జయరాం ప్రధాన పాత్రలలో నటించగా.. హిందీ వెర్షన్ లో హర్షవర్ధన్ రాణే, ఎహాన్ భట్ హీరోలుగా నటించారు. ఇక హిందిలో ఈ సినిమాను “డంగే” పేరుతో.. రిలీజ్ అయింది. మార్చి 1న థియేటర్ లో రిలీజ్ అయినా ఈ సినిమా.. పాజిటివ్ టాక్ తెచ్చుకోగా.. నెల రోజుల లోపే సైలెంట్ గా ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చేసింది. మార్చి 29నుంచి ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.
ఇక పోర్ సినిమా కథ విషయానికొస్తే.. కాలేజ్ స్టూడెంట్స్ మధ్య జరిగే లవ్ స్టోరీస్, గొడవలు, సరదాలతో ఈ సినిమాను తెరకెక్కించారు. సీనియర్ స్టూడెంట్ అయిన అర్జున్ దాస్ తో.. ఓ జూనియర్ గొడవ పడతాడు. వారి గొడవ ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుంది. కాలేజ్ డేస్ లో ఇటువంటివి అన్ని సహజమే అయినా కూడా.. ఈ సినిమాలో దర్శకుడు వాటిని చిత్రీకరించిన తీరు ఓ విధంగా.. యూత్ ను బాగా ఆకట్టుకుంటుంది. ఇక అర్జున్ దాస్ విషయానికొస్తే.. కమల్ హాసన్ నటించిన విక్రమ్ సినిమాలో.. విజయ్ మాస్టర్ తో పాటు నటించాడు అర్జున్ దాస్. అలాగే ఖైదీ సినిమాలోనూ విలన్ గ్యాంగ్ లో పని చేసే.. అండర్ కవర్ పోలీస్ ఆఫీసర్ గా కూడా ఒక కొత్త రోల్ లో ప్రేక్షకులను మెప్పించాడు. ముఖ్యంగా ఇతని నటనకంటే కూడా ఇతని వాయిస్ కే ఎక్కువమంది అభిమానులు ఉంటారు. మరి, నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతున్న.. పోర్ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.