iDreamPost
android-app
ios-app

నాని HIT 3 OTT స్ట్రీమింగ్ డేట్ ఇదే !

  • Published May 15, 2025 | 11:05 AM Updated Updated May 15, 2025 | 11:05 AM

ఎంత థియేటర్ లో సినిమాలు చూసినా కానీ OTT లో ఆ మూవీ ఎప్పుడెప్పుడు వస్తుందా అని అంతా ఎదురుచూస్తూ ఉంటారు. ఈ క్రమంలో రీసెంట్ గా నాని హిట్ 3 మూవీ OTT స్ట్రీమింగ్ డేట్ ను ఫిక్స్ చేసినట్లు తెలుస్తుంది.

ఎంత థియేటర్ లో సినిమాలు చూసినా కానీ OTT లో ఆ మూవీ ఎప్పుడెప్పుడు వస్తుందా అని అంతా ఎదురుచూస్తూ ఉంటారు. ఈ క్రమంలో రీసెంట్ గా నాని హిట్ 3 మూవీ OTT స్ట్రీమింగ్ డేట్ ను ఫిక్స్ చేసినట్లు తెలుస్తుంది.

  • Published May 15, 2025 | 11:05 AMUpdated May 15, 2025 | 11:05 AM
నాని HIT 3 OTT స్ట్రీమింగ్ డేట్ ఇదే !

న్యాచురల్ స్టార్ నాని నటించిన హిట్ 3 మూవీ.. థియేటర్స్ లో సూపర్ హిట్ సాధించింది. సాధారణంగా ఇలాంటి జోనర్ మూవీస్ యూత్ ని బాగా అట్ట్రాక్ట్ చేస్తాయి. కానీ ఇక్కడ నాని సినిమా అవ్వడంతో ఏజ్ తో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు థియేటర్స్ లో క్యూ కట్టారు. నాని ఈ సినిమాకు బిగ్ అసెట్ అని చెప్పి తీరాల్సిందే. తెలుగు స్టేట్స్ నుంచి యూఎస్ మార్కెట్ వరకు హిట్ 3 భారీ వసూళ్లు సాధించింది. ఇప్పటికి థియేటర్స్ లో ఈ మూవీ రన్ అవుతూనే ఉంది. సాధారణంగా సినిమా థియేటర్స్ లో మంచి వసూళ్లు సాధిస్తున్నప్పుడు అంత త్వరగా OTT డేట్ ను అనౌన్స్ చేయరు. కానీ హిట్ 3 మేకర్స్ మాత్రం ఈ మూవీ స్ట్రీమింగ్ డేట్ ను లాక్ చేసినట్లు తెలుస్తుంది. కాగా ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ OTT ప్లాట్ ఫార్మ్ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమాను జూన్ 5 నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుందని టాక్ వినిపిస్తుంది. త్వరలోనే దీనిపై అఫీషియల్ అనౌన్స్మెంట్ చేయనున్నారు మేకర్స్. కాబట్టి ఇంకా బృటల్ వైలెంట్ థ్రిల్లర్ ఎవరైనా మిస్ అయితే వెంటనే చూసేయండి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.