P Venkatesh
మూవీ లవర్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న మీర్జాపూర్ సీజన్ 3 వెబ్ సిరీస్ త్వరలోనే విడుదల కానుంది. ఆ ఓటీటీ ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ కాబోతున్నట్లు తెలుస్తోంది.
మూవీ లవర్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న మీర్జాపూర్ సీజన్ 3 వెబ్ సిరీస్ త్వరలోనే విడుదల కానుంది. ఆ ఓటీటీ ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ కాబోతున్నట్లు తెలుస్తోంది.
P Venkatesh
ప్రస్తుతం వెబ్ సిరీస్ ల కాలం నడుస్తోంది. ఆడియెన్స్ అభిరుచులకు తగినట్లుగా వెబ్ సిరీస్ లను రూపొందించి ఓటీటీ ప్లాట్ ఫామ్ ల వేదికగా విడుదల చేస్తున్నారు. అందుకే ఓటీటీ కంటెంట్‌కు మంచి ఆదరణ లభిస్తోంది. కథలో దమ్ముంటే ప్రేక్షకుల నుంచి ఎప్పుడైన ఆదరణ లభిస్తుందని నిరూపించింది మీర్జాపూర్ వెబ్ సిరీస్. 2018లో వచ్చిన మీర్జాపూర్ మొదటి సీజన్ రికార్డ్ వ్యూస్ తో అదరగొట్టింది. అమెజాన్ ప్రైమ్ లో విడుదలైన ఈ సిరీస్ కు మూవీ లవర్స్ బ్రహ్మరథం పట్టారు. దీంతో రెండో సీజన్ కూడా ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చారు. మీర్జాపూర్ రెండో సీజన్ కు కూడా సూపర్ హిట్ అయ్యింది. ఈ నేపథ్యంలో మీర్జాపూర్ సీజన్ 3కి బీజం పడింది. త్వరలోనే ఓటీటీలో విడుదల కానుంది.
మీర్జాపూర్ సీజన్ 3 విడుదలపై ఆడియెన్స్ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. రెండు సీజన్స్ హిట్ అవ్వడంతో మూడో సీజన్ అంతకు మించి ఉండేలా ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఇంట్రెస్టింగ్ స్టోరీతో సినీ లవర్స్ ను మీర్జాపూర్ సీజన్ 3 అలరించబోతోంది. మూడో సీజన్ విడుదలపై సోషల్ మీడియా వేదికగా జోరుగా చర్చ నడుస్తోంది. క్రైమ్, థ్రిల్లర్ యాక్షన్ నేపథ్యంలో రూపొందుతున్న మూడో భాగం వచ్చే మార్చి నెల చివరి వారంలో అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమ్ అవుతున్నట్లు తెలుస్తుంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
ఈ వెబ్ సిరీస్‌ను కరణ్ అన్షుమన్, గుర్మీత్ సింగ్‌లు తెరకెక్కించారు. ఉత్తరప్రదేశ్‌లోని మీర్జాపూర్ నేపథ్యంలో ఈ సిరీస్‌లను తెరకెక్కించారు. మొదటి సీజన్ 2018 నవంబరు 16న విడుదలైంది. ఇక దీనికి కొనసాగింపుగా 2020 అక్టోబరు 23న రెండో సీజన్ రిలీజ్ అయింది. ఇది కూడా సూపర్ హిట్ అయ్యింది. తొలి సీజన్‌లో గుడ్డూ భయ్యా, తన తమ్ముడు బబ్లూ, భార్య శ్వేతలను మున్నా ఎన్ని ఇబ్బందులు పెట్టాడో చూపించారు. రెండో సీజన్లో మున్నాపై గుడ్డూ భయ్యా ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడో చూపించారు. ఈ రెండు సీజన్లకు రికార్డుస్థాయిలో వ్యూవర్ షిప్ వచ్చింది. దీంతో మోస్ట్ పాపులర్ ఇండియన్ వెబ్ సిరీస్‍గా మీర్జాపూర్ అదరగొట్టింది. మరి మీర్జాపూర్ సీజన్ 3 విడుదలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.