Krishna Kowshik
సంక్రాంతి రేసులో పోటీ పడిన పాన్ ఇండియా చిత్రం హనుమాన్. ఓ సూపర్ హీరో కథను తనదైన స్టైల్లో అందించాడు ప్రశాంత్ వర్మ. చిన్న సినిమాగా వచ్చి ప్రభంజనం సృష్టించిన హనుమాన్ ఓటీటీలో ఇదిగో వచ్చేస్తుందంటూ వార్తలు వచ్చాయి. కానీ
సంక్రాంతి రేసులో పోటీ పడిన పాన్ ఇండియా చిత్రం హనుమాన్. ఓ సూపర్ హీరో కథను తనదైన స్టైల్లో అందించాడు ప్రశాంత్ వర్మ. చిన్న సినిమాగా వచ్చి ప్రభంజనం సృష్టించిన హనుమాన్ ఓటీటీలో ఇదిగో వచ్చేస్తుందంటూ వార్తలు వచ్చాయి. కానీ
Krishna Kowshik
ఇలా థియేటర్లలో విడుదలైన సినిమాలు అలా ఓటీటీకి వచ్చేసి సందడి చేస్తున్నాయి. థియేటర్లలో మిస్ అయిన ప్రేక్షకులంతా డిజిటల్ ఫ్లాట్ ఫాంలోకి వచ్చాక చూస్తున్నారు. కొన్ని సినిమాలు రిలీజైన నెల రోజుల్లోపే ఓటీటీలోకి వచ్చేస్తుంటే.. మరి కొన్ని చిత్రాలు.. నెల ఇలా గడిచిన వారం రోజుల్లో ఎంటర్ టైన్ చేస్తున్నాయి. కానీ సంక్రాంతి బరిలోకి దిగిన హనుమాన్ మూవీ ఊరిస్తోంది. సినిమా విడుదలై.. నెల రోజులు దాటి పోయింది. ఇటీవల అర్థ శతాబ్ద వేడుకలను కూడా చేసుకుంది చిత్ర యూనిట్. అంతలో ఈ సినిమా మార్చి 8 న అనగా శివ రాత్రి సందర్భంగా ఓటీటీలోకి వచ్చేస్తుదంటూ ప్రచారం జరిగింది. ఈ సినిమా వాచ్ చేయాలనుకున్న వారంతా హనుమాన్ చిత్రం కోసం ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు.
ఈ తరుణంలో హనుమాన్ ఓటీటీ హక్కులు కొనుగోలు చేసిన జీ5 పిడుగులాంటి వార్త చెప్పింది. హనుమాన్ ఓటీటీ ఫ్లాట్ ఫాంలో ఎప్పుడు రిలీజ్ చేస్తారో కన్ఫమ్ చేస్తారా అంటూ ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చింది జీ5. ‘హాయ్.. ఈ వియంలో మాకు ఎలాంటి అప్డేట్ లేదు. మరిన్ని అప్ డేట్స్ కోసం దయచేసి మా వెబ్ సైట్, సోషల్ మీడియా హ్యాండిల్ పై ఓ కన్నేసి ఉంచండి’ అంటూ కొంటె రిప్లై ఇచ్చింది. దీన్ని బట్టి చూస్తే.. మార్చి 8న హనుమాన్ చిత్రం ఓటీటీలోకి రావడం లేదని కన్ఫమ్ అయిపోయింది. దీంతో ఫ్యాన్స్ నిరాశ చెందుతున్నారు. ఇంతకు ఓటీటీలో వస్తుందో రాదో కూడా తెలియదు. దీనిపై చిత్ర యూనిట్ స్పందించాల్సి ఉంది.
ప్రశాంత్ వర్మ- తేజ సజ్జా కాంబోలో వచ్చిన రెండో చిత్రం హనుమాన్. చిన్న చిత్రంగా వచ్చిన హనుమాన్.. పాన్ ఇండియా వైడ్‌గా రిలీజై.. రూ. 300 కోట్ల వర్షం కురిపించిన సంగతి విదితమే. సంక్రాంతి బరిలో జనవరి 12న విడుదలయ్యింది. గుంటూరు కారం చిత్రాన్ని తట్టుకుని భారీ కలెక్షన్లను కొల్లగొట్టింది. ఈ చిత్రంపై ప్రశాంత్ పెట్టుకున్న నమ్మకం పోలేదు. అమృత అయ్యర్, వరలక్ష్మి శరత్ కుమార్, గెటప్ శ్రీను, వినయ్ రాయ్ కీలక పాత్రలు పోషించారు. నిరంజన్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ మూవీతో విడుదలైన చిత్రాలన్నీ.. ఓటీటీలోకి వచ్చి సందడి చేసేస్తుంటే..హనుమాన్ మూవీ గురించి ఎటువంటి అప్ డేట్ లేకపోవడంతో ఫ్యాన్స్ నిరాశకు గురౌతున్నారు. ఇక ఓటీటీ విడుదల మరింత ఆలస్యం అయ్యేట్లు కనిపిస్తోంది.
Hi! We have not received any update in this regard. Please keep an eye on our website and social handles for more updates!
— ZEE5 (@ZEE5India) March 7, 2024