iDreamPost
android-app
ios-app

OTT Movie: రెండు త‌ల‌ల పాము కాన్సెప్ట్ పై సూపర్ సినిమా! ఓటీటీలోకి వచ్చేస్తోంది!

  • Published Mar 27, 2024 | 2:13 PM Updated Updated Mar 27, 2024 | 2:13 PM

జనవరి 5న చిన్న సినిమాగా థియేటర్ లో రిలీజ్ అయిన డబుల్ ఇంజిన్ మూవీ .. ఇప్పుడు ఓటీటీలో ఎంట్రీ ఇవ్వనుంది. ఈ సినిమాకు సంబంధించిన ఓటీటీ డీటెయిల్స్ ఇలా ఉన్నాయి.

జనవరి 5న చిన్న సినిమాగా థియేటర్ లో రిలీజ్ అయిన డబుల్ ఇంజిన్ మూవీ .. ఇప్పుడు ఓటీటీలో ఎంట్రీ ఇవ్వనుంది. ఈ సినిమాకు సంబంధించిన ఓటీటీ డీటెయిల్స్ ఇలా ఉన్నాయి.

  • Published Mar 27, 2024 | 2:13 PMUpdated Mar 27, 2024 | 2:13 PM
OTT Movie: రెండు త‌ల‌ల పాము కాన్సెప్ట్ పై సూపర్ సినిమా! ఓటీటీలోకి వచ్చేస్తోంది!

ప్రతి వారం ఓటీటీలో పదుల సంఖ్యలో సినిమాలు విడుదల అవుతూనే ఉన్నాయి . రోజు రోజుకి ఓటీటీలకు ఆదరణ బాగా పెరిగిపోతుంది. అయితే, వీటిలో కొన్ని సినిమాలు మాత్రం ఎటువంటి ప్రచారం, హైప్ లేకుండా ఓటీటీ లోకి ఎంట్రీ ఇచ్చేస్తూ ఉంటాయి. థియేటర్ లో రిలీజ్ అయిన సమయంలో ఎటువంటి టాక్ సంపాదించుకోలేకపోయినా కూడా.. ఓటీటీలో మాత్రం మంచి వ్యూవర్ షిప్ తో దూసుకుపోతూ ఉంటాయి. ఇప్పటివరకు అటువంటి సినిమాలు ఎన్నో వచ్చాయి. ఈ క్రమంలోనే తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో క్రైమ్ థ్రిల్ల‌ర్ క‌థాంశంతో తెరకెక్కిన “డబుల్ ఇంజిన్” అనే మూవీ థియేటర్ లో రిలీజ్ అయ్యి.. ఎటువంటి టాక్ సంపాదించుకోలేకపోయింది . ఇక ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ ఎంట్రీకి రెడీ అయింది. ఈ సినిమాకు సంబంధించిన ఓటీటీ డీటెయిల్స్ ఇలా ఉన్నాయి.

“డబుల్ ఇంజిన్” సినిమాలో .. గాయత్రీ గుప్తా ప్రధాన పాత్రలో నటించింది. ఆమె సినిమాల కంటే కూడా.. ఎక్కువ వివాదాలతోనే టాలీవుడ్ లో బాగా ఫేమస్ అయింది. ఈ సినిమాకు రోహిత్ పెనుమాత్స ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. పైగా ఈ సినిమాకు కేవలం 30లక్షల బడ్జెట్ ను మాత్రమే కేటాయించి.. 12రోజుల్లోనే ఈ సినిమాకు పూర్తి చేశారు. ఈ సినిమాను పూర్తి తెలంగాణ యాసతో తెరకెక్కించారు. కాగా, ఈ సినిమాలో ముని, అజిత్ కుమార్‌, రోహిత్ న‌ర‌సింహ‌, రాజు తో గాయ‌త్రి గుప్తా ముఖ్య పాత్రలు పోషించారు. జనవరి 5న ఈ సినిమా థియేటర్ లో రిలీజ్ అయింది. కేవలం గంట న‌ల‌భై ఐదు నిమిషాల నిడివితోనే ఈ మూవీని రూపొందించారు. కానీ, ప్రేక్షకులను మాత్రం అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఇక ఈ సినిమా ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ ఆహలో మార్చి 29 నుంచి స్ట్రీమింగ్ కానుంది.

ఇక డబుల్ ఇంజిన్ సినిమా కథ విషయానికొస్తే.. కొన్ని యథార్థ సంఘటనలతో.. దర్శకుడు ఈ సినిమాను తెరకెక్కించాడు. హైదరాబాద్ లో ఆటో డ్రైవర్ గా పనిచేస్తోన్న ఓ యువకుడు.. తన స్నేహితుడిని కలిసేందుకు పల్లెటూరికి వెళ్తాడు. రెండు తలల పామును అమ్మి డబ్బు బాగా సంపాదించాలని ఆ స్నేహితులిద్దరూ ప్లాన్ చేస్తుంటారు. ఇక ఈ క్రమంలో వారు ఎలాంటి కష్టాలు పడ్డారు! వారికీ రెండు తలల పాము దొరికిందా లేదా! అసలు ఆ బిజినెస్ వర్క్ ఔట్ అయిందా లేదా ! అనేవి తెలుసుకోవాలంటే ఈ సినిమాను చూడాల్సిందే. ఇక ఈ సినిమా ఓటీటీ ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటుందో వేచి చూడాలి. మరి “డబుల్ ఇంజిన్” సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.