Swetha
ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ లోకి వచ్చే తెలుగు సినిమాలను ఎలానూ చూస్తూనే ఉంటారు. కానీ బాలీవుడ్, హాలీవుడ్ సినిమాలను కూడా తెలుగులో చూస్తే ఆ కిక్ ఏ వేరు అనుకుంటూ ఉంటారు తెలుగు మూవీ లవర్స్. ఈ క్రమంలో తాజాగా కొన్ని ఇతర భాషల సినిమాలు తెలుగులోకి వచ్చేశాయి.
ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ లోకి వచ్చే తెలుగు సినిమాలను ఎలానూ చూస్తూనే ఉంటారు. కానీ బాలీవుడ్, హాలీవుడ్ సినిమాలను కూడా తెలుగులో చూస్తే ఆ కిక్ ఏ వేరు అనుకుంటూ ఉంటారు తెలుగు మూవీ లవర్స్. ఈ క్రమంలో తాజాగా కొన్ని ఇతర భాషల సినిమాలు తెలుగులోకి వచ్చేశాయి.
Swetha
తెలుగులో ఎప్పటికప్పుడు ఎన్ని సినిమాలు, సిరీస్ లు వచ్చినా కూడా.. కొంతమంది హాలీవుడ్ మూవీస్ ని చూసేందుకు కూడా ఇష్టపడుతూ ఉంటారు. అయితే చాలా వరకు హాలీవుడ్ చిత్రాలు తెలుగులో ఉండవు కాబట్టి కొంతమంది చూడాలనే ఆశక్తి ఉన్నా కూడా.. లాంగ్వేజ్ ప్రాబ్లమ్ వలన లైట్ తీసుకుంటూ ఉంటారు. అటువంటి వారి కోసమే కొన్ని హాలీవుడ్ చిత్రాలు తెలుగులో అందుబాటులోకి వచ్చేశాయి. హాలీవుడ్ లో “పైరెట్స్ ఆఫ్ ది కరీబియన్” సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచాయి. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాలకు పాపులారిటీ బాగా పెరిగింది. 2003 నుంచి 2017 మధ్య వచ్చిన సుమారు ఐదు చిత్రాలు.. గ్లోబల్ వైస్ గా సూపర్ సక్సెస్ అందుకున్నాయి. ఇక ఇప్పుడు ఈ సినిమాలు తెలుగులో అందుబాటులోకి వచ్చేశాయి. మరి ఈ సినిమాలు ఏ ప్లాట్ ఫార్మ్ లో అందుబాటులో ఉన్నాయో చూసేద్దాం.
పైరెట్స్ ఆఫ్ ది కరీబియన్ చిత్రాలలో జానీడెప్ హీరోగా నటించాడు. ఈ సినిమాలలో కెప్టెన్ జాక్ స్పారో పాత్ర ఓ కల్ట్ క్లాసిక్‍గా నిలిచిపోయింది. ఇప్పటికి సోషల్ మీడియాలో ఈ చిత్రాలకు సంబంధించిన రీల్స్, మీమ్స్ ను అడపాదడపా చూస్తూనే ఉంటాము. పైరెట్స్ ఆఫ్ ది కరీబియన్ ఐదు సినిమాలు తెలుగు డబ్బింగ్‍లోకి వచ్చేశాయి. అవేంటంటే.. పైరెట్స్ ఆఫ్ కరీబియన్ సిరీస్‍లో ‘ది కర్స్ ఆఫ్ ది బ్లాక్ పర్ల్’ (2003), డెడ్ మ్యాన్స్ చెస్ట్ (2006), అట్ వరల్డ్స్ ఎండ్ (2007), ఆన్ స్ట్రేంజర్ టైడ్స్ (2011), డెడ్ మెన్ టెల్ నో టేల్స్ (2017) సినిమాలు. ఈ సినిమాలన్నీ కూడా సూపర్ సక్సెస్ ను అందుకున్నాయి. ఈ సినిమాలన్నీ కూడా ఇప్పుడు తెలుగులో ఒకే ప్లాట్ ఫార్మ్ లో అందుబాటులోకి వచ్చేసాయి. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఈ సినిమాలు స్ట్రీమింగ్ అవుతున్నాయి. సో ఈ సినిమాలపై ఆసక్తి కలిగిన వారు వెంటనే ఈ సినిమాలను చూసేయండి.
పైరెట్స్ ఆఫ్ కరీబియన్ సిరీస్ లో మొదటి మూడు చిత్రాలకు గోర్ వెర్‌బిన్‍స్కి దర్శకత్వం వహించారు. ఇక నాలుగు ఐదు పార్ట్శ్ కు మాత్రం.. రామ్ మార్షల్, స్పెన్ సాండ్‍బర్గ్, జోకియామ్ రోనీంగ్ దర్శకత్వం వహించారు. ఇక ఈ సినిమాలలో జానీ డెప్‍తో పాటు జియోఫ్రే రష్, కెవిన్ మ్యాక్‍నాలీ, ఒర్లాండో బ్లూమ్, కీరా ముఖ్య పాత్రలు పోషించారు. సముద్ర దొంగ కెప్టెన్ జాక్ స్పారోగా జానీ డెప్ కు నటనకు ప్రత్యేక ప్రశంసలు దక్కాయి. ఆ పాత్ర అతను తప్ప మరెవరు ఆ స్థాయిలో చేయలేరేమో అనేంతలా లీనమైపోయాడని చెప్పి తీరాలి. ఇక ఇప్పుడు పైరెట్స్ ఆఫ్ ది కరీబియన్ సిరీస్‍లో.. ఆరో సినిమాను కూడా తీసుకొచ్చేందుకు మేకర్స్ ప్రయత్నిస్తున్నారు. ఈ సినిమా కూడా ప్రత్యేకమైన స్థానం దక్కించుకుంటుందని చెప్పడంలో ఏ సందేహం లేదు. మరి ఈ సినిమాలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.