iDreamPost
android-app
ios-app

Devil Movie: సడెన్‌గా OTTలోకి డెవిల్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

  • Published Jan 13, 2024 | 1:59 PM Updated Updated Jan 13, 2024 | 1:59 PM

బింబిసారతో హిట్ పెయిర్ గా పేరు తెచ్చుకున్న నందమూరి కళ్యాణ్ రామ్, సంయుక్తా మీనన్.. మరోసారి జత కట్టిన మూవీ డెవిల్. గత నెల 29న విడుదలైన సంగతి విదితమే. ఇప్పుడు ఈ మూవీ ఓ గుడ్ న్యూస్ చెప్పింది.

బింబిసారతో హిట్ పెయిర్ గా పేరు తెచ్చుకున్న నందమూరి కళ్యాణ్ రామ్, సంయుక్తా మీనన్.. మరోసారి జత కట్టిన మూవీ డెవిల్. గత నెల 29న విడుదలైన సంగతి విదితమే. ఇప్పుడు ఈ మూవీ ఓ గుడ్ న్యూస్ చెప్పింది.

  • Published Jan 13, 2024 | 1:59 PMUpdated Jan 13, 2024 | 1:59 PM
Devil Movie: సడెన్‌గా OTTలోకి డెవిల్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

సక్సెస్, ఫెయిల్యూర్ పక్కన పెట్టి డిఫరెంట్ కథలతో ప్రేక్షకులను అలరిస్తున్న నటుడు నందమూరి కళ్యాణ్ రామ్. తాజాగా ఆయన నటించిన చిత్రం డెవిల్. బింబిసార సక్సెస్ జోడి నందమూరి కళ్యాణ్ రామ్, సంయుక్తా మీనన్ ఈ మూవీతో మరోసారి జత కట్టారు. కళ్యాణ్ రామ్ తొలి పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన ఈ చిత్రం గత ఏడాది చివరిలో విడుదలైంది. అభిషేక్ పిక్చర్స్ పతాకంపై అభిషేక్ నామా నిర్మించి, తెరకెక్కించాడు. సీత, అజయ్, సత్య, ఎస్తేర్, మాళవిక నాయర్ కీలక పాత్రలు పోషించారు. డెవిల్ సినిమాలో కళ్యాణ్ రామ్ బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్‌గా ఆకట్టుకున్నాడు. అయితే రివ్యూస్ పరంగా మిక్స్ డ్ టాక్ తెచ్చుకుంది. ఈ మూవీ కోసం సుమారు రూ. 45 కోట్లు రూపాయలను ఖర్చు చేసినట్లు ఓ ఇంటర్వ్యూలో అభిషేక్ నామా వెల్లడించిన సంగతి విదితమే.

ఇప్పడు ఈ మూవీ ఓ గుడ్ న్యూస్ చెప్పింది. మొన్నటి వరకు   థియేటర్లలో అలరించిన ఈ మూవీ ఓటీటీలోకి సడెన్ ఎంట్రీ ఇస్తోంది. మరికొన్ని గంటల్లో డెవిల్ మూవీ ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు వచ్చేస్తోంది. రిలీజైన 17 రోజుల్లోనే ఫ్లాట్ ఫాంలోకి రాబోతుంది ఈ చిత్రం. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ ఫ్యాన్సీ రేటుకు డెవిల్ ఓటీటీ హక్కులను కొనుగోలు చేసింది. అంటే జనవరి 14 నుండి ప్రపంచ వ్యాప్తంగా స్ట్రీమింగ్ కానుంది. ముందస్తు ఎనౌన్స్ చేయకుండానే.. నెల రోజులు కూడా దాటకుండానే రాబోతుంది. శనివారం నుండి అమెజాన్ ప్రైమ్‌లో ఈ మూవీని చూసేయచ్చు. తెలుగు,తమిళ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. కన్నడ, మలయాళం డబ్బింగ్ వెర్షన్ తర్వలో విడుదల చేయనున్నారు.

ఇక సినిమా విషయానికి వస్తే.. 1945 ప్రాంతంలో ఈ మూవీ నడుస్తుంది . నేతాజీ సుభాష్ చంద్రబోస్ పట్టుకునేందుకు అప్పటి బ్రిటీష్ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది. అలాంటి టైంలో బోస్ భారత్‌లోకి అడుగుపెట్టాడు అని సమాచారం అందుతుంది బ్రిటీష్ ఏజెన్సీలకు. బోస్ ను ఎలాగైనా పట్టుకోవాలని అనుకుంటాయి. అంతలో మద్రాస్ ప్రెసిడెన్సీలోని రాసపాడు జమీందారు కూతురు హత్య జరగడం, కూతుర్ని హత్య చేశాడన్న ఆరోపణలపై జమీందారును అరెస్టు చేయడం.. ఈ కేసును చేధించేందుకు బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్ డెవిల్ రంగంలోకి దిగడం కథ. అలాగే ఈ కేసుకు, బోస్‌‌ను పట్టుకునే స్టోరీకి లింక్ ఏంటీ అనేది మూవీలో చూడాల్సిందే. మరికొన్ని గంటల్లోనే ఓటీటీ లవర్స్ ను పలకరించనుంది డెవిల్ మూవీ. చూసి ఎలా ఉందో కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetstarzbetstarzbetStarzbetjojobetcratosroyalbetcasibomcasibomcasibombetcio giriş