iDreamPost
android-app
ios-app

Animal OTT: ఓటీటీలోకి వచ్చేసిన యానిమల్‌.. అర్థరాత్రి నుంచే స్ట్రీమింగ్‌

సందీప్ రెడ్డి వంగా నిర్మించిన యానిమల్ చిత్రం ఓటీటీలోకి వచ్చేసింది. జనవరి 25 అర్థరాత్రి నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్‌ అవుతుంది.

సందీప్ రెడ్డి వంగా నిర్మించిన యానిమల్ చిత్రం ఓటీటీలోకి వచ్చేసింది. జనవరి 25 అర్థరాత్రి నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్‌ అవుతుంది.

Animal OTT: ఓటీటీలోకి వచ్చేసిన యానిమల్‌.. అర్థరాత్రి నుంచే స్ట్రీమింగ్‌

సందీప్ రెడ్డి వంగా- యానిమల్ మూవీ.. ఇండియన్ సినిమాలో ఈ రెండు పేర్లు సంచలనం అనే చెప్పాలి. డిసెంబర్ 1న విడుదలైన ఈ సినిమాకి వరల్డ్ వైడ గా పెద్ద ఎత్తున రెస్పాన్స్ వచ్చింది. సినిమా లవర్స్ అందరూ యానిమల్ కు బ్రహ్మరథం పట్టారు. తండ్రీకొడుకుల మధ్య ప్రేమను ఇంత బాగా చూపించొచ్చా? ఇంత ఎమోషనల్ గా చూపించొచ్చా అంటూ ప్రేక్షకులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. సందీప్ వంగా డైరెక్షన్, రణ్ బీర్ యాక్షన్ కు యావత్ దేశం ఫిదా అయిపోయింది. ఈ సినిమాని థియేటర్లో చూసినా కూడా ఓటీటీలోకి ఎప్పుడు వస్తుంది అంటూ అంతా ఎదురుచూశారు. వారి నిరీక్షణ ఫలించే టైమ్‌ వచ్చింది. జనవరి 25 అర్థరాత్రి నుంచి ఓటీటీలో స్ట్రీమ్‌ అవుతోంది.

యానిమల్ మూవీ ముందుగా అనుకున్నట్లుగానే జనవరి 26న నెట్ ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ అవుతుంది. అంతేకాకుండా సినిమా డ్యూరేషన్ కూడా పెరిగింది. ఇప్పటికే ఈ సినిమా 3 గంటల 22 నిమిషాలు ఉంది. ఇప్పుడు అది కాస్తా 3 గంటల 30 నిమిషాలు అయ్యింది. నిర్మాత కోరిక మేరకు ముందుగా తీసిన సినిమాని సందీప్ రెడ్డి వంగా 8 నిమిషాలు ట్రిమ్ చేశాడు. అయితే అన్ కట్ వర్షన్ ని ఓటీటీలో రిలీజ్ చేస్తానంటూ గతంలో చెప్పాడు. చెప్పినట్లుగానే ఇప్పుడు కట్‌ వర్షన్‌ని యాడ్‌ చేశాడు. కచ్చితంగా సందీప్ రెడ్డి వంగా అన్ కప్ వర్షన్ మరింత ఆకట్టుకుంటుంది అంటూ అభిప్రాయపడుతున్నారు.

animal movie in ott

యానిమల్ సినిమా ఓటీటీ రిలీజ్ మీద స్టే కోరుతూ కేసు నమోదైన విషయం తెలిసిందే. దాంతో సినిమా ఫ్యాన్స్ కాస్త కంగారు పడ్డారు. ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ జరుగుతుందో.. లేదో అనే ఆందళోన నెలకొంది. అయితే ఇది యానిమల్ మూవీ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ఎందుకంటే సినీ వన్ 1 స్టూడియోస్, టీ సిరీస్, నెట్ ఫ్లిక్స్ మధ్య నెలకొన్న గందరగోళం ముగిసింది. వారు ఒక ఒప్పందానికి వచ్చారు. అదే విషయాన్ని కోర్టుకు కూడా తెలియజేశారు. దాంతో యానిమల్ ఓటీటీ రిలీజ్ కు దారులు తెరుచుకున్నాయి. వాళ్లంతా ఒక ఒప్పందానికి వచ్చి.. వారి మధ్య నెలకొన్న గందరగోళానికి శుభం పలికారు. ఇప్పుడు యానిమల్ సినిమా ఓటీటీలోకి వస్తోందని తెలిసి సినిమా అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.

ముఖ్యంగా రష్మిక, రణ్ బీర్ మధ్య జోయా పాత్ర విషయంలో జరిగే గొడవకు సంబంధిచింన సన్నివేసం నిడివి మరింత పెరగనుంది. నిజానికి ఆ సీన్ కి ఎంతో మంది కనెక్ట్ అయ్యారు. ఇప్పుడు ఆ సీన్ నిడివి మరింత పెంచబోతున్నారు అని తెలిసి ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఓటీటీలో కూడా యానిమల్ చిత్రం సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తుందని సందీప్ రెడ్డి వంగా అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. మరోవైపు యానిమల్ పార్క్ 2 మీద కూడా ఇప్పటి నుంచే ఊహాగానాలు మొదలు పెట్టారు. ఆ సినిమా ఎలా ఉండబోతోందో అని నెట్టింట ప్రశ్నలు కురిపిస్తున్నారు. మొత్తానికి ఓటీటీలోకి వచ్చేస్తున్న యానిమల్ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.