Tirupathi Rao
OTT Weekend Suggestions: ఓటీటీలో చాలానే వెబ్ సిరీస్లు ఉన్నాయి. కానీ, ఈ సస్పెన్స్ డ్రామా మాత్రం మీకు ఎంతో బాగా నచ్చుతుంది.
OTT Weekend Suggestions: ఓటీటీలో చాలానే వెబ్ సిరీస్లు ఉన్నాయి. కానీ, ఈ సస్పెన్స్ డ్రామా మాత్రం మీకు ఎంతో బాగా నచ్చుతుంది.
Tirupathi Rao
ఓటీటీలు వచ్చిన తర్వాత చాలానే సినిమాలు, వెబ్ సిరీస్ లు చూసుంటారు. నిజానికి కొన్ని కొన్ని స్టార్ట్ చేసిన తర్వాత అద్భుతంగా ఉన్నాయి అనే భావన కలుగుతుంది. ఇంకొన్ని మాత్రం అద్భుతంగా ఉన్నాయనే ఆలోచనతో స్టార్ట్ చేస్తే అవి కాస్తా నిరుత్సాహ పరుస్తాయి. కానీ, ఇప్పుడు చెప్పుకోబోయే వెబ్ సిరీస్ మాత్రం మీకు ఒక మంచి క్రైమ్ థ్రిల్లర్ చూశామే అనే భావన కలిగిస్తుంది. నిజానికి వెబ్ సిరీస్లు చూడాలంటే కాస్త ఓపిక ఎక్కువే ఉండాలి. అలాంటి వారికి ఈ సిరీస్ చాలా బాగా నచ్చేస్తుంది. ఎస్జే సూర్య కెరీర్లోనే ఇది చాలా మంచి క్రైమ్ డ్రామా అని చెప్పచ్చు. మరి.. ఆసిరీస్ అంత హిట్టు ఎందుకు అయ్యిందో చూద్దాం.
సాధారణంగా ఓటీటీల్లో చాలానే వెబ్ సిరీస్లు ఉంటాయి. కానీ, చాలా తక్కువ వెబ్ సిరీస్లు మాత్రమే ఆడియన్స్ అటెన్షన్ ని క్యాచ్ చేస్తాయి. అలాంటి లిస్టులోకి ఈ వెబ్ సిరీస్ కూడా చేరుతుంది. మనం ఇప్పుడు చెప్పుకుంటోంది ఎస్జే సూర్య, లైలా, సంజనా కృష్ణమూర్తి ప్రధాన పాత్రల్లో నటించిన వదంతి వెబ్ సిరీస్ గురించి. ఇది తమిళ్ సిరీస్ అయినప్పటికీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో తెలుగులో కూడా అందుబాటులో ఉంది. ఈ వందతి: ది ఫాబల్ ఆఫ్ వెలోనీ వెబ్ సిరీస్ డిసెంబర్ 2, 2022లో ప్రైమ్ వీడియోలో విడుదలైంది. అప్పటి నుంచి ఇప్పటివరకు మంచి సస్పెన్స్ డ్రామా అనగానే ఈ సిరీస్ రికమెండేషన్స్ లోకి వచ్చేస్తుంది.
ఈ సిరీస్ చూసిన వారిలో 92 శాతం మంది తమకు నచ్చిందని ఓట్ చేశారు. ఇందులో ఒక్కో ఎపిసోడ్ లో ఒక్కో ట్విస్ట్ రివీల్ అవుతూ ఉంటుంది. ఒక్కోసారి కథ డైవర్ట్ అవుతుందేమో అనే భావన కలుగుతుంది. కానీ, మన ఆలోచనలతో మనం డైవర్ట్ అవుతూ ఉంటాం. కానీ, డైరెక్టర్ ఆండ్రూ లూయిస్ మాత్రం కథను చాలా పకడ్బందీగా రాసుకున్నాడు. ఒక్కసారి స్టార్ట్ చేసిన తర్వాత ఉన్న 8 ఎపిసోడ్లను పూర్తి చేయాలి అనే భావన కలుగుతుంది. సిరీస్ ని ఆపేయాలి అంటే మనసు ఒప్పదు. చాలా అంటే చాలా వెబ్ సిరీస్లకు మాత్రమే ఇలాంటి భావన కలుగుతుంది. అలాంటి కోవలోకి ఈ వందతి సిరీస్ తప్పకుండా చేరుతుంది.
రూబీ(లైలా)కి ఒక చిన్న లాడ్జ్ ఉంటుంది. భర్తలేని ఆమె తన కుమార్తెతో కలిసి ఆ లాడ్జిని చూసుకుంటూ ఉంటుంది. తన కుమార్తె వెలోనీ(సంజనా) కాలేజ్ లో చదువుకుంటూ ఉంటుంది. ఒకరోజు సడెన్ గా వెలోనీ శవమై కనిపిస్తుంది. ఆమెను ఎవరు చంపారు అనే విషయంపై ఎవరికీ ఎలాంటి ఆధారాలు ఉండవు. ఆమె చావుపై మీడియా విచిత్రమైన కథనాలు ప్రచురిస్తూ ఉంటుంది. ఆమె వ్యక్తిత్వానికి తూట్లు పొడుస్తూ పలు కథనాలు వస్తాయి. ఈ కేసును ఎస్ఐ వివేక్(ఎస్జే సూర్య) టేకప్ చేస్తాడు. నిజానికి ఇది చాలా సింపుల్ కేసు అనుకుంటాడు. కానీ, దర్యాప్తు సాగే కొద్దీ కొత్త కొత్త కోణాలు వెలుగు చూస్తూ ఉంటాయి. ఈ కేసు కోసం వివేక్ తన వ్యక్తిగత జీవితాన్ని కూడా పణంగా పెడతాడు.
వెలోనీ కేసు ఎస్ఐ వివేక్ కి నిద్ర లేకుండా చేస్తుంది. రోజుకో కొత్త కోణం, కొత్త క్యారెక్టర్ ఎంటర్ అవుతూ ఉంటుంది. చివరికి ఈ కేసును ఛేదించకుండానే క్లోజ్ చేయడానికి రెడీ అయిపోతాడు. కానీ, ఆఖరికి అతనికి చిన్న ఆలోచన వస్తుంది. దాని ద్వారా కేసు కొత్త మలుపు తిరుగుతుంది. అసలు ఈ కేసును ఛేదించగలిగాడా? అసలు వెలోనీని ఎవరు చంపారు? ఆమెను చంపాల్సిన అవసరం ఎవరికి ఉంది? వెలోనీ ఆత్మహత్య చేసుకుందా? ఇలాంటి ఎన్నో ఆసక్తికర ప్రశ్నలకు ఈ సిరీస్ చూసి సమాధానాలు తెలుసుకోండి. మరి.. మీరు ఇప్పటికే వదంతి వెబ్ సిరీస్ చూసి ఉంటే.. మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.