iDreamPost
android-app
ios-app

OTT లను ఊపేస్తున్న 7 మలయాళం థ్రిల్లర్ మూవీస్! అదిరిపోతారు!

  • Published Feb 17, 2024 | 1:13 PM Updated Updated Feb 17, 2024 | 1:32 PM

వీకెండ్‌ వచ్చేస్తోంది.. మూవీ లవర్స్‌ కొత్త సినిమాల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే కొత్త సినిమాలు కాకుండా.. థ్రిల్లర్‌ మూవీస్‌ చూడాలనుకునేవారి కోసం ఈ లిస్ట్‌. ఓలుక్కేయండి

వీకెండ్‌ వచ్చేస్తోంది.. మూవీ లవర్స్‌ కొత్త సినిమాల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే కొత్త సినిమాలు కాకుండా.. థ్రిల్లర్‌ మూవీస్‌ చూడాలనుకునేవారి కోసం ఈ లిస్ట్‌. ఓలుక్కేయండి

  • Published Feb 17, 2024 | 1:13 PMUpdated Feb 17, 2024 | 1:32 PM
OTT లను ఊపేస్తున్న 7 మలయాళం థ్రిల్లర్ మూవీస్! అదిరిపోతారు!

కరోనా తర్వాత ప్రేక్షకులు సినిమా చూసే విధానం మారింది. కోవిడ్‌కు ముందు వరకు కూడా సినిమా చూడాలంటే.. థియేటర్‌కు వెళ్లాల్సిందే. అప్పుడు కేవలం మన మాతృభాష, డబ్బింగ్‌ సినిమాలు మాత్రమే చూసే అవకాశం ఉండేది. మరి ఇప్పుడో.. ఆ పరిస్థితి మారింది. ఓటీటీలకు క్రేజ్‌ పెరిగింది. అన్ని భాషల చిత్రాలను ఇక్కడ చూసే అవకాశం ఉండటంతో.. మూవీ లవర్స్‌ ఓటీటీలకే జై కొడుతున్నారు. ఇక ఈ మధ్యకాలంలో కొన్ని సినిమాలు నేరుగా ఓటీటీల్లోనే రిలీజ్‌ అవుతుండగా.. థియేటర్లలో విడుదలైన ప్రతి సినిమా కూడా ఓటీటీలోకి వచ్చేస్తుంది. ప్రతి వారం ఓటీటీలోకి కొత్త సినిమాలు వచ్చేస్తున్నాయి. కొత్త సినిమాలు మాత్రమే నాలుగైదు సంవత్సరాల క్రితం విడుదలైన సినిమాలు కూడా ఇప్పుడు ఓటీటీల్లో మరోసారి దుమ్ములేపుతున్నాయి.

ఈ మధ్య కాలంలో కొన్ని థ్రిల్లర్‌ సినిమాలు ఓటీటీలను షేక్‌ చేస్తున్నాయి. అవి కూడా మలయాళం సినిమాలు. మాలీవుడ్‌ సినిమాలంటేనే డిఫరెంట్‌ స్టోరీ, కథనాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. సింపుల్ స్టోరీని కూడా కట్టిపడేసేలా చెప్పడంలో మలయాళ మేకర్స్‌ సిద్ధహస్తులు. ఆ ఇండస్ట్రీ నుంచి ఇప్పటికే విడుదలైన కొన్ని థ్రిల్లర్ మూవీస్ తాజాగా ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌ని షేక్‌ చేస్తున్నాయి. మరి ఈ వీకెండ్‌లో మీరు కూడా వాటిపై ఓ లుక్కేసి.. ఎంజాయ్‌ చేయండి. ఇంతకు ఆ థ్రిల్లర్‌ మూవీస్‌ ఏవి.. ఎక్కడ స్ట్రీమ్‌ అవుతున్నాయంటే..

జోజి – అమెజాన్‌ ప్రైమ్ వీడియో

విలియం షేక్‌స్పియర్ రాసిన మ్యాక్‌బెత్ నాటకం ఆధారంగా తెరకెక్కిన క్రైమ్ డ్రామా మూవీ జోజి. ఫహాద్ ఫాజిల్ నటించిన ఈ సినిమా 2021 నుంచే అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది. దిలీష్ పోతన్ ఈ మూవీకి దర్శకుడు. క్రైమ్‌ డ్రామా నేపథ్యంలో ఈ సినిమా వచ్చింది. ఆస్తిని అనుభవించడం కోసం అడ్డుగా ఉన్న తండ్రిని.. అతడి కుమారుడు ఎలా అంతమొందించాడు.. ఆపై జరిగే పరిణామాలు ఏంటి అనేది ఈ జోజి కథ. ఫహద్‌ మరోసారి తన మార్క్‌ యాక్టింగ్‌తో అదరకొట్టాడు.

వైరస్‌ – అమెజాన్‌ ప్రైమ్ వీడియో

2018లో కేరళను వణికించిన నిఫా వైరస్ ఆధారంగా తెరకెక్కిన మెడికల్ థ్రిల్లర్ మూవీ వైరస్. ఆషిక్ అబు డైరెక్ట్ చేసిన ఈ సినిమా 2019లో రిలీజైంది. కేరళలో నిఫా వైరస్ అసలు ఎలా మొదలైంది.. ఆ మహమ్మారిని అక్కడి ప్రభుత్వం ప్రభుత్వం ఎలా ఎదుర్కొంది అన్న విషయాలను కళ్లకు కట్టినట్లు ఈ మూవీలో చూపించారు. దీన్ని ప్రైమ్ వీడియోలో వైరస్ మూవీ చూడొచ్చు.

గరుడన్ – అమెజాన్‌ ప్రైమ్ వీడియో

గరుడన్ ఓ క్రైమ్ థ్రిల్లర్ మూవీ. అరుణ్ వర్మ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా 2023లో థియేటర్లలో రిలీజైంది. ముగ్గురు వ్యక్తుల చుట్టూ తిరిగే కథ ఇది. ఓ విద్యార్థిని వేధించిన కేసును ఓ పోలీస్ ఆఫీసర్, ఓ ప్రొఫెసర్ ఎలా ఎదుర్కొంటారన్నది ఈ సినిమాలో చూపించారు. ప్రస్తుతం ఈ మూవీ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది.

కన్నూర్ స్క్వాడ్ – డిస్నీ ప్లస్ హాట్‌స్టార్

మాలీవుడ్‌ మెగా స్టార్ మమ్ముట్టి నటించిన కన్నూర్ స్క్వాడ్ మూవీ 2023లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కేరళ బాక్సాఫీస్ దగ్గర రూ.100 కోట్లకుపైగా వసూలు చేసింది ఈ చిత్రం. కన్నూర్‌ జిల్లాలో నేరాలను అరికట్టడానికి వచ్చిన ఏఎస్సై జార్జ్‌ మార్టిన్‌ బృందానికి ఎదురైన పరిస్థితులు, ఆ తర్వాత ఓ రాజకీయ నాయుడి హత్య కేసు వీరి వద్దకు రావడం.. ఆ తర్వాత జరిగే పరిణామాలే కన్నూర్‌ స్క్వాడ్‌. ఈ సినిమాను ప్రస్తుతం డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లో చూడొచ్చు.

దృశ్యం – డిస్నీ ప్లస్ హాట్‌స్టార్

దృశ్యం సినిమా గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. మలయాళంలో వచ్చిన ఈ సినిమాను తెలుగులో కూడా రీమేక్‌ చేస్తే.. అదే స్థాయిలో విజయం సాధించింది. దృశ్యం 2 కూడా అదే రిజల్ట్‌ ఇచ్చింది. అయితే మలయాళంలో ఒరిజినల్ మూవీ చూడాలనుకుంటే డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో అందుబాటులో ఉంది.

రోర్షాక్ – డిస్నీ ప్లస్ హాట్‌స్టార్

మమ్ముట్టి నటించిన సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ ఇది. తన జీవితాన్ని నాశనం చేసిన ఓ వ్యక్తిపై ప్రతీకారం తీర్చుకునే వ్యాపారవేత్త కథే ఈ రోర్షాక్. 2022లో వచ్చిన ఈ సినిమా డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో ఉంది.

జోసెఫ్ – ప్రైమ్ వీడియో

జోజూ జార్జ్ ప్రధాన పాత్రలో నటించిన మూవీ జోసెఫ్. ఇదొక మర్డర్ మిస్టరీ. నలుగురు రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ల చుట్టూ తిరిగే కథ ఈ సినిమా. ఈ సినిమా 2018లో రిలీజ్ కాగా.. అమైజాన్‌ ప్రైమ్‌లో అందుబాటులో ఉంది.

థ్రిల్లర్‌ మూవీస్‌ ఇష్టపడే వారికి ఇవి బెస్ట్‌ చాయిస్‌. మీరు కూడా ఈ సినిమాలు చూస్తే మీకు ఏది బాగా నచ్చిందో కామెంట్స్‌  రూపంలో తెలియజేయండి.

Jojobet GirişgrandpashabetcasibomjojobetcasibomcasibomMadridbetMadridbetjojobetmatbet girişgrandpashabetDeneme Bonusu Veren Sitelergrandpashabet kayıp bonusugrandpashabet kayıp bonusugrandpashabet telegramgrandpashabet girişGrandpashabetGrandpashabetHiltonbetGrandpashabetjojobetjojobet girişcasibomgrandpashabetesrar satın algrandpashabetmarsbahis giriş