Tirupathi Rao
Best Investigation Story OTT Suggestions: మీరు ఇప్పటి వరకు చాలానే హారర్ ఫిల్మ్స్ చూసుంటారు. కానీ, ఈ హారర్ సస్పెన్స్ ఫిల్మ్ మాత్రం మంచి థ్రిల్ కి గురిచేస్తుంది.
Best Investigation Story OTT Suggestions: మీరు ఇప్పటి వరకు చాలానే హారర్ ఫిల్మ్స్ చూసుంటారు. కానీ, ఈ హారర్ సస్పెన్స్ ఫిల్మ్ మాత్రం మంచి థ్రిల్ కి గురిచేస్తుంది.
Tirupathi Rao
ఓటీటీ సినిమాల్లో హారర్ కి ఉన్న డిమాండ్ మరొక జానర్ కి ఉండదు అని చెప్పచ్చు. హారర్ మాత్రమే కాకుండా దానిలో సస్పెన్స్ కూడా మిక్స్ అయితే అబ్బో ఇంక సినిమా లవర్స్ కి పండగ అనే చెప్పాలి. అలాంటి ఒక అదిరిపోయే చిత్రం ఓటీటీలో స్ట్రీమ్ అవుతోంది. ఆ మూవీలో చాలానే ట్విస్టులు ఉంటాయి. దానిలో హీరో మరెవరో కాదు.. మన సలారోడి దోస్త్ వరదే. అదేనండి పృథ్వీరాజ్ సుకుమారన్. ఇన్విస్టిగేషన్ ఆఫీసర్ రోల్ లో యాక్టింగ్ ఇరగదీసేశాడు. ఒక్కో సీన్ క్లైమ్యాక్స్ లో వచ్చే థ్రిల్ ని ఇస్తుంది. అసలు ఇలా కూడా ఇన్వెస్టిగేషన్ చేయచ్చా అనే అనుమానం వస్తుంది.
పృథ్విరాజ్ సుకుమారన్ యాక్టింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సలార్ తర్వాత తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు. ఈ వరద 2021లోనే కోల్డ్ కేస్ అనే అద్భుతమైన హారర్ సస్పెన్స్ డ్రామా మూవీలో లీడ్ రోల్ ప్లే చేశాడు. ఈ మూవీ ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్, ఆహా ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లో తెలుగులోనే అందుబాటులో ఉంది. ఒక ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గా ఒక చిన్న ఆధారంతో కేసును ముందుకు తీసుకెళ్తున్న తీరు మెప్పిస్తుంది. ఒకవైపు క్రైమ్ థ్రిల్లర్ చూస్తున్నాం అనే విషయాన్ని చెబుతూ.. కాసేపటికే హారర్ కూడా అనే విషయాన్ని రివీల్ చేస్తాడు.
డైరెక్టర్ నేరుగా కథలోకి తీసుకెళ్లడంతో ఆడియన్స్ త్వరగా ఎంగేజ్ అవుతారు. కానీ, మధ్యలో మాత్రం కాస్త ల్యాగ్ అనే భావన కలుగుతుంది. కానీ, డ్రామా లవర్స్ మాత్రం ఎక్కడా బోర్ ఫీలవ్వరు. ముఖ్యంగా ఈ మూవీలో ఏసీపీ సత్యజిత్(పృథ్వీరాజ్ సుకుమారన్) ఇన్వెస్టిగేషన్ చేసే విధానం మెప్పిస్తుంది. చిన్న లాజిక్స్ తో మూవీని ముందుకు తీసుకెళ్తారు. ఒక పుర్రెకు ఉన్న కట్టుడు పన్నుతో మొత్తం దర్యాప్తును ముందుకు తీసుకెళ్తారు అంటే నమ్మాతారా? అలాంటి ట్విస్టులు చాలానే ఉన్నాయి. పైగా హారర్ కూడా కావడంతో కాసేపు థ్రిల్ ఫీలైనా.. మరి కాసేపటికి కాస్త భయమేస్తుంది. మొత్తానికి సినిమా మాత్రం అలరిస్తుంది.
చెరువులో చేపల వేటకు వెళ్లిన మత్సకారులకు ఒక సంచి దొరుకుతుంది. ఆ సంచిలో ఒక పుర్రె ఉంటుంది. సమాచారం అందుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభిస్తారు. అసలు ఆ అస్తిపంజరం ఎవరిది? ఈ హత్య చేసింది ఎవరు? అంటూ విచారణ కొనసాగిస్తూ ఉంటారు. మరోవైపు మేధా పద్మజ(అదితి బాలన్) ఓ సీనియర్ జర్నలిస్ట్. ఆమె తన కూతురుతో కలిసి ఓ ఇంట్లో అద్దెకు ఉంటుంది. ఆ ఇంట్లో ఊహించని విషయాలు జరుగుతూ ఉంటాయి. ఇలా రెండు కథలుగా మూవీ ముందుకు వెళ్తూ ఉంటుంది. సత్యజిత్ దర్యాప్తు చేస్తున్న కేసుకి.. జర్నలిస్ట్ ఇంట్లో జరుగుతున్న సంఘటనలకు సంబంధం ఉందా? అసలు ఆ చనిపోయింది ఎవరు? సత్యజిత్ కేసును ఛేదించాడా లేదా? ఇలాంటి చాలా ఇంట్రెస్టింగ్ ప్రశ్నలకు సమాధానాలు కావాలి అంటే మీరు ప్రైమ్ వీడియో, ఆహాలో అందుబాటులో ఉన్న కోల్డ్ కేస్ మూవీ చూడాల్సింది. మీరు ఇప్పటికే ఈ మూవీ చూసుంటే మీకెలా అనిపించిందో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.