iDreamPost

లాయరే క్రిమినల్ అయితే.. ఒక్కో సీన్ కి పిచ్చెక్కిపోతారు.. OTTలో ఉంది చూశారా?

Best Crime Drama OTT Suggestions: ఓటీటీల్లో చాలానే సినిమాలు ఉంటాయి. కానీ, ఏది చూడాలో క్లారిటీ ఉండదు. అలాంటి వాళ్లు ఈ డార్క్ కామెడీ ఒకసారి చూడండి.

Best Crime Drama OTT Suggestions: ఓటీటీల్లో చాలానే సినిమాలు ఉంటాయి. కానీ, ఏది చూడాలో క్లారిటీ ఉండదు. అలాంటి వాళ్లు ఈ డార్క్ కామెడీ ఒకసారి చూడండి.

లాయరే క్రిమినల్ అయితే.. ఒక్కో సీన్ కి పిచ్చెక్కిపోతారు.. OTTలో ఉంది చూశారా?

ఓటీటీలు వచ్చిన తర్వాత తెలుగు ప్రేక్షకులు పెద్దగా హద్దులు పెట్టుకోవడం లేదు. కంటెంట్ లో విషయం ఉండాలే గానీ.. ఏ భాష సినిమా అయినా ఎగబడి చూసేస్తున్నారు. తెలుగులో లేకపోతే.. ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ పెట్టుకుని సినిమాలు చూసే వాళ్లు కూడా ఉన్నారు. అలాంటిది కొన్ని మంచి సినిమాలు తెలుగులో అందుబాటులో ఉన్నా కూడా ఇన్ఫర్మేషన్ లేక లైట్ తీసుకుంటున్నారు. అలాంటి వారి కోసం ఇప్పుడు ఒక మంచి డార్క్ కామెడీ చిత్రాన్ని తీసుకొచ్చాం. ఈ మూవీ ఓటీటీని ఒక ఊపు ఊపేసిన చిత్రం కానీ.. ఇప్పటికీ ఈ మూవీకి అంతే ఆదరణ లభిస్తోంది. మరి.. ఆ డార్క్ కామెడీ కథా చిత్రం ఏంటో చూద్దాం.

ఇప్పుడు చెప్పుకుంటోంది ముకుందన్ ఉన్ని అసోసియేట్స్ అనే ఒక మలయాళ డార్క్ కామెడీ చిత్రం గురించి. ఈ మూవీ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది. నిజానికి ఈ చిత్రాన్ని చూసి ఇన్ స్పైర్ అవ్వచ్చు. ఇందులో మంచి ఉంది.. చెడు ఉంది. మీరు ఏది ఎంచుకుంటారు అనేది మీ చేతుల్లో ఉంటుంది. చాలా మంది సినిమాల్లో చెడు ఎందుకు చూపిస్తారు అని ప్రశ్నిస్తారు. అయితే సినిమాల్లో చెడు ఎందుకు చూపిస్తారంటే.. అలా చేస్తే లైఫ్ ఎలా నాశనం అవుతుందో ప్రాక్టికల్ గా చూపించాలి కాబట్టి చెడుని కూడా హైలెట్ చేస్తారు. కానీ, చాలా మంది ఇచ్చే మెసేజ్ ని గాలికి వదిలేసి.. ఈ చిత్రంలో అంత చెడు ఉంది అంటూ ప్రచారం చేస్తారు.

ఈ మూవీలో కూడా మంచీ- చెడు రెండూ ఉంటాయి. కాకపోతే చెడే కాస్త ఎక్కువగా ఉంటుంది. ఇన్సురెన్స్ పేరిట ఎలాంటి మోసాలు చేయచ్చు.. ఎన్ని లక్షలు కొల్లగొట్టచ్చు అనేది ఈ మూవీలో స్పష్టంగా చూపించారు. అందులో మన హీరో సిద్ధహస్తుడు అవుతాడు. నిజానికి హీరో అనే కంటే విలన్ అంటే బాగుంటుంది. స్టోరీ మొత్తం అతని మీదే నడుస్తూ ఉంటుంది. ఈ మూవీలో ఉండే ఒకే ఒక మంచి ఏంటంటే.. లైఫ్ లో సక్సెస్ అవ్వడానికి మనిషికి ఎంత పట్టుదల ఉండాలి? అనుకున్నది సాధించడం కోసం ఎంత కష్టపడాలి అనే విషయాలను చూపిస్తారు. కాకపోతే అది కాస్త చెడు మార్గంలో ఉంటుంది. హీరో మాత్రం ఒక సాధారణ లాయర్ నుంచి ఒక పెద్ద లా ఫర్మ్ ని స్థాపించే స్థాయికి ఎదుగుతాడు. అందుకోసం చాలానే తప్పులు చేస్తాడు. కానీ, ఏ ఒక్క తప్పుకి రిగ్రెట్ అవ్వకుండా లైఫ్ లో సాగిపోతూ ఉంటాడు.

కథ ఏంటంటే?:

ముకుందన్ ఉన్ని(వినీత్ శ్రీనివాసన్) ఒక లాయర్. ఒక గొప్ప లా ఫర్మ్ లో తన ప్రతిభను ప్రదర్శించేందుకు ఒక్క ఛాన్స్ కోసం తహతహలాడుతూ ఉంటాడు. కానీ, ఆ అవకాశం రాకుండానే ఆ సంస్థ నుంచి బయటకు వచ్చేస్తాడు. ఆ తర్వాత సొంతంగా లా ఫర్మ్ ని స్థాపించాలి అని ప్రయత్నాలు చేస్తుంటాడు. అది పెద్దగా వర్కౌట్ కాదు. ఈ గ్యాప్ లో తల్లికి ప్రమాదం జరుగుతుంది. తినడానికి తిండి కూడా లేని సమయంలో ఆస్పత్రి ఖర్చులు మీద పడతాయి. ఆ సమయంలో అక్కడ జరుగుతున్న ఇన్సురెనస్ స్కామ్ ముకుందన్ ఉన్నికి తెలుస్తుంది.

ముకుందన్ ఉన్ని ఒక లాయర్ అని చెప్పకుండా అక్కడ జరుగుతున్న మొత్తం ఫ్రాడ్ ని తెలుసుకుంటాడు. మొదటి నుంచి చివరి వరకు అన్ని వివరాలు సేకరిస్తాడు. ఆ తర్వాత అతనే అలాంటి మోసాలు చేయడానికి ప్రయత్నాలు షురూ చేస్తాడు. కానీ, అక్కడ కూడా ఎంతో గొప్ప పోటీ ఉంటుంది. మరి.. ఆ పోటీని దాటుకుని ముకుందన్ ఉన్ని సక్సెస్ అయ్యాడా? లైఫ్ లో విజయం సాధించడం కోసం ఎన్ని నేరాలు చేశాడు? చివరికి దొరికాడా లేదా? ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు సినిమా చూసి తెలుసుకోవాలి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి