Swetha
ఓటీటీ లోకి ఎన్నో సినిమాలు వస్తూనే ఉన్నాయి. అయితే కొన్ని సినిమాలు కమర్షియల్ గా హిట్ సాధించకపోయినా మంచి రివ్యూస్ సంపాదించుకుంటుంది. అలాంటి ఒక సినిమా తాజాగా ఓటీటీ లోకి వచ్చేసింది.
ఓటీటీ లోకి ఎన్నో సినిమాలు వస్తూనే ఉన్నాయి. అయితే కొన్ని సినిమాలు కమర్షియల్ గా హిట్ సాధించకపోయినా మంచి రివ్యూస్ సంపాదించుకుంటుంది. అలాంటి ఒక సినిమా తాజాగా ఓటీటీ లోకి వచ్చేసింది.
Swetha
ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ పేరు తీస్తే ఎవరిని కదిలించిన సరే అందరూ ఓటీటీ పేరే తలస్తున్నారు. ఎందుకంటే లెక్కలేనన్ని సినిమాలు ఓటీటీ లోకి వచ్చి పడుతున్నాయి. టాలీవుడ్ , బాలీవుడ్, హాలీవుడ్, కోలీవుడ్ ఇలా అన్ని జోనర్స్ సినిమాలకు అడ్డాగా మారిపోయాయి ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్. ప్రేక్షకుల ఆదరణ కూడా ఈ సినిమాలకు బాగానే లభిస్తుంది. దీనితో మేకర్స్ కూడా వారి వారి సినిమాలను ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఓటీటీ లో విడుదల చేయాలనీ ప్రయత్నిస్తున్నారు. అయితే థియేటర్ లో రిలీజ్ అయిన కొన్ని సినిమాలు కలెక్షన్స్ పరంగా కాసుల వర్షం కురిపించక పోయినా కూడా.. కథ పరంగా మాత్రం ప్రేక్షకులను మెప్పించడంలో ఏ మాత్రం తక్కువ చేయవు. ఇటీవల రిలీజ్ అయిన అలాంటి ఒక సినిమా.. ఇప్పుడు ఓటీటీ లో స్ట్రీమింగ్ అవుతుంది. మరి ఆ సినిమా ఏంటి ఎక్కడ స్ట్రీమింగ్ అవుతోంది అనే విషయాలను చూసేద్దాం.
ఇప్పటివరకు చెప్పుకున్న సినిమా పేరు “జే బేబీ”. ఇది ఒక కోలీవుడ్ మూవీ. ఈ సినిమాకు కోలీవుడ్ ప్రముఖ దర్శకుడు రంజిత్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా మార్చి 8న థియేటర్ లో రిలీజ్ అయింది. కాగా ఫ్యామిలీ డ్రామా గా పేరు తెచ్చుకున్న ఈ సినిమాలో అట్టకత్తి దినేష్, ఊర్వశి, లొల్లుసబమారన్ ముఖ్య పాత్రలు పోషించారు. ఊర్వశి గురించి ఇటు తెలుగు నాట అందరికి పరిచయమే. ఇక ఆమె నటన గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ సినిమాలో కూడా ఊర్వశి నటనకు ప్రత్యేక ప్రశంసలు దక్కాయి. తప్పిపోయిన తమ తల్లిని వెతుక్కుంటూ.. చెన్నై నుంచి కలకత్తా వెళ్లిన ఇద్దరు యువకుల కథే ఈ సినిమా స్టోరీ. కమర్షియల్ పరంగా ఈ సినిమా విజయాన్ని సాదించలేకపోయిన కూడా.. ఐఎమ్‌డీబీలో 9.1 రేటింగ్‌ను దక్కించుకుంది. ప్రస్తుతం ఈ సినిమా ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతోంది.
జే బేబీ సినిమా కథ విషయానికొస్తే.. ఈ మూవీ లో ఊర్వశికి ఇద్దరు కొడుకులు ఉంటారు, వారిద్దరూ చిన్నతనంలో బాగానే ఉన్నా కానీ.. వయస్సు పెరిగే కొద్దీ వారివురి మధ్య విబేధాలు పెరుగుతూ ఉంటాయి. దీనితో వాళ్ళిద్దరి మధ్య బంధం సరిగా ఉండదు. ఈ క్రమంలో వారిద్దరికీ ఒక రోజు ఒక ఫోన్ కాల్ వస్తుంది. ఆ కాల్ లో వారిద్దరికీ ఒకే ప్రశ్నలు ఎదురౌతాయి. మీరు మీ అమ్మను చివరిగా ఎప్పుడు కలిశారు అని. అయితే ఒక రెండు రోజుల క్రితం అని.. మరొకరు మూడు రోజుల క్రితం అని చెప్తారు. కానీ ఆ కాల్ ద్వారా వారికి తెలిసిందేంటంటే.. వారి తల్లి వాళ్ళిద్దరిని వదిలేసి కలకత్తా వెళ్ళిపోతుంది. వీరిద్దరూ ఆమెను వెతుక్కుంటూ వెళ్తారు. అసలు ఆమె ఎందుకు కలకత్తా కు వెళ్తుంది ! తల్లిని వెతుక్కుంటూ వెళ్లిన వారు ఎటువంటి సమస్యలను ఎదుర్కుంటారు ! చివరికి వారు తమ తల్లి జాడను కనుక్కుంటారా లేదా ! వీరిద్దరి మధ్య బంధం పెరుగుతుందా ! ఇవన్నీ చూడాలంటే ఈ సినిమాను చూడాల్సిందే. మరి, ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.