Swetha
విజయ్ దేవరకొండ లేటెస్ట్ ఫిల్మ్ ఫ్యామిలీ స్టార్ సినిమా ఏప్రిల్ 5న భారీ అంచనాల మధ్యన థియేటర్స్ లో రిలీజ్ అయింది. ఈ క్రమంలో అప్పుడే ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ పార్టనర్ గురించి డిస్కషన్స్ మొదలయ్యాయి. ఈ సినిమా ఓటీటీ డీటెయిల్స్ ఇలా ఉన్నాయి.
విజయ్ దేవరకొండ లేటెస్ట్ ఫిల్మ్ ఫ్యామిలీ స్టార్ సినిమా ఏప్రిల్ 5న భారీ అంచనాల మధ్యన థియేటర్స్ లో రిలీజ్ అయింది. ఈ క్రమంలో అప్పుడే ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ పార్టనర్ గురించి డిస్కషన్స్ మొదలయ్యాయి. ఈ సినిమా ఓటీటీ డీటెయిల్స్ ఇలా ఉన్నాయి.
Swetha
ఓటీటీ అనగానే అందరు ఇప్పుడు ఎంతో ఇంట్రెస్ట్ చూపించేస్తున్నారు. ఈ క్రమంలో థియేటర్ లో రిలీజ్ అయిన కొన్ని రోజులకు సినిమాలు ఓటీటీ లో రిలీజ్ అవుతుంటే.. మరి కొన్ని సినిమాలకు మాత్రం థియేట్రికల్ రిలీజ్ కంటే ముందే.. డిజిటల్ రైట్స్ భారీగా అమ్ముడుపోతున్నాయి. అలా ఇప్పటివరకు ఎన్నో సినిమాలకు థియేట్రికల్ రన్ కంటే ముందే.. డిజిటల్ స్ట్రీమింగ్ పార్టనర్స్ ద్వారా ఓ మేరకు అమౌంట్ కవర్ అవుతూ వస్తుంది. ఈ క్రమంలో తాజాగా.. విజయ్ దేవర కొండ, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన ఫ్యామిలీ స్టార్ సినిమా భారీ అంచనాల మధ్యన ఏప్రిల్ 5న థియేటర్ రిలీజ్ అయింది. ఈ క్రమంలో అప్పుడే ఈ సినిమా ఓటీటీ ఎంట్రీ గురించి టాక్ నడుస్తోంది. మరి ఫ్యామిలీ స్టార్ డిజిటల్ రైట్స్ ఏ ప్లాట్ ఫార్మ్ సొంతం చేసుకుందో చూసేద్దాం.
నిన్న మొన్నటి వరకు మీడియా , సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా.. ఫ్యామిలీ స్టార్ సినిమా గురించే ముచ్చట్లు జరిగాయి. ఈ సినిమాపై అందరికి ఎన్నో ప్రశ్నలు, అంచనాలు, ర్యూమర్స్ ఇలా ఎన్నో డిస్కషన్స్ జరిగాయి. ఇక ఎట్టకేలకు ఈ సినిమా థియేటర్ లో రిలీజ్ అయ్యి.. మంచి టాక్ ఏ సంపాదించుకుంటుంది. ఈ సినిమాకు పరశురామ్ దర్శకత్వం వహించగా.. దిల్ రాజు నిర్మాతగా వ్యవహరించారు. అయితే , మొదట ఈ సినిమా డిజిటల్ రైట్స్ ను.. 16 కోట్లకు నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుందనే వార్తలు వినిపించాయి. అయితే ఇప్పుడు ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ కావడంలేదు. నిజానికి ఈ సినిమా.. అఫీషియల్ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ ఫిక్స్ అయింది. ఈ సినిమా డిజిటల్ రైట్స్ ను.. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్.. అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకుంది. థియేట్రికల్ రన్ పూర్తైన ఆరు వారాల తర్వాత అంటే.. మే రెండో వారం లేదా మూడో వారంలో ఈ సినిమా ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం.
ఇక ఫ్యామిలీ స్టార్ సినిమా టాక్ విషయానికొస్తే.. ఔట్ డేటెడ్, రొటీన్ స్టోరీ టెంప్లేట్ తో వచ్చిన మూవీ అంటూ ఓ వర్గం ప్రేక్షకులు అంటున్నారు . ఈ సినిమాలో చూపించిన మిడిల్ క్లాస్ కష్టాలు కూడా అంత కన్వీనియన్స్ గా అనిపించలేదని.. ప్రేక్షకులు భావిస్తున్నారు. అయితే, విజయ్ దేవరకొండ, దిల్ రాజు లకు మార్కెట్ లో ఉన్న క్రేజ్ కారణంగా ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ మాత్రం భారీగానే జరిగింది. థియేట్రికల్ మొత్తంగా 43 కోట్లకు అమ్ముడుపోయాయి. దీనితో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ 44 కోట్లుగా ఫిక్స్ అయ్యారు మేకర్స్. కానీ, ఇప్పుడు ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవుతుందా లేదా అనే.. సందేహాలు మొదలయ్యాయి. సినిమా రిలీజ్ అయ్యి ఇంకా ఒక్క రోజు కూడా కాలేదు కాబట్టి లాంగ్ రన్ లో ఎటువంటి టాక్ సంపాదించుకుంటుందో వేచి చూడాలి. మరి ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.