Swetha
హర్రర్ ఫిలిమ్స్ అంటే ఎవరికీ మాత్రం ఇష్టం ఉండదు. భయమేసిన సరే.. కదలకుండా కూర్చుని మరి ఈ సినిమాలను చూస్తుంటారు ప్రేక్షకులు. ఒకవేళ ఇప్పుడు చెప్పుకోబోయే హర్రర్ ఫిల్మ్ కనుక మీరు మిస్ చేసి ఉంటే.. ఒక మంచి మిస్టీరియస్ హర్రర్ కంటెంట్ మిస్ అయినట్లే.
హర్రర్ ఫిలిమ్స్ అంటే ఎవరికీ మాత్రం ఇష్టం ఉండదు. భయమేసిన సరే.. కదలకుండా కూర్చుని మరి ఈ సినిమాలను చూస్తుంటారు ప్రేక్షకులు. ఒకవేళ ఇప్పుడు చెప్పుకోబోయే హర్రర్ ఫిల్మ్ కనుక మీరు మిస్ చేసి ఉంటే.. ఒక మంచి మిస్టీరియస్ హర్రర్ కంటెంట్ మిస్ అయినట్లే.
Swetha
హర్రర్ సినిమాలంటే అందరికి ఎంత భయం ఉన్నా కానీ.. ఎందుకో అవి చూడడం మాత్రం మానరు ఎందుకంటే ఆ కథలు అలాంటివి. క్షణ క్షణం చెమటలు పట్టించే సీన్స్. తర్వాత ఎం జరుగుతుందా అనే ఆశక్తి. గూస్ బంప్స్ తెప్పించే ఎలేవేషన్స్.. గుండె దడ పెంచే సౌండింగ్స్.. ఈ రేంజ్ లో హర్రర్ సినిమాలుంటే.. ఎవరికీ మాత్రం చూడాలనిపించదు. అందుకే హర్రర్ సినిమాలకు ఈ రేంజ్ లో క్రేజ్ పెరుగుతుంది. దాదాపు తెలుగులో వచ్చిన హర్రర్ సినిమాలన్నిటిని కవర్ చేసేసి ఉంటే.. ఇప్పుడు చెప్పుకోబోయే హర్రర్ సినిమాను మీరు చూశారో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ మిస్ చేస్తే మాత్రం.. ఒక మంచి సైన్స్ ఫిక్షన్ హర్రర్ సస్పెన్స్ థ్రిల్లర్ ను మిస్ చేసినట్లేనని చెప్పి తీరాల్సిందే. మరి, ఈ సినిమా ఏ ప్లాట్ ఫార్మ్ లో స్ట్రీమింగ్ అవుతుందో చూసేద్దాం.
ఇప్పటివరకు తెలుగులో ఎన్నో హర్రర్ సినిమాలను చూసి ఉంటారు కానీ.. ఇటువంటి సినిమా మాత్రం ఎక్కడా చూసి ఉండరు. ఈ సినిమా పేరు ది విచ్: పార్ట్-1 సబ్ వెర్షన్.. ఈ సినిమా 2018 లో విడుదలైంది. ఇది ఒక సౌత్ కొరియన్ సైన్స్ ఫిక్షన్ హర్రర్ సినిమా. అలా అని ఈ సినిమా కొరియన్ లాంగ్వేజ్ లో మాత్రమే ఉందనుకుంటే పొరపాటే. ఎందుకంటే ఈ సినిమా తెలుగులో కూడా అందుబాటులో ఉంది. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమా అసలు ఎందుకు చూడాలి.. అనే విషయానికొస్తే.. అసలు కథేంటంటే.. ఒక ల్యాబ్ లో చాలా మంది ఘోరంగా చనిపోయి ఉంటారు. ఆ ల్యాబ్ లో నుంచి ఒక చిన్న పాపా పరిగెత్తుకుంటూ బయటకు వస్తుంది. కానీ ఆ ల్యాబ్ ను రన్ చేస్తున్న వారు మాత్రం.. ఆ పాపా చనిపోయిందని అనుకుంటారు. ఈ క్రమంలో ఆ పాపా ఒక పొలం యజమానికి దొరుకుతుంది. ఆ పాపను వారు దత్తత తీసుకుంటారు. ఇక్కడి వరకు సాఫీగా సాగిపోయిన కథ ఇక్కడి నుంచి మలుపులు తిరుగుతూ ఉంటుంది.
ఆమెను దత్తత తీసుకున్న పేరెంట్స్ చాలా పేద వారు..ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులకు గురి అవుతారు. ఆమె తల్లి ఒక అంతుచిక్కని వ్యాధితో బాధపడుతుంది. ఆ పాపా కూడా ఒక వ్యాధితో బాధపడుతూనే ఉంటుంది. ఎలాగైనా సరే ఆమె తన తల్లిదండ్రులకు సహాయంగా ఉండాలని. ఒక పాటల పోటీలో పాల్గొంటుంది. అయితే అక్కడకు జడ్జెస్ గా వచ్చేది మరెవరో కాదు. మొదట్లో ఒక ల్యాబ్ ను రన్ చేసిన వారే.. ఈ పాపా ను గుర్తు పట్టి ఎలాగైనా ల్యాబ్ కు తీసుకుని వెళ్లడం కోసం కొంతమంది.. వ్యక్తులను ఆయుధాలతో ఆమె వద్దకు పంపిస్తాడు. ఇక్కడ అందరిని ఆశ్చర్య పరిచేలా ఆమె వారితో ఫైట్ చేస్తుంది. అసలు ఆమెకు అన్ని శక్తులు ఎక్కడినుంచి వచ్చాయి! తిరిగి ఆ ల్యాబ్ కు వెళ్తుందా లేదా ! ఆమె తల్లి దండ్రులను కాపాడుకుంటుందా లేదా ! అసలు ఆ తర్వాత ఏం జరుగుతుంది! ఇవన్నీ తెలియాలంటే ఈ సినిమాను పూర్తిగా చూడాల్సిందే. అయినా సరే ఇన్ కంప్లీట్ గానే అనిపిస్తుంది. ఎందుకంటే ఈ సినిమా రెండు పార్ట్స్ గా ఉంది. మూడవ పార్ట్ కూడా వచ్చేందుకు సిద్ధంగా ఉందట. మరి ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.