iDreamPost
android-app
ios-app

OTT Suggestion: ఆ పెన్నుతో ఎవరు ఏం రాసినా చనిపోతారు! OTTలో చెమటలు పట్టించే మూవీ!

  • Published Apr 24, 2024 | 2:27 PM Updated Updated Apr 26, 2024 | 6:19 PM

ఓటీటీ లో ఎన్నో సినిమాలు వస్తూ ఉంటాయి, అయితే వాటిలో స్టార్ యాక్టర్స్ లేని కారణంగా ఈ సినిమాలో ఏముంటుందిలే అని మిస్ చేస్తూ ఉంటారు ఆడియన్స్. అలాంటి మిస్ చేసిన సినిమాలలో ఈ సినిమా కూడా ఉందేమో చెక్ చేసుకోండి. ఒకవేళ ఉన్నట్లైతే ఒక మంచి యాక్షన్ డ్రామాను మిస్ చేసినట్లే.

ఓటీటీ లో ఎన్నో సినిమాలు వస్తూ ఉంటాయి, అయితే వాటిలో స్టార్ యాక్టర్స్ లేని కారణంగా ఈ సినిమాలో ఏముంటుందిలే అని మిస్ చేస్తూ ఉంటారు ఆడియన్స్. అలాంటి మిస్ చేసిన సినిమాలలో ఈ సినిమా కూడా ఉందేమో చెక్ చేసుకోండి. ఒకవేళ ఉన్నట్లైతే ఒక మంచి యాక్షన్ డ్రామాను మిస్ చేసినట్లే.

  • Published Apr 24, 2024 | 2:27 PMUpdated Apr 26, 2024 | 6:19 PM
OTT Suggestion: ఆ పెన్నుతో ఎవరు ఏం రాసినా చనిపోతారు! OTTలో చెమటలు పట్టించే మూవీ!

సినిమా ప్రతి ఒక్కరికి మక్కువే.. ఎందుకంటే కొంత సమయంపాటు ప్రపంచాన్నీ మర్చిపోయి వేరే లోకానికి తీసుకువెళ్తూ ఉంటాయి సినిమాలు. ఎంటర్టైన్మెంట్ విభాగంలో సినిమాలకు మించి ఏది ప్రేక్షకులను ఖుషి చేయలేవు. ఈ క్రమంలో ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ లో వరుసగా సినిమాలు, సిరీస్ లు రిలీజ్ అవుతూనే ఉన్నాయి. కొన్ని సినిమాలు, సిరీస్ లు స్టార్ సెలెబ్రిటీలు, యాక్టర్స్ నటించినవైతే.. మరికొన్ని చిన్న చిన్న యాక్టర్స్ నటించినవి. అయితే ఇక్కడ యాక్టర్స్ ఎలాంటి వారైనా కానీ.. కథ ముందు అందరు రాజి పడాల్సిందే. అలాంటి ఎన్నో అద్భుతమైన కథలతో ఓటీటీ లోకి వచ్చిన చిన్న సినిమాలను.. ప్రేక్షకులు కొన్ని సార్లు మిస్ చేస్తూ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. ఈ క్రమంలో ఇప్పుడు చెప్పుకోబోయే సినిమాను మీరు మిస్ చేసి ఉంటే మాత్రం ఒక మంచి యాక్షన్ డ్రామాను మిస్ చేసినట్లే. అది కూడా ఒక తెలుగు యాక్షన్ ఫిల్మ్. మరి ఆ సినిమా ఏంటి ఎక్కడ స్ట్రీమింగ్ అవుతోంది అనే విషయాలు చూసేద్దాం.

ఇప్పుడు చెప్పుకోబోయే సినిమా ఒక తెలుగు సినిమా. ఈ సినిమా పేరు “విధి”. ఈ సినిమా 2023 లో వచ్చింది. ప్రస్తుతం ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. యాక్షన్ డ్రామాస్ ను ఇష్టపడే వారికి ఈ సినిమా బెస్ట్ చాయిస్ అని చెప్పొచ్చు. అసలు ఈ సినిమా ఎందుకు వర్త్ వాచింగ్.. ఈ సినిమా స్టోరీ లైన్ ఏంటి అనే విషయానికొస్తే.. ఈ సినిమా అంతా కూడా ఒక పెన్ను వెనుక తిరుగుతుంది ఆ పెన్నుతో ఎవరు ఏం రాసినా చనిపోతారు. వినడానికి ఆశ్చర్యంగా అనిపించే ఈ స్టోరీ ప్లాట్ ఏంటంటే.. ఈ సినిమాలో హీరో ఒక మిడిల్ క్లాస్ అబ్బాయి. స్టార్టింగ్ నుంచి హీరోకు అన్ని కష్టాలే ఉంటాయి. అన్ని కష్టాలలో కూడా ఓ మంచి ఏంటంటే అతనిని పల్లవి అనే ఒక అమ్మాయి ప్రేమిస్తుంది. ఎలాగైనా డబ్బు సంపాదించాలని సిటీకి వచ్చిన హీరోకు.. పల్లవి తోడుగా నిలుస్తుంది. అలాగే కష్ఠాలు పడుతూ చెరొక జాబ్ చేసుకుంటూ ఉన్న క్రమంలో.. అనుకోకుండా హీరోకు ఒక పెన్ను దొరుకుతుంది. దీనితో అతని జీవితమే మారిపోతుంది.

ఇంతలో పల్లవికి ఒక అంతుచిక్కని వ్యాధి ఉంటుందని తెలుస్తుంది. దీనితో హీరోకు కొత్త కష్టాలు మొదలుతాయి. మరోవైపు హీరో ఉంటున్న రూమ్ లో అతని ఫ్రెండ్ చనిపోతాడు. అతను ఎలా చనిపోయాడన్న సంగతి మాత్రం ఎవరికీ తెలియదు. ఇక హీరో చేసేది ఏమి లేక తన దగ్గర ఉన్న పెన్ ను అమ్మేసి ఎంతో కొంత డబ్బును సమకూర్చలనుకుంటాడు.కానీ ఆ పెన్ ను మాత్రం ఎవరు తీసుకోరు. ఈలోపు సూర్యకి ఒక ఉద్యోగం దొరుకుతుంది. అక్కడ తన ఓనర్ కు ఆ పెన్ ను ఫ్రీ గా ఇచ్చేస్తాడు. కానీ ఆ తర్వాత రోజు ఆ ఓనర్ కూడా చనిపోతాడు. దీనితో హీరోకు ఆ పెన్ మీద అనుమానులు మొదలవుతాయి. దీనిని మరొకరి మీద టెస్ట్ చేసి పెన్ వలెనే వాళ్ళు చనిపోతున్నారని.. కన్ఫర్మ్ చేసుకుంటాడు. నిజంగానే ఆ పెన్ కారణంగా హత్యలు జరుగుతున్నాయా ! ఆ తర్వాత ఏం జరిగింది ! దీని వలన అతనికి మంచి జరిగిందా చెడు జరిగిందా ! ఆ పెన్ ఎక్కడి నుంచి వచ్చింది అసలు ! ఇవన్నీ తెలియాలంటే ఈ సినిమాను చూడాల్సిందే. ఇప్పటివరకు ఈ సినిమాను ఎవరైనా మిస్ అయ్యి ఉంటే మాత్రం వెంటనే చూసేయండి. మరి ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.