iDreamPost
android-app
ios-app

ఓటీటీలోకి హర్రర్ థ్రిల్లర్ వెబ్ సీరీస్..ఎక్కడంటే?

  • Published Mar 24, 2024 | 4:32 PM Updated Updated Mar 24, 2024 | 4:32 PM

Inspector Rish Web Series: ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్ రంగంలో ఓటీటీ రాజ్యమేలుతుంది. భాషతో సంబంధం లేకుండా వస్తున్న సినిమాలు, వెబ్ సీరీస్ కి ఆడియన్స్ బాగా కనెక్ట్ అవుతున్నారు.

Inspector Rish Web Series: ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్ రంగంలో ఓటీటీ రాజ్యమేలుతుంది. భాషతో సంబంధం లేకుండా వస్తున్న సినిమాలు, వెబ్ సీరీస్ కి ఆడియన్స్ బాగా కనెక్ట్ అవుతున్నారు.

  • Published Mar 24, 2024 | 4:32 PMUpdated Mar 24, 2024 | 4:32 PM
ఓటీటీలోకి హర్రర్ థ్రిల్లర్ వెబ్ సీరీస్..ఎక్కడంటే?

ఒకప్పుడు థియేటర్లో రిలీజ్ అయ్యే సినిమాలు ఎప్పుడో బుల్లితెరపై కనిపించేవి. తమ అభిమాన నటీనటుల సినిమాలు చూడాలంటే చాలా సమయం పట్టేది. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. థియేటర్లో రిలీజ్ అయిన సినిమాలు నెల రోజుల్లోనే ఓటీటీలోకి వస్తున్నాయి. ఓటీటీలో కొత్త సినిమాలే కాదు.. కొత్త వెబ్ సీరీస్ ఆడియన్స్ ని బాగా ఆకట్టుకుంటున్నాయి. హర్రర్, క్రైమ్ థ్రిల్లర్ జోనర్ లో వస్తున్న వెబ్ సీరీస్ కి మంచి ఆదరణ లభిస్తుంది. ఈ క్రమంలోనే హర్రర్ థ్రిల్లర్ జోనర్ లో వస్తున్న మరో వెబ్ సీరీస్ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. స్ట్రీమింగ్ ఎప్పుడు..? ఎక్కడ? అన్న విషయం గురించి తెలుసుకుందాం. వివరాల్లోకి వెళితే..

వెండితెరపై హీరోగా, విలన్ గా నటించి మెప్పిస్తున్న నవీన్ చంద్ర తెలుగులోనే కాదు తమిళ్ లో కూడా మంచి క్రేజ్ సంపాదించాడు. సినిమాలతో పాటు ఇప్పుడు పలు వెబ్ సీరీస్ లో కూడా నటిస్తున్నారు నవీన్ చంద్ర. ఇటీవల లారెన్స్ హీరోగా నటించిన జిగర్తాండ డబుల్ ఎక్స్ లో నెగిటీవ్ పాత్రతో బాగా పాపులర్ అయ్యాడు. తాజాగా ఆయన నటించిన ‘ఇన్స్‌పెక్టర్ రిషి’ వెబ్ సీరీస్ నుంచి ట్రైలర్ ను అమెజాన్ ప్రైమ్ వీడియో రిలీజ్ చేసింది.

హర్రర్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ వెబ్ సీరీస్ మొత్తం 10 ఎపిసోడ్ లు. తెలుగు, తమిళ తో పాటు ఐదు భాషల్లో మార్చి 29 నుంచి ఈ సీరీస్ ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతుంది. తాజాగా రిలీజ్ అయిన ట్రైలర్ ఎంతో ఆసక్తిగా ఉంది. ప్రతి సీన్ సస్పెన్స్ థ్రిల్లింగ్ గా ఉంది. విజువల్ ఎఫెక్స్ట్ అద్భుతంగా ఆకర్షిస్తున్నాయి. మొత్తానికి ఈ వెబ్ సీరీస్ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అవుతుందనిపిస్తుంది. అంతు చిక్కని హత్యల వెనుక ఎవరు ఉన్నారేదే ఈ సీరీస్ కథాంశం. మిస్టరీని ఛేదించేందుకు ఇన్స్ పెక్టర్ రిషి ఎలాంటి సాహసాలు చేశాడు అనేది తప్పకుండా చూడాల్సిందే. ‘ఇన్స్‌పెక్టర్ రిషి’ కి నందిని దర్శకత్వం వహించారు.

Jojobet Girişİmajbetcasibomjojobetjojobetcasibomcasibomcasibomşanlıurfa konteynerbetciobetcioHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetJojobetJojobetJojobetjojobetgrandpashabetgrandpashabetgrandpashabetganobetcasibom girişbetciojojobetcasibomgrandpashabet