iDreamPost
android-app
ios-app

OTT Suggestion: ఆ ఊరి ప్రజలందరికి మతిమరుపు.. OTTలో కడుపుబ్బా నవ్వించే విలేజ్ డ్రామా!

  • Published Apr 27, 2024 | 3:37 PM Updated Updated Apr 29, 2024 | 4:21 PM

సినిమాలు చాలా వరకు ప్రేక్షకులను ఆకట్టుకోవాలని చూస్తుంటాయి. కానీ, అనుకోకుండా ఆయా సినిమాలో స్టార్ క్యామియో లేనందు వలన ఆయా సినిమాలకు పెద్దగా బజ్ క్రియేట్ అవ్వదు. కానీ ఆ సినిమాలలో స్టోరీ మాత్రం.. అందరిని ఆకట్టుకుంటుంది. అలాంటి ఓ అద్భుతమైన సినిమా ఓటీటీ లో ఉందన్న సంగతి తెలుసా..

సినిమాలు చాలా వరకు ప్రేక్షకులను ఆకట్టుకోవాలని చూస్తుంటాయి. కానీ, అనుకోకుండా ఆయా సినిమాలో స్టార్ క్యామియో లేనందు వలన ఆయా సినిమాలకు పెద్దగా బజ్ క్రియేట్ అవ్వదు. కానీ ఆ సినిమాలలో స్టోరీ మాత్రం.. అందరిని ఆకట్టుకుంటుంది. అలాంటి ఓ అద్భుతమైన సినిమా ఓటీటీ లో ఉందన్న సంగతి తెలుసా..

  • Published Apr 27, 2024 | 3:37 PMUpdated Apr 29, 2024 | 4:21 PM
OTT Suggestion: ఆ ఊరి ప్రజలందరికి  మతిమరుపు.. OTTలో కడుపుబ్బా నవ్వించే విలేజ్ డ్రామా!

స్టార్ క్యామియో లేని కారణంగా చాలా వరకు మంచి సినిమాలను లైట్ తీసుకుంటూ ఉంటారు మూవీ లవర్స్. కానీ, ఒక్కసారి ఆ సినిమాలను చూస్తే. ఈ సినిమాలన మిస్ చేసింది అనే ఫీలింగ్ కలుగుతుంది. అలా ఇప్పటివరకీ ఎన్నో సినిమాలు మంచి మంచి కథలతో వచ్చినా కూడా.. బజ్ లేకపోవడం వలన అంతా పాపులర్ కాలేకపోయాయి. అలాంటి సినిమాలు ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ లో అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు చెప్పుకోబోయే సినిమా కూడా ఇలాంటిదే. ఇప్పటివరకు ఈ సినిమాను ఎవరైనా మిస్ చేసి ఉంటే మాత్రం.. ఓ మంచి విలేజ్ బ్యాక్ డ్రాప్ లో ఉండే సినిమాను మిస్ అయినట్లే. మరి ఇంతకీ ఈ సినిమాలేంటి ఎక్కడ స్ట్రీమ్ అవుతుంది అనే విషయాలను చూసేద్దాం.

ఈ సినిమా పేరు ” తిక మక తండా”. ఈ సినిమాకు వెంకట్ దర్శకత్వం వహించగా.. హరికృష్ణ, రామకృష్ణ , యాని , రేఖ నిరోష, శివన్నారాయణ, రాకెట్ రాఘవ, యాదమ రాజు, భాస్కర్ లాంటి వారు ముఖ్య పాత్రలు పోషించారు. ఇక ఈ సినిమా గత ఏడాది డిసెంబర్ లో థియేటర్ లో రిలీజ్ అయింది. కథ కథనం అంతా బాగానే ఉన్నా కూడా.. కొన్ని కారణాల చేత ఈ సినిమా గురించి అంతా బజ్ వినిపించలేదు. కానీ ఇంటర్నెట్ మూవీ డేటా బేస్ లో ఈ సినిమా 7.8 రేటింగ్ సంపాదించుకుంది. ప్రస్తుతం ఈ సినిమా ఆహ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ లో అందుబాటులో ఉంది. మరి ఇప్పటివరకు ఈ సినిమా ఎవరైనా మిస్ చేసి ఉంటే మాత్రం.. ఒక మంచి కంటెంట్ ఉన్న సినిమాను మిస్ అయినట్లే.. ఊరందరికీ మతిమరుపు అనే ఒక కొత్త కాన్సెప్ట్ తో ఈ సినిమా అందరి ముందుకు వచ్చింది.

అసలు ఈ సినిమాను ఎందుకు చూడాలి.. ఈ సినిమా కథేంటి అనే విషయానికొస్తే.. తికమకతండా అన ఒక మారుమూలను ఉండే గ్రామంలో.. అందరికి మతిమరుపు సమస్య ఉంటుంది. ఆ మతి మరుపును పోగొట్టుకునేందుకు.. అమ్మవారి జాతర చేద్దాం అనుకుంటూ ఉంటారు. కానీ ఎవరికీ అర్ధం కానీ విధంగా.. ఆ ఊరిలో అమ్మవారి విగ్రహం మాయమైపోతుంది. అసలు ఊరంతా మతిమరుపు సమస్య ఉండడం ఏమిటి! అమ్మవారి విగ్రహం ఎలా మాయమైపోయింది ! దానికి పరిష్కారం ఎలా దొరికింది ! విగ్రహాన్ని తిరిగి ఊరికి రప్పించడానికి వారంతా ఏమి చేశారు ! ఇవన్నీ తెలియాలంటే ఈ సినిమాను చూడాల్సిందే. మరి ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.