Swetha
ఓటీటీ లో క్రైమ్, హర్రర్, సస్పెన్స్ థ్రిల్లర్స్ ఏ కాకుండా మంచి క్లాసిక్ టచ్ తో వచ్చిన లవ్ స్టోరీస్ కూడా ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు చెప్పుకోబోయే సినిమా కూడా అటువంటిదే. ఒకవేళ మీరు ఈ సినిమాను మిస్ అయినట్లే వెంటనే చూసేయండి.
ఓటీటీ లో క్రైమ్, హర్రర్, సస్పెన్స్ థ్రిల్లర్స్ ఏ కాకుండా మంచి క్లాసిక్ టచ్ తో వచ్చిన లవ్ స్టోరీస్ కూడా ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు చెప్పుకోబోయే సినిమా కూడా అటువంటిదే. ఒకవేళ మీరు ఈ సినిమాను మిస్ అయినట్లే వెంటనే చూసేయండి.
Swetha
ఈ మధ్య కాలంలో అన్ని హర్రర్, క్రైమ్, సస్పెన్స్ థ్రిల్లర్స్ సినిమాలను చూసి చూసి బోర్ కొట్టిన వారికి.. ఇప్పుడు చెప్పుకోబోయే ఓ న్యాచురల్ క్లాసిక్ లవ్ స్టోరీ మూవీ బాగా నచ్చేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఇటువంటి మూవీస్ అసలు రావడం లేదు. ఇప్పుడు అందరు సస్పెన్స్ థ్రిల్లర్స్ మూవీస్ ని ఇష్టపడుతూ ఉండడంతో .. మేకర్స్ కూడా ఈ సినిమాలను , సిరీస్ లను ఎక్కువగా ప్లాన్ చేస్తూ ఉంటున్నారు. దీనితో లవ్ స్టోరీస్ కాస్త వెనకపడిపోతున్నాయి. ఒక వేల ఆ జోనర్ లో సినిమాలు కానీ సిరీస్ లు కానీ వచ్చినా.. బోల్డ్ కంటెంట్ తో వచ్చేవే ఎక్కువగా ఉన్నాయి. ఈ క్రమంలో ఓ మంచి న్యాచురల్ లవ్ స్టోరీ ఓటీటీ లో ఉంది. ఇప్పటివరకు ఈ సినిమాను ఎవరైనా మిస్ అయ్యి ఉంటే వెంటనే చూసేయండి. మరి ఇంతకీ ఈ సినిమా ఏంటి ఏ ప్లాట్ ఫార్మ్ లో ఉంది అనేది చూసేద్దాం.
ఈ సినిమా పేరు “భానుమతి & రామకృష్ణ “. ఈ సినిమాలో నవీన్ చంద్ర, సలోనీ లూత్రా, రాజా చెంబోలు, హర్ష చెముడు ముఖ్య పాత్రలు పోషించారు. ఈ సినిమాకు శ్రీకాంత్ నాగోతి దర్శకత్వం వహించారు. ఇది 2020 లో వచ్చిన ఓ మంచి లవ్ స్టోరీ. ఇప్పటివరకు హర్రర్, సస్పెన్స్ థ్రిల్లర్స్ చూసి బోర్ కొట్టిన వాళ్లకు.. ఈ మూవీ కాస్త రీఫ్రెషింగ్ గా కూడా అనిపిస్తూ ఉంటుంది. కరోనా టైం లో వచ్చిన ఈ సినిమా ఓ మంచి హోమ్ మెడ్ లవ్ సినిమా అని చెప్పొచ్చు. ఈ సినిమాను ఎవరైనా మిస్ అయ్యి ఉంటే ఓ మంచి లవ్ స్టోరీని మిస్ అయినట్లే. ఈ సినిమా ఆహ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ లో అందుబాటులో ఉంది. అసలు ఈ సినిమాను ఎందుకు చూడాలి.. ఎందుకు ఈ సినిమా వర్త్ వాచింగ్ అనే విషయానికొస్తే..
ఈ సినిమా కథేంటంటే.. ఈ సినిమాలో భానుమతి ఒక 30 ఏళ్ళ సాఫ్ట్ వేర్ ఇంజనీర్.. ఆమెకు ఆత్మభిమానం చాలా ఎక్కువ. ఆమె ఒక అతనితో ఐదు సంవత్సరాలుగా ప్రేమలో ఉంటుంది. అయితే, ఆమెకు వయస్సు ఏక్కువగా ఉందని అతను భానుమతికి బ్రేక్ అప్ చెప్తాడు. దీనితో ఆమె బాగా డిస్టర్బ్ అవుతుంది. సరిగ్గా అదే సమయంలో ఊరి నుంచి నవీన్ చంద్ర హైదరాబాద్ కు వస్తాడు. అదే కంపెనీలో ఉద్యోగంలో జాయిన్ అవుతాడు. అయితే, వీల్లద్దరి లైఫ్ స్టయిల్స్ ఒకరితో ఒకరికి అసలు మ్యాచ్ అవ్వవు. అలాంటిది వీరిద్దరి మధ్యన ప్రేమ ఎలా పుట్టింది! వారి జర్నీ ఎలా సాగింది అనేది తెలియాలంటే ఈ సినిమాను చూడాల్సిందే. మరి ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.