iDreamPost
android-app
ios-app

OTT Movies: రేపు ఒక్క రోజే ఓటీటీలోకి 18 సినిమాలు!

ప్రతీ వారం లాగే ఈ వారంలో కూడా పెద్ద సంఖ్యలో సినిమాలు, వెబ్‌ సిరీస్‌లు పలు ఓటీటీ ప్లాట్‌ ఫామ్‌లలో స్ట్రీమింగ్‌ అవ్వనున్నాయి. అది కూడా జనవరి 5వ తేదీన 18 సినిమాలు స్ట్రీమింగ్‌ అవ్వనున్నాయి.

ప్రతీ వారం లాగే ఈ వారంలో కూడా పెద్ద సంఖ్యలో సినిమాలు, వెబ్‌ సిరీస్‌లు పలు ఓటీటీ ప్లాట్‌ ఫామ్‌లలో స్ట్రీమింగ్‌ అవ్వనున్నాయి. అది కూడా జనవరి 5వ తేదీన 18 సినిమాలు స్ట్రీమింగ్‌ అవ్వనున్నాయి.

OTT Movies: రేపు ఒక్క రోజే ఓటీటీలోకి 18 సినిమాలు!

ఓటీటీ అనేది ఇప్పుడు ఓ నిత్య అవసరంలా మారిపోయింది. జనం థియేటర్లలో సినిమాలు చూడ్డం కంటే ఓటీటీలో చూడ్డానికే ప్రాధాన్యత ఇస్తున్నారు. కొత్త కొత్త చిత్రాలు ఇంట్లో కూర్చుని చూసే అవకాశం ఉండటంతో ఓటీటీకి జై కొడుతున్నారు. అన్ని విధాల సామాన్య, మధ్య తరగతి కుటుంబాలకు ఓటీటీ వరంలా మారింది.​ ఓటీటీ ప్లాట్‌ ఫామ్‌లు కూడా తమ కస్టమర్లను ఆకర్షించడానికి మంచి మంచి కంటెంట్‌ను వారి ముందుకు తీసుకు వస్తున్నాయి.

 థియేటర్లలో విడుదలైన నెలలోపే కొత్త సినిమాలు ఓటీటీలోకి వస్తున్నాయి. ప్రతీ వారం పెద్ద సంఖ్యలో చిత్రాలు పలు ఓటీటీ ప్లాట్‌ ఫామ్‌లలో స్ట్రీమింగ్‌ అవుతున్నాయి. ఇక, ఈ వారంలో.. అది కూడా జనవరి 5వ తేదీన ఏకంగా 18 సినిమాలు స్ట్రీమింగ్‌ అవ్వనున్నాయి. ఇక, ఇప్పటికే తెలుగులో సూపర్‌ హిట్‌ అయిన హాయ్‌ నాన్నతో పాటు సుధీర్‌ హీరోగా చేసిన ‘ కాలింగ్‌ సహస్త్ర’లు స్ట్రీమింగ్‌ అవుతున్నాయి. వీటితో పాటు తమిళం, మలయాళం, హిందీ, ఇంగ్లీష్‌ భాషల సినిమాలు కూడా రేపు స్ట్రీమింగ్‌ అవ్వనున్నాయి.

ఈ వారంలో జనవరి 5వ తేదీన స్ట్రీమింగ్‌ అవ్వనున్న సినిమాలు, వెబ్‌ సిరీస్‌లు

నెట్‌ఫ్లిక్స్‌

  • గుడ్‌ గ్రీఫ్‌ ( ఇంగ్లీష్‌)
  • కంజురింగ్‌ కన్నప్పన్‌ ( తమిళం)
  • ద బ్రదర్స్‌ సన్‌ ( ఇంగ్లీష్‌)
  • సొసైటీ ఆఫ్‌ ది షాడో ( స్పానిష్‌ )
  • జియోంగ్‌ సోచ్‌ క్రియేచర్‌ పార్ట్‌ 2 ( దక్షిణ కొరియా సిరీస్‌)

ప్రైమ్‌

  • తోలీవ్వ ఎఫ్‌సీ ( మలయాళం)
  • కాదల్‌ ది కోర్‌ ( మలయాళం)
  • ఫో : ( ఇంగ్లీష్‌)
  • జేమ్స్‌ మే : అవర్‌ మేడిన్‌ ఇండియా ( ఇంగ్లీష్‌)
  • లాల్‌ లాస్ట్‌ వన్‌ లాఫింగ్‌ క్యూబిక్‌

సైనా ప్లే

  • ఉడల్‌ (మలయాళం)

జీ 5

  • తేజాస్‌ ( హిందీ)

ఆహా

  • లిల్లీ రాణి ( తెలుగు)

సోనీ లివ్‌ సిరీస్‌

  • క్యూబికల్‌ సీజన్‌ 3 ( హిందీ)

హాట్‌ స్టార్‌ సిరీస్‌

  • పెరిలూర్‌ ప్రీమియర్‌ లీగ్‌ ( మలయాళం)

బుక్‌ మై షో 

  • ఏ సావన్నా హంటింగ్‌ ( ఇంగ్లీష్‌)
  • ద మార్స్‌ కింగ్స్‌ డాటర్‌ ( ఇంగ్లీష్‌)
  • వేర్‌ హౌస్‌ వన్‌ ( ఇంగ్లీష్‌ )

హాయ్‌ నాన్న కథ విషయానికి వస్తే.. 

విరాజ్‌ ( నాని) ఎప్పటికైనా ఓ ఫేమస్‌ ఫొటో గ్రాఫర్‌ అ‍వ్వాలని కలలు కంటూ ఉంటాడు. ఇందుకోసం ఓ పెద్ద ఫొటోగ్రాఫర్‌ దగ్గర అప్రెంటిస్‌గా చేరతాడు. ఆ సమయంలో అతడికి యశ్న( మృణాల్‌ ఠాకూర్‌) పరిచయం అవుతుంది. ప్రేమ, పెళ్లి, పిల్లలు నచ్చని ఆమె విరాజ్‌తో ప్రేమలో పడుతుంది. తర్వాత ఇద్దరూ పెళ్లి చేసుకుంటారు. పిల్లల విషయంలో ఇద్దరికీ గొడవ అవుతుంది. అయినప్పటికి యశ్న.. విరాజ్‌ కోసం పిల్లల్ని కనడానికి ఒప్పుకుంటుంది. ఇద్దరికీ ఓ పాప పుడుతుంది. పాప పుట్టిన తర్వాత ఇద్దరి జీవితాలు ఏమయ్యాయి అన్నదే మిగిలిన కథ. మరి, ఈ వారంలో జనవరి 5వ తేదీన ఒక్క రోజే 13 సినిమాలు ఓటీటీ స్ట్రీమింగ్‌ అవ్వటంపై మీ అభిప్రాయాలను కామెం‍ట్ల రూపంలో తెలియజేయండి.