iDreamPost
android-app
ios-app

Divya Bharathi : దివ్యభారతి చివరి జ్ఞాపకం

  • Published Feb 02, 2022 | 11:44 AM Updated Updated Dec 06, 2023 | 4:06 PM

దీనికి రెండేళ్ల ముందు ఖయామత్ సే ఖయామత్ తక్ తో హీరోగా తెరంగేట్రం చేసిన అమీర్ ఖాన్ కు డెబ్యూనే బ్లాక్ బస్టర్ తో పాటు ఫిలిం ఫేర్ అవార్డు కూడా తెచ్చింది. రెండో చిత్రం రాఖ్ ఏకంగా జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చింది. తరువాత మూడు సినిమాలు ఓ మోస్తరుగా ఆడాక రచయిత ఇంద్ర కుమార్ దర్శకుడయ్యే ప్రయత్నాల్లో దిల్ కథతో అమీర్ ని కలిశాడు. పక్కా యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ ఇది.

దీనికి రెండేళ్ల ముందు ఖయామత్ సే ఖయామత్ తక్ తో హీరోగా తెరంగేట్రం చేసిన అమీర్ ఖాన్ కు డెబ్యూనే బ్లాక్ బస్టర్ తో పాటు ఫిలిం ఫేర్ అవార్డు కూడా తెచ్చింది. రెండో చిత్రం రాఖ్ ఏకంగా జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చింది. తరువాత మూడు సినిమాలు ఓ మోస్తరుగా ఆడాక రచయిత ఇంద్ర కుమార్ దర్శకుడయ్యే ప్రయత్నాల్లో దిల్ కథతో అమీర్ ని కలిశాడు. పక్కా యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ ఇది.

Divya Bharathi : దివ్యభారతి చివరి జ్ఞాపకం

ఒక భాషలో సంచలన విజయం సాధించిన సినిమా మరో చోట అదే ఫలితం అందుకుంటుందనుకుంటే అంతకన్నా పొరపాటు మరొకటి ఉండదు. దీనికి చాలా ఉదాహరణలు ఉన్నాయి కానీ కొన్ని మాత్రం ప్రత్యేకంగా నిలుస్తాయి. మచ్చుకొకటి చూద్దాం. 1990. దీనికి రెండేళ్ల ముందు ఖయామత్ సే ఖయామత్ తక్ తో హీరోగా తెరంగేట్రం చేసిన అమీర్ ఖాన్ కు డెబ్యూనే బ్లాక్ బస్టర్ తో పాటు ఫిలిం ఫేర్ అవార్డు కూడా తెచ్చింది. రెండో చిత్రం రాఖ్ ఏకంగా జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చింది. తరువాత మూడు సినిమాలు ఓ మోస్తరుగా ఆడాక రచయిత ఇంద్ర కుమార్ దర్శకుడయ్యే ప్రయత్నాల్లో దిల్ కథతో అమీర్ ని కలిశాడు. పక్కా యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ ఇది.

ఆ టైంలో బాలీవుడ్ లవ్ ఫీవర్ తో ఊగిపోతోంది. మైనే ప్యార్ కియా దానికి పునాది వేయగా మంచి పాటలు, చక్కని జోడి, కాసిన్ని ఎమోషన్లు ఉంటే చాలు ఆడియన్స్ బ్రహ్మరథం పడుతున్నారు. అందుకే దిల్ కు ఓకే చెప్పడానికి అమీర్ ఖాన్ ఎక్కువ టైం తీసుకోలేదు. తేజాబ్ దెబ్బకు నేషనల్ క్రష్ గా మారిపోయిన మాధురి దీక్షిత్ హీరోయిన్ గా తీసుకోవడంతో షూటింగ్ టైంలోనే క్రేజ్ వచ్చేసింది. ఆనంద్ మిలింద్ తో అద్భుతమైన పాటలు కంపోజ్ చేయించుకున్నారు ఇంద్ర కుమార్. 2 కోట్ల బడ్జెట్ తో సినిమా స్కోప్ లో నిర్మించారు. 1990 జూన్ 22న విడుదలైన దిల్ దెబ్బకు బాక్సాఫీస్ కదిలిపోయింది. 20 కోట్ల వసూళ్లు వర్షంలా కురిశాయి.

ఉమ్మడి తెలుగు రాష్ట్రంలోనూ దిల్ కు బ్రహ్మరథం దక్కింది. కట్ చేస్తే మూడేళ్ళ తర్వాత 1993లో దిల్ ని తెలుగులో రీమేక్ చేసేందుకు పూనుకున్నారు దర్శకుడు ఋష్యేందర్ రెడ్డి. గణేష్ పాత్రో సంభాషణలతో ఇళయరాజా సంగీతంతో మంచి టీమ్ ని సెట్ చేసుకున్నారు. చామంతితో గుర్తింపు తెచ్చుకున్న ప్రశాంత్ హీరోగా బొబ్బిలిరాజా, రౌడీ అల్లుడుతో ఇక్కడా క్రేజ్ సంపాదించుకున్న దివ్య భారతి హీరోయిన్ గా తొలిముద్దు టైటిల్ తో తీశారు. అయితే షూటింగ్ చివరి దశలో ఉండగా ఆమె అకస్మాత్తుగా ఆత్మహత్య చేసుకుని చనిపోవడంతో మిగిలిన కొద్ది భాగాన్ని అదే పోలికల్లో కనిపించే రంభని పెట్టి పూర్తి చేశారు. ఆ ఏడాది అక్టోబర్ 16 విడుదలైన తొలిముద్దు ఆశించిన విజయం అందుకోలేదు. రెండు రోజుల ముందు వచ్చిన జెంటిల్ మెన్ సునామి ముందు నిలవలేకపోయింది

Also Read : HUM : స్టార్ హీరోల బ్లాక్ బస్టర్లకు ఇదే మూలం – Nostlagia