Idream media
Idream media
ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ట్రస్ట్ బోర్డు చైర్మన్‌గా మళ్లీ వైవీ సుబ్బారెడ్డి నియమితులయ్యారు. వరుసగా రెండోసారి ఆయన్ను చైర్మన్‌గా నియమిస్తూ వైఎస్ జగన్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఈ రోజు అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పదవిలో ఆయన రెండేళ్లపాటు కొనసాగనున్నారు.
వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత టీటీడీ చైర్మన్‌గా వైవీ సుబ్బారెడ్డి పని చేశారు. ఇటీవల రెండేళ్ల కాలపరిమితి ముగిసింది. మళ్లీ అదే పోస్టులో వైవీని కొనసాగించేందుకు వైసీపీ అధిష్టానం ఆసక్తి చూపకగా.. వైవీ సుబ్బారెడ్డి మాత్రం తాను క్రియాశీలక రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నట్లు తన మనసులోని మాటను బయటపెట్టారు. రాష్ట్రం లేదా జాతీయ రాజకీయాలలో అవకాశాన్ని ఆయన ఆశిస్తున్నట్లు ప్రచారం జరిగింది. ఈ పరిణామాల నేపథ్యంలో టీటీడీ చైర్మన్ పదవి భర్తీలో కొంత ఆలస్యం జరిగింది. వైవీ సుబ్బారెడ్డి దంపతులు పది రోజుల అమెరికా పర్యటనను ముగించుకుని వచ్చిన వెంటనే టీటీడీ చైర్మన్ పోస్టును ప్రభుత్వం భర్తీ చేసింది.
2014 సాధారణ ఎన్నికల్లో తొలిసారి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చిన వైవీ సుబ్బారెడ్డి ఒంగోలు లోక్‌సభ నుంచి పోటీ చేసి గెలిచారు. ప్రత్యేక హోదా కోసం దాదాపు ఏడాదిన్నర ముందే ఎంపీ పదవికి రాజీనామా చేశారు. 2019 ఎన్నికల్లో ప్రకాశం జిల్లా రాజకీయ పరిణామాల నేపథ్యంలో మాజీ ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డికి వైసీపీ లోక్‌సభ టిక్కెట్ ఇచ్చింది. అయిష్టంగానే వైవీ సుబ్బారెడ్డి పార్టీ వ్యవహారాలకే పరిమితం అయ్యారు. ఉభయగోదావరి జిల్లాల కో ఆర్డినేటర్‌గా విజయవంతంగా పని చేశారు. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సముచిత స్థానం కల్పిస్తూ ఆయన్ను టీటీడీ చైర్మన్‌గా నియమించింది.
Also Read : మూడు రాజధానుల వైపు.. ఏపీ సర్కార్ వడివడిగా అడుగులు వేస్తోందా..?