iDreamPost
android-app
ios-app

21 మంది ఇన్ ఛార్జులతో.. YSRCP మూడో జాబితా విడుదల

YSRCP Incharge Third List: మరోసారి అధికారమే లక్ష్యంగా వైఎస్ జగన్ నిర్ణయాలు తీసుకుంటున్నారు. అందులో భాగంగానే ఇన్ ఛార్జుల మూడో జాబితాను విడుదల చేశారు.

YSRCP Incharge Third List: మరోసారి అధికారమే లక్ష్యంగా వైఎస్ జగన్ నిర్ణయాలు తీసుకుంటున్నారు. అందులో భాగంగానే ఇన్ ఛార్జుల మూడో జాబితాను విడుదల చేశారు.

21 మంది ఇన్ ఛార్జులతో.. YSRCP మూడో జాబితా విడుదల

అధికార వైఎస్సార్ సీపీ అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాల ఇన్ ఛార్జులను మార్పులు చేస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగానే ఇప్పటికే రెండు జాబితాలను విడుదల చేశారు. తాజాగా వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ మూడో జాబితాను విడుదల చేశారు. మొత్తం 21 మంది సమన్వయకర్తలతో కూడిన మూడో జాబితాను ఆయన విడుదల చేశారు. 175కు 175 స్థానాల్లో విజయమే లక్ష్యంగా ఈ మార్పులు చేర్పులు చేస్తున్నామని ఇప్పటికే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పార్టీ శ్రేణులకు వెల్లడించిన విషయం తెలిసిందే. అందులో భాగంగానే ఇప్పుడు మూడో జాబితాను కూడా విడుదల చేశారు.

ఈ మూడో జాబితాలో పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాల సమన్వయకర్తలు ఉన్నారు. శ్రీకాకుళం(ఎంపీ) పేరాడ తిలక్, విశాఖపట్నం (ఎంపీ) బొత్స ఝాన్సీ లక్ష్మీ, ఏలూరు (ఎంపీ) కారుమూరి సునీల్ కుమార్ యాదవ్, విజయవాడ (ఎంపీ) కేశినేని నాని, కర్నూలు (ఎంపీ) గుమ్మనూరి జయరాం, తిరుపతి (ఎంపీ) కోనేటి ఆదిమూలం, ఇఛ్చాపురం- పిరియ విజయ, టెక్కలి- దువ్వాడ శ్రీనివాస్, చింతలపూడి(ఎస్సీ)- కంభం విజయ రాజు, రాయదుర్గం- మెట్టు గోవిందరెడ్డి, దర్శి- బూచేపల్లి శివప్రసాదరెడ్డి, పూతలపట్టు(ఎస్సీ)- మూతిరేవుల సునీల్ కుమార్, చిత్తూరు- విజయానందరెడ్డి, మదనపల్లె- నిస్సార్ అహ్మద్, రాజంపేట- ఆకేపాటి అమర్ నాథ్ రెడ్డి, ఆలూరు- జూసినే విరూపాక్షి, కోడుమూరు(ఎస్సీ)- డాక్టర్ సతీష్, గూడూరు(ఎస్సీ)- మేరిగ మురళి, సత్యవేడు (ఎస్సీ)- మద్దిల గురుమూర్తి, పెనమలూరు- జోగి రమేశ్, పెడన- ఉప్పాల రాము పేర్లను ప్రకటించారు. శ్రీకాకుళం జడ్పీ ఛైర్మన్ గా ఉప్పాడ నారాయణమ్మను నియమిస్తూ ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం ఆవిడ ఇచ్ఛాపురం జడ్పీటీసీగా పనిచేస్తున్నారు.