iDreamPost
android-app
ios-app

సీమ సింహాలు! జోరుగా..

సీమ సింహాలు! జోరుగా..

రాయలసీమలోని నగరపాలక సంస్థల ఫలితాల్లో వైయస్సార్సీపి దూసుకు వెళుతోంది. క్లీన్ స్వీప్ చేసే దిశగా మంచి ఆధిక్యత అన్నిచోట్ల కనబరచడం విశేషం. ఆధ్యాత్మిక నగరం తిరుపతి, కర్నూలు, అనంతపురం కార్పొరేషన్లను సాధించే దిశగా అధికార పార్టీ ఆధిక్యం సాధించింది.

తిరుపతిలో కాస్తలో..

తిరుపతి నగరపాలక సంస్థ ఎన్నికల్లో వైసిపి కాస్తలో క్లీన్o స్వీప్ మిస్ అయింది. ఇక్కడ 23 డివిజన్లు ఇప్పటికే ఏకగ్రీవం కాగా, 27 డివిజన్లకు ఎన్నికలు జరిగాయి. ఒక డివిజన్ మినహా మిగిలిన 26వ డివిజన్లోని వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు ప్రభంజనం సృష్టించారు. కేవలం 32వ ఈ విధంగా మాత్రమే టిడిపి అభ్యర్థి స్వల్ప ఆధిక్యంతో గెలిచారు. వైఎస్సార్సీపీ గెలిచిన చోట్ల గణనీయమైన మెజార్టీ రావడం విశేషం. మేయర్ అభ్యర్థులతో పాటు, డిప్యూటీ మేయర్ అభ్యర్థి ఎమ్మెల్యే తనయుడు భూమన అభినయ రెడ్డి ఎప్పటికీ ఏకగ్రీవం అయ్యారు. 50 డివిజన్లలో 49 గెలుచుకోవడం ద్వారా తిరుపతి నగరమంతా అధికార పార్టీ వైపు ఉన్నట్లు అయింది. దీంతో దాదాపు మేయర్ పీఠం మీద ఒక మేయర్ పీఠం మీద కూడా ఇక్కడ స్పష్టత వచ్చినట్లయింది. అంతా సంఘటితంగా పనిచేయడంతో వైకాపా ప్రభంజనం ఆధ్యాత్మిక నగర్లో మారుమోగి నట్లయింది. నాయకులందరినీ ఒకే తాటిమీద కి తీసుకువచ్చి నడిపించడంలో ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి చాకచక్యం చక్కగా ఫలించింది.

కర్నూలు నగరపాలక సంస్థ లోనూ వైసిపి హవా స్పష్టంగా కనిపించింది. ఇక్కడున్న 52 డివిజన్లకు గాను వెలువడిన ఫలితాల్లో 30 డివిజన్లు ఏకపక్షంగా వైఎస్ఆర్సిపి కి వచ్చాయి. కేవలం ఐదు డివిజన్ లో మాత్రమే టిడిపి విజయం సాధించింది. మరికొన్ని డివిజన్ల ఫలితాలు ఇంకా రావాల్సి ఉంది. కౌంటింగ్ ముందుకు వెళుతున్న కొద్దీ వైఎస్ఆర్సిపి గెలుపొందే డివిజన్ లో భారీగా పెరగవచ్చని తెలుస్తోంది. ఇక్కడ ఎమ్మెల్యే అబ్దుల్ హఫీజ్ ఖాన్ చాకచక్యంగా అభ్యర్థులను ఎంపిక చేయడంతో మొదటి రౌండ్ ఫలితాలు వెలువడిన సమయానికి అధికార పార్టీ స్పష్టంగా మేయర్ పోవడానికి దగ్గరగా వచ్చింది. ఇక జిల్లాలోని నేతలందరూ కూడా కర్నూలు కార్పొరేషన్ ఫలితం మీద పని చేయడంతో ఇక్కడ స్పష్టమైన ఫలితాలు వచ్చాయని చెప్పవచ్చు.

అనంతపురంలో ఫ్యాన్ గాలి జోరుగా వీస్తోంది. మొదటి రౌండ్ ఫలితాలు ప్రకటించిన డివిజన్లలో అధికార పార్టీ హవా స్పష్టంగా కనిపించింది. ఎక్కడ వెలువడుతున్న ఫలితాల్లో అధికార పార్టీ అభ్యర్థులకు జరుగుతున్న డివిజన్లలో భారీ మెజారిటీ రావడం చూస్తే నగర ఓటరు కచ్చితంగా జగన్ ప్రభుత్వాన్ని నమ్ముతున్నారనేది స్పష్టంగా తెలుస్తోంది. మొదటి రౌండ్ ఫలితాల్లో వెలువరించిన డివిజన్ లలో వైసీపీ 15 డివిజన్లోని గెలుచుకొని అధికారానికి దగ్గరవుతోంది. టీడీపీ ఇక్కడ కేవలం 3 స్థానాలతో సరిపెట్టుకుంది. ఇక్కడ కచ్చితంగా గెలుపు అవసరమైన అన్ని డివిజన్ లను అధికార పార్టీ గెలుచుకుంటుందని ధీమాతో నేతలు ఉన్నారు. టిడిపి కి అనుకూలంగా ఉన్న డివిజన్లలో సైతం వైకాపా హవా కనిపించడంతో ఇక విజయం మీద తిరుగులేదని అధికార పార్టీ నేతలు అప్పుడే సంబరాల్లో మునిగిపోయారు. కీలక కార్పొరేషన్లలో అధికార పార్టీ స్పష్టమైన ఆధిక్యం ప్రదర్శించడంతో పాటు, క్లీన్ స్వీప్ చేసే దిశగా ముందుకు వెళ్లడం రాయలసీమలో నేతలకు మంచి బూస్ట్ ఇచ్చినట్లయింది.