Idream media
Idream media
ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గం చిత్తూరు జిల్లా కుప్పంలో వరుస ఎన్నికల్లో వచ్చిన ఫలితాలు.. తెలుగుదేశం పార్టీకి ఏ మాత్రం రుచించని విధంగా ఉన్నాయని స్పష్టమవుతోంది. పంచాయతీ, పరిషత్ ఎన్నికల ఫలితాల్లో మునుపెన్నడూలేనంత ఘోర ఓటమిని మూటగట్టుకోవడంతో.. టీడీపీలో అసంతృప్తి, వైసీపీపై అక్కసు పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో టీడీపీ కార్యకర్తలు.. కుప్ప లో తమ ప్రతాపాన్ని చూపుతున్నారు.
తాజాగా కుప్పం నియోజకవర్గం గుడిపల్లి మండలం కొత్తూరులో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని ధ్వంసం చేశారు. గురువారం అర్థరాత్రి ఈ ఘటన జరిగింది. ఈ రోజు తెల్లవారుజామున విగ్రహ ధ్వసం ఘటన వెలుగులోకి రావడంతో.. వైసీపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. వైఎస్సార్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారిని వెంటనే పట్టుకుని శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.
Also Read : టార్గెట్ కుప్పం అసెంబ్లీ.. టీడీపీలో టెన్షన్ టెన్షన్…!
గతంలోనూ ఆంధ్రప్రదేశ్‌లో పలుచోట్ల వైఎస్సార్ విగ్రహాలను ధ్వంసం చేసిన ఘటనలు జరిగాయి. అయితే ఈ సారి ఏకంగా ప్రతిపక్ష నేత చంద్రబాబు సొంత నియోజకవర్గంలోనే వైఎస్సార్ విగ్రహ ధ్వంసం ఘటన చేటుచేసుకోవడం గమనార్హం. 2019 ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత నుంచి టీడీపీ నేతలు, కార్యకర్తలు వైసీపీపై రగిలిపోతున్నారు. ఆ పార్టీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు, దూషణలు వారిలోని అసహనానికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు. అందులో నుంచి వచ్చినదే ఈ విగ్రహాల ధ్వంసం ఎపిసోడ్.
గత సార్వత్రిక ఎన్నికల్లో చిత్తూరు జిల్లాలో కుప్పం మినహా.. మిగతా 13 స్థానాల్లో టీడీపీ ఓడిపోయింది. చంద్రబాబు సొంత జిల్లాలో తలెత్తిన ఈ పరిస్థితిని టీడీపీ జీర్ణించుకోలేకపోయింది. ఆ ఘోర ఓటమి తాలుకూ చేదు జ్ఞాపకాల నుంచి బయటపడుతున్న సమయంలో.. పంచాయతీ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలు టీడీపీ క్యాడర్‌ను మానసికంగా తీవ్రంగా దెబ్బతీసింది. అన్ని నియోజకవర్గాలతోపాటు.. కుప్పంలో కూడా టీడీపీ పంచాయతీ పోరులో చతికిలపడింది.
Also Read : నాడు కొడాలి మీద కథలు అల్లితిరే .. నారావారిపల్లె ఓటమి మీద ఇప్పుడేమంటారు బాబు?
నియోజకవర్గంలో 89 పంచాయతీలు ఉండగా.. 74 చోట్ల వైసీపీ విజయబావుటా ఎగురవేసింది. బాబు గుండెకాయ అని చెప్పే గుడిపల్లిలో 13 పంచాయతీలకు గాను 13 చోట్లా వైసీపీనే నెగ్గింది. తాజాగా వైఎస్సార్ విగ్రహ ధ్వంసం ఘటన ఈ మండలంలోనే జరిగింది. ఈ ఫలితాలు కుప్పుం టీడీపీలో అగ్నికి ఆజ్యం పోశాయి. కారణం మీరంటూ.. మీరని ఫలితాలు వచ్చిన సమయంలో తమ్ముళ్లు ఆరోపణలు చేసుకున్నారు. ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు చంద్రబాబు మూడు రోజులు అక్కడ పర్యటించారు.
పంచాయతీ పోరులో ఎదురైన ఘోర పరాభవం నుంచి బయటకు వస్తున్న తరుణంలో.. తాజాగా వెలువడిన పరిషత్ ఎన్నికల ఫలితాలు టీడీపీ శ్రేణులకు తీవ్ర నిరాసను కలిగించాయి. ఏకంగా కుప్పుం, చంద్రబాబు సొంత గ్రామం నారావారి పల్లెలోనూ ఎంపీటీసీ స్థానాలను వైసీపీ గెలుచుకుంది. దీంతో చంద్రబాబు ఇమేజ్ డ్యామేజ్ అయింది. పరిషత్ ఎన్నికలను బహిష్కరించామంటూ కవర్ చేసే ప్రయత్నాలు ఫలితం ఇవ్వలేదు. దీంతో టీడీపీ శ్రేణలు తమ అక్కసును వైఎస్సార్ విగ్రహం ధ్వంసం చేయడం ద్వారా బయటపెట్టుకున్నారని వైసీపీ స్థాణిక నేతలు ఆరోపిస్తున్నారు.
Also Read : కుప్పం కోట మీద వైసీపీ జండా ఎగరేసిన హాసిని