iDreamPost
android-app
ios-app

వైఎస్సార్‌సీపీ ఆవిర్భావం.. సీఎం జగన్‌ సందేశం

వైఎస్సార్‌సీపీ ఆవిర్భావం.. సీఎం జగన్‌ సందేశం

యువజన శ్రామిక రైతు కాంగ్రెస్‌ పార్టీ (వైఎస్సార్‌సీపీ) ఆవిర్భవించి నేటికి పదేళ్లు అవుతోంది. పార్టీ ఏర్పాటు, ఈ పదేళ్ల ప్రయాణాన్ని ఆ పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి గుర్తు చేసుకున్నారు. ట్విట్టర్‌ వేదికగా ఓ సందేశాన్ని పోస్టు చేశారు.

‘‘మహానేత ఆశయ సాధనే లక్ష్యంగా, విలువలు, విశ్వసనీయతల పునాదులపై వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ పురుడు పోసుకుంది. ఈ పదేళ్ల ప్రయాణంలో కష్ట సుఖాల్లో నాకు అండగా నిలిచిన ప్రజలకు, నాతో కలిసి నడిచిన నాయకులకు, నా వెన్నంటి ఉన్న కార్యకర్తలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను’’ అని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ట్వీట్‌ చేశారు.

2009లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చిన వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి కపడ లోక్‌సభ సభ్యుడుగా పోటీ చేసి గెలిచారు. ఆయన తండ్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి రెండో సారి ముఖ్యమంత్రిగా కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడింది. ప్రభుత్వం ఏర్పడిన ఆరు నెలలకే వైఎస్‌ రాజశేఖరరెడ్డి మరణించడంతో ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో పెనుమార్పులు చోటు చేసుకున్నాయి. వైఎస్‌ మరణం తర్వాత కాంగ్రెస్‌ పార్టీ వైఎస్‌ జగన్‌ పట్ల, ఆయన కుటుంబం పట్ల వ్యవహరించిన తీరు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆవిర్భావానికి ప్రధాన కారణమైంది. పార్టీ ఏర్పాటు చేసిన తర్వాత సీబీఐ, ఈడీ కేసులతో వేధించినా, జైలుకు పంపినా వైఎస్‌ జగన్‌ ఏ మాత్రం అదరలేదు, బెదరలేదు.

కాంగ్రెస్‌ పార్టీకి , ఎంపీ పదవికి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి, పులివెందుల ఎమ్మెల్యే పదవికి వైఎస్‌ విజయమ్మ రాజీనామా చేశారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీని స్థాపించి 2011లో ఉప ఎన్నికల్లో పోటీ చేశారు. కడప ఎంపీగా వైఎస్‌ జగన్‌ 5.45,672 ఓట్లు, పులివెందుల ఎమ్మెల్యేగా వైఎస్‌ విజయమ్మ 81,373 ఓట్ల భారీ మెజారిటీతో గెలిచారు.

ఒక ఎంపీ, ఒక ఎమ్మెల్యేతో ప్రారంభమైన వైసీపీ ప్రయాణం.. ఆ తర్వాత 2012 నాటికి ఇద్దరు ఎంపీలు, 16 ఎమ్మెల్యేలకు చేరుకుంది. తన తండ్రి మరణాన్ని తట్టుకోలేక మరణించిన వారి కుటుంబాలను పరామర్శించేందుకు ఓదార్పుయాత్ర పేరుతో వైఎస్‌ జగన్‌ ప్రజల్లోకి వచ్చారు.

2014లో అధికారానికి దాదాపు ఐదు లక్షల ఓట్ల దూరంలో ఆగిపోయిన జగన్‌ పార్టీ.. 9 ఎంపీ, 67 ఎమ్మెల్యే సీట్లను గెలుచుకుని తన బలాన్ని చాటి చెప్పింది. వైసీపీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలను టీడీపీ ప్రలోభపెట్టి తీసుకున్నా.. ఏ మాత్రం బెనకని వైసీపీ, ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌.. ప్రజా సంకల్ప పాదయాత్రతో ప్రజల తరఫున టీడీపీ ప్రభుత్వ వైఫల్యాలపై ప్రశ్నించి, వైఎస్సార్‌సీపీ వస్తే ఏం చేస్తామో వివరించారు.

Also Read : పోరాట‌ప‌థం.. ప్ర‌జాసంక్షేమం – ప‌దేళ్ల వైఎస్సార్‌సీపీ ప్ర‌స్థానం

తద్ఫలితంగా 2019లో తెలుగు రాజకీయ చరిత్రలోనే భారీ మెజారిటీతో వైఎస్సార్‌ సీపీ అధికారంలోకి వచ్చింది. 25 ఎంపీలకు గాను 22, 175 ఎమ్మెల్యే స్థానాలకు గాను 151 సీట్లు గెలుచుకునే పార్టీలా వైఎస్సార్‌సీపీని తీర్చిదిద్దిన వైఎస్‌ జగన్‌ దేశం మొత్తం తన వైపు చూసేలా రాజకీయ ప్రయాణం సాగించారు.