iDreamPost
android-app
ios-app

జగన్‌ చిత్తశుద్ధి.. చేతివృత్తుల వారికి నేడు నగదు జమ

జగన్‌ చిత్తశుద్ధి.. చేతివృత్తుల వారికి నేడు నగదు జమ

ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలుచేయడం కోసం పథకాలను ప్రారంభించడం ఒక వంతు అయితే.. ఆయా పథకాలను చిత్తశుద్ధితో అమలు చేయడం ఆంధ్రప్రదేశ్‌లో చూస్తున్నాం. మొక్కుబడిగా పథకాలను పెట్టి.. మమ అనిపించే రోజుల నుంచి.. పథకాలను ప్రవేశపెట్టి.. అర్హలైన ప్రతి ఒక్కరికీ ఆ పథకం ఫలాలను అందించడం, ప్రతి ఏడాది అమలు చేయడం ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతోంది. ప్రజా సంక్షేమం కోసం వివిధ పథకాలను ప్రవేశపెట్టిన సీఎం వైఎస్‌ జగన్‌.. వాటిని క్రమం తప్పకుండా అమలు చేస్తూ ప్రజల మన్ననలను పొందుతున్నారు. సంక్షేమ పథకాల అమల్లో భాగంగా ఈ రోజు రెండో ఏడాది జగనన్న చేదోడు పథకం నగదును లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయనున్నారు.

చేతి వృత్తుల ద్వారా జీవనం సాగిస్తున్న దర్జీలు, రజకులు, నాయీ బ్రహ్మణులకు ప్రభుత్వం నుంచి సాయం అందిస్తామని సీఎం జగన్‌ ఎన్నికల ప్రచారసభల్లో చెప్పారు. ఆ మేరకు ఎన్నికల మేనిఫెస్టోలోనూ ఆ విషయం పొందుపరిచారు. ఈ వర్గాల వారికి ఏడాదికి పదివేల రూపాయలు అందించే లక్ష్యంగా గత ఏడాది జగనన్న చేదోడు పేరుతో పథకం ప్రారంభించారు. దుకాణాలు ఉన్న 2,98,430 మంది టైలర్లు, రజకులు, నాయీ బ్రహ్మణులకు 298.43 కోట్ల రూపాయలను అందించారు. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా వలంటీర్ల సహకారంతో దరఖస్తులు స్వీకరించి అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ పథకం అందించారు.

తాజాగా ఈ రోజు రెండోసారి జగనన్న చేదోడు పథకం అమలు చేస్తున్నారు. అర్హులైన 2,85,350 మందికి పది వేల రూపాయల చొప్పన 285.35 కోట్ల రూపాయలను అందించనున్నారు. సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి తన క్యాంపు కార్యాలయంలో బటన్‌ నొక్కి నగదును లబ్ధదారుల ఖాతాల్లో జమ చేసే ప్రక్రియను ప్రారంభించనున్నారు. మొత్తం లబ్ధిదారుల్లో టైలర్లు 1,25,926 మంది, 82,347 మంది రజకులు, 38,767 మంది నాయీ బ్రహ్మణులు ఉన్నారు. మొత్తంగా రెండు సంవత్సరాల్లో షాపులు ఉన్న టైలర్లు, రజకులు, నాయీ బ్రహ్మణులకు జగన్‌ సర్కార్‌ 583.78 కోట్ల రూపాయల ఆర్థిక సాయం అందించింది.

Also Read : స‌మ‌తామూర్తి స‌న్నిధికి జ‌గ‌న్