Idream media
Idream media
ఒకే ఒక్క నిబంధన.. ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ జగన్ నేతృత్వంలోని వైసీపీ ప్రభుత్వం ఎలా పని చేస్తుందో తెలియజేస్తోంది. ఆ ఒక్క నిబంధన వైఎస్ జగన్ పాలనకు 100 మార్కులు తెచ్చిపెడుతోంది. ఆ ఒక్క నిబంధన అర్హత ఉండి సంక్షేమ పథకాలు అందని వారంటూ లేకుండా చేస్తోంది.. ఆ ఒక్క నిబంధన ప్రభుత్వాల సంక్షేమంలో.. వైఎస్ జగన్ ప్రభుత్వ సంక్షేమ పాలనను వేరు చేస్తోంది. అదే 30 రోజులు నిబంధన.
నవరత్నాలతో సహా ఎన్నికల సమయంలో వైఎస్ జగన్ పలు హామీలు ఇచ్చారు. ఆయా హామీలన్నింటిని పేర్చి రెండు పేజీలతో తన పార్టీ మేనిఫెస్టోను ప్రకటించారు. అందులో పేర్కొన్న దాదాపు 98 శాతం హామీలను ఇప్పటికే అమలు చేశారు సంక్షేమ పథకాల అమలులో వైఎస్ జగన్ ప్రభుత్వం చరిత్ర సృష్టించింది. నగదు బదిలీ పథకాలతో ఏపీ ప్రజల జీవన ప్రమాణాలను పెంచింది. సంతృప్తి స్థాయిలో ఆయా పథకాలను వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తూ ప్రజల మన్ననలను పొందుతోంది. ఎలాంటి వివక్షతకు తావు ఇవ్వకుండా.. రకరకాల కొర్రీలు వేయకుండా.. ఏ చిన్నపాటి అర్హత ఉన్నా.. పథకం అందించాలనే లక్ష్యంతో వైసీపీ ప్రభుత్వం పని చేస్తోంది. అర్హత ఉండీ.. పథకం అందలేదనే మాట ఒక్కచోట కూడా వినిపించుండా ఉండేలా.. పథకం అమలు చేసిన తర్వాత కూడా అర్హత ఉన్న వాళ్లు దరఖాస్తు చేసుకునే అవకాశం జగన్ ప్రభుత్వం కల్పించింది. 30 రోజుల సమయం ఇచ్చిన వైసీపీ ప్రభుత్వం.. ఆ లోపు అర్హత ఉన్న వాళ్లు.. సమీపంలోని గ్రామ, వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవచ్చు. లేదా తమ వలంటీర్‌కు పత్రాలు అందించవచ్చు.
కొత్త పథకాలకే కాదు.. పాత పథకాలకు కూడా ఈ నిబంధనను జగన్ ప్రభుత్వం అమలు చేస్తుండం విశేషం. ఈ వెలుసుబాటు వల్ల సకాలంలో దరఖాస్తు చేసుకోవని వారికి ఆయా పథకాలు అందే అవకాశం ఉంటోంది. ఈ రోజు వైఎస్సార్ వాహన మిత్ర పథకం.. మూడో విడతను జగన్ ప్రభుత్వం ఈ రోజు అమలు చేసింది. 2.48 లక్షల మంది లబ్ధిదారులకు పది వేల రూపాయల చొప్పున వారి ఖాతాల్లో జమ చేసింది. అర్హత ఉన్న ప్రతి ఒ్కరికీ పథకం అందించాలనే లక్ష్యంతో జగన్ ప్రభుత్వం పని చేస్తుండడంతో ప్రతి ఏడాది లబ్ధిదారుల సంఖ్య పెరుగుతూ ఉంది. కరోనా సమయంలో ఆయా పథకాలు అమలు ఆగలేదంటే వైఎస్ జగన్ పాలన ఎలా సాగుతుందో అర్థం చేసుకోవచ్చు. రాజకీయ ప్రమేయం లేకుండా వలంటీర్ల ద్వారా ప్రభుత్వం నేరుగా ప్రజలకు పథకాలను అందిస్తుండడం ఆంధ్రప్రదేశ్ చరిత్రలో మునుపెన్నడూ చోటు చేసుకోలేదు. పథకాలకు కొర్రీలు వేసే సంస్కృతి పోయి.. అర్హులందరీకి వాటిని అందించాలనే సంస్కృతికి వైసీపీ ప్రభుత్వం నాంది పలికింది.
Also Read : కొయ్యే మోషేన్‌రాజు.. కౌన్సిలర్ నుంచి ఎమ్మెల్సీ వరకూ