Idream media
Idream media
ఎస్ బ్యాంకు సంక్షోభంలో తెలుగు హీరోలు, నిర్మాతలు ఇరుక్కున్నారు. కొంత మంది ప్రముఖ హీరోలు కోట్ల రూపాయలు ఆ బ్యాంకులో డిపాజిట్ చేశారు. ఇపుడు అవసరమొచ్చినా అ డబ్బు విత్‌డ్రా చేయడానికి లేదు. అదే విధంగా సంవత్సరానికి ఐదారు సినిమాలు అలవోకగా తీసే ముగ్గురు నిర్మాతల లావాదేవీలు ఆ బ్యాంకులో ఉన్నాయని తెలిసింది. ఒకవైపు సినిమాలు నిర్మాణంలో ఉన్నాయి. డబ్బు కావాలంటే దొరకని ఇబ్బంది. ఈ బ్యాంక్ ఇప్పట్లో సంక్షోభం నుంచి బయటపడేలా లేదు. డబ్బుకి ఢోకా లేదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల చెబుతున్నా ఎవరి భయాలు వాళ్లకున్నాయి. ఎస్ బ్యాంకు మూలంగా సినిమా షూటింగ్‌లు నెమ్మదించే ప్రమాదముంది.
అసలే కరోనాతో సినీ పరిశ్రమ విలవిల్లాడుతూ ఉంది. వీకెండ్ అయినా థియేటర్లు ఖాళీగా ఉన్నాయి. శనివారం 12 గంటలకు జివికె మాల్‌లో ఒక షోకి 3 వేలకి మించి కలెక్షన్ లేదు. ఆ డబ్బులు కరెంట్ ఖర్చులు మెయింటెనెన్స్‌కి కూడా చాలవు. నిర్మాతలకి చేతి నుంచి డబ్బు వదిలే పరిస్థితి. కరోనా ప్రభావం ఇంకో వారం కొనసాగితే థియేటర్లు మూసుకోవాల్సిందే. అయితే అదృష్టం కొద్ది పెద్ద బడ్జెట్ సినిమాలు విడుదల కాకపోవడం ఒక వూరట.