iDreamPost
android-app
ios-app

ప్రజలపై అధిక పన్నుల భారం! సెన్సేషనల్ కామెంట్స్ చేసిన ఆర్ధిక మంత్రి!

  • Published Aug 14, 2024 | 2:11 PM Updated Updated Aug 14, 2024 | 2:11 PM

Union Minister Nirmala Sitharaman:ప్రభుత్వానికి పన్నులు చెల్లించే విషయంపై ఒక స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు.

Union Minister Nirmala Sitharaman:ప్రభుత్వానికి పన్నులు చెల్లించే విషయంపై ఒక స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు.

ప్రజలపై అధిక పన్నుల భారం! సెన్సేషనల్ కామెంట్స్ చేసిన ఆర్ధిక మంత్రి!

ప్రపంచంలో అత్యధికంగా పన్నులు కట్టే దేశాల్లో ఇండియా కూడా ఒకటి. ప్రజలు తాము సంపాదిస్తున్న డబ్బులో ఎక్కువ శాతం ప్రత్యక్షంగానో లేదా పరోక్షంగానో పన్నులు కడుతూనే ఉంటారు. రీసెంట్ గా ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దాంట్లో ఒక స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్ తన కష్టాన్ని చెప్పుకున్నారు. ప్రభుత్వానికి పన్నులు చెల్లించటం కోసం తాను ఎంతో కష్టపడుతున్నట్లు స్పష్టంగా తెలిపారు. కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ తో మాట్లాడుతూ.. ప్రభుత్వం లాభాల్లో స్లీపింగ్ పార్ట్నర్ అయ్యిందంటూ చెప్పారు. ఆ వీడియో ఈ మధ్య కాలంలో బాగా వైరల్ అయ్యింది. ఇప్పటికీ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉంది. దానిపై నెటిజన్స్ అనేక రకాలుగా స్పందించారు.

ఈ క్రమంలో నిర్మలా సీతారామన్‌ అధిక పన్నులు గురించి స్పందించారు. అంతా తన చేతుల్లో ఉన్నట్లయితే దేశంలోని ప్రజలందరిపై పన్నులను దాదాపు సున్నా శాతానికి తగ్గించేవారని అన్నారు. భారతదేశ సవాళ్లు ప్రత్యేకమైనవి కాబట్టి పన్నుల ప్రక్రియ చాలా ముఖ్యమని తెలిపారు. దేశం అభివృద్ధికి నిధులు సమకూర్చేందుకు పన్ను రాబడి చాలా కీలకమని ఆమె పేర్కొన్నారు… ఇక పన్నులనేవి గ్రీన్ ఎనర్జీ లాంటి ముఖ్యమైన రంగాలకు నిధులు సమకూరుస్తాయి. ఈ సంవత్సరం వార్షిక బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి మార్పులు తీసుకొచ్చారు. ఏంజెల్ పన్నును రద్దు చేయడం నుండి కొత్త పన్ను నిర్మాణాన్ని సవరించడం దాకా కొత్త మార్పులు చేశారు.

Finance Minister made sensational comments!

వార్షిక బడ్జెట్ ప్రసంగంలోని మార్పుల విషయానికి వస్తే…

  • మధ్యతరగతి ప్రజలకు ఉపయోగపడే ఆదాయపు పన్ను చట్టం 1961పై పరిశీలన జరుగుతుందని నిర్మలా సీతారామన్ చెప్పారు. దీనిని ఆరు నెలల్లో పూర్తి చేస్తామని చెప్పారు.
  • కొత్త పన్ను విధానంలో కేంద్రం పన్ను నిర్మాణాన్ని మార్చింది. ఈ నిర్మాణంతో పన్ను చెల్లింపుదారులకు రూ.17,500 వరకు పన్ను ఆదా అవుతుందని సీతారామన్ చెప్పారు.
  •  ప్రభుత్వం స్టాండర్డ్ డిడక్షన్ రూ.50,000 నుంచి రూ.75,000కి పెంచింది. సర్‌ఛార్జ్, ఎడ్యూకేషన్ సెస్, పాత పన్ను విధానంలో మార్పులు లేవు.
  • ఛారిటబుల్ ట్రస్ట్‌ల కోసం రెండు పన్ను మినహాయింపు విధానాలని ఒకటిగా చేశారు.
  • లాభాలపై షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ టాక్స్ 20%కి, లాంగ్ టర్మ్ 12.5%కి తగ్గించడం జరిగింది.
  • ఆప్షన్ సెల్లింగ్‌పై సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్(STT) 0.0625% నుంచి 0.1%కి పెంచారు.
  • ఈ-కామర్స్ లావాదేవీలపై TDS 1% నుంచి 0.1%కి తగ్గించారు.
  • అన్ని కేటగిరీల పెట్టుబడిదారులకు ‘ఏంజెల్ ట్యాక్స్’ని రద్దు చేయాలని మార్పులు చేశారు.
  • నేషనల్ పెన్షన్ స్కీం (NPS) తగ్గింపు 10% నుంచి 14%కి పెరిగింది.
  • మల్టీ నేషనల్ కంపెనీలకు పన్ను రేటు 40% నుంచి 35%కి తగ్గించబడింది.
  •  టాక్స్ రీఓపెనింగ్, రీఅసెస్‌మెంట్ నియమాల్లో మార్పులు జరిగాయి.

ఇలా వీటితో పాటు ఇంకా కొన్ని మార్పులు చేశారు.