iDreamPost
android-app
ios-app

Loan: గుడ్ న్యూస్ చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. ఇక తక్కువ వడ్డీ రేట్లకే లోన్లు!

  • Published Nov 19, 2024 | 11:32 AM Updated Updated Nov 19, 2024 | 11:32 AM

Loan: లోన్లు తీసుకుంటున్న వారికి అధిక వడ్డీలు భారం అవుతున్నాయి. ఈ నేపధ్యంలో కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

Loan: లోన్లు తీసుకుంటున్న వారికి అధిక వడ్డీలు భారం అవుతున్నాయి. ఈ నేపధ్యంలో కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

Loan: గుడ్ న్యూస్ చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. ఇక తక్కువ వడ్డీ రేట్లకే లోన్లు!

ప్రస్తుతం బ్యాంకులు అధికంగా లోన్లపై వడ్డీలు వసూలు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇక లోన్లు తీసుకున్న వారికి ఆ సమస్య ఉండదు. ఎందుకంటే తాజాగా లోన్ల వడ్డీ రేట్లపై కేంద్రం సానుకూల నిర్ణయం తీసుకుంది. అధిక వడ్డీ రేట్ల వల్ల లోన్లు తీసుకున్న ప్రజలు ఒత్తిడికి గురవుతున్నారు. ఈ విషయం కేంద్రం దృష్టికి చేరింది. దీంతో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆందోళన వ్యక్తం చేశారు. అందుకే లోన్ లపై వడ్డీ రేట్లను అందుబాటులోకి తీసుకురావాలని బ్యాంకులకు సూచించారు. ఇక కేంద్ర మంత్రి సూచన ప్రకారం బ్యాంకులు వడ్డీ రేట్లను తగ్గించే అవకాశాలు ఉన్నాయి. ఈ నిర్ణయం వల్ల లోన్ తీసుకున్న వారిపై భారం తగ్గనుంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో నిర్మలా సీతారామన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇక నుంచి లోన్ లపై వడ్డీ రేట్లను తగ్గించాలని బ్యాంకులకు సూచించారు.

నిర్మలమ్మ ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ.. దేశంలో పరిశ్రమలు బాగా వృద్ధి చెందాలని, కొత్త ప్రాజెక్టుల కోసం పెట్టుబడులు అవసరమని, రుణాలపై వడ్డీ రేట్లు తక్కువగా ఉంటే వికసిత్ భారత్ లక్ష్యాన్ని చేరుకోవడం సులభం అవుతుందని అన్నారు. దేశ వృద్ధి రేటు పెరిగేందుకు తమకు పలు సూచనలు వచ్చాయని.. లోన్ వడ్డీ రేట్లు తగ్గించాలని చాలా మంది కోరారని తెలిపారు. దేశంలో పరిశ్రమలు డెవలప్ అవ్వాలంటే వడ్డీ రేట్లను అందుబాటులోకి తీసుకురావాల్సిన అవసరం ఉందని అన్నారు. ద్రవ్యోల్బణం లెక్కలను 3-4 కమోడిటీలు చూసుకుంటున్నాయని అన్నారు. ఇక మిగిలినవన్నీ కూడా 3-4 శాతం స్థాయిలోనే ఉంటున్నాయని అన్నారు. అయితే ఆహార పదార్థాలని ద్రవ్యోల్బణ లెక్కలో పరిగణించాలా వద్దా అన్న చర్చలో జోక్యం చేసుకోవాలనుకోవట్లేదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు.సరఫరా సమస్యలపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి పెట్టిందని అన్నారు.

ఇక ధరల్లో హెచ్చుతగ్గులు గురించి మాట్లాడారు. అవి మరీ తీవ్రంగా ఉండకుండా చేసేందుకు సరకుల నిల్వ సదుపాయాలు పెంచుతున్నామని నిర్మలా సీతారామన్ అన్నారు. ఇంకా అలాగే ఆర్థిక వృద్ధి తగ్గింపు అంచనాలపై మాట్లాడారు. దేశీయ, అంతర్జాతీయ సవాళ్ల గురించి ప్రభుత్వానికి పూర్తి అవగాహన ఉందని అన్నారు. అనవసరంగా కంగారు పడాల్సిన పనిలేదన్నారు. ఇదీ సంగతి. ఇక ఏది ఏమైనా లోన్లు తీసుకునే వారికి మొత్తానికి వడ్డీ రేట్లు తగ్గిస్తున్నట్లు గుడ్ న్యూస్ చెప్పారు. ఇక ఈ విషయం గురించి మీరేమి అనుకుంటున్నారో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి.