iDreamPost
android-app
ios-app

LTCG Amendment: ఇండెక్సేషన్ బెనిఫిట్‌ని వెనక్కి తెచ్చిన కేంద్రం.. ఇక ప్రాపర్టీ ఓనర్స్‌కి లాభాలే!

  • Published Aug 13, 2024 | 5:08 PM Updated Updated Aug 13, 2024 | 5:27 PM

Central Govt Key Decision On Property Tax: స్థలాలు, పొలాలు, ఇల్లు, ఫ్లాట్ లు వంటివి చాలా మంది కొంటూ ఉంటారు. అయితే వీటిపై ప్రభుత్వం పన్ను విదిస్తుంది. అయితే 2024-25 వార్షిక బడ్జెట్ లో ప్రవేశపెట్టిన కొత్త నిబంధనలతో ప్రాపర్టీ యజమానులకు భారీ షాక్ ఇచ్చింది కేంద్రం. దీంతో భారీగా ట్యాక్స్ రూపంలో నష్టపోయే అవకాశం ఉంది. అయితే ఇప్పుడు కేంద్రం యజమానులకు రెండు ఆప్షన్స్ ని ఇస్తుంది. దీంతో ప్రాపర్టీ ఓనర్స్ కి బోలెడంత డబ్బు ఆదా కానుంది.

Central Govt Key Decision On Property Tax: స్థలాలు, పొలాలు, ఇల్లు, ఫ్లాట్ లు వంటివి చాలా మంది కొంటూ ఉంటారు. అయితే వీటిపై ప్రభుత్వం పన్ను విదిస్తుంది. అయితే 2024-25 వార్షిక బడ్జెట్ లో ప్రవేశపెట్టిన కొత్త నిబంధనలతో ప్రాపర్టీ యజమానులకు భారీ షాక్ ఇచ్చింది కేంద్రం. దీంతో భారీగా ట్యాక్స్ రూపంలో నష్టపోయే అవకాశం ఉంది. అయితే ఇప్పుడు కేంద్రం యజమానులకు రెండు ఆప్షన్స్ ని ఇస్తుంది. దీంతో ప్రాపర్టీ ఓనర్స్ కి బోలెడంత డబ్బు ఆదా కానుంది.

LTCG Amendment: ఇండెక్సేషన్ బెనిఫిట్‌ని వెనక్కి తెచ్చిన కేంద్రం.. ఇక ప్రాపర్టీ ఓనర్స్‌కి లాభాలే!

2024-25 వార్షిక బడ్జెట్ లో భాగంగా కేంద్ర ప్రభుత్వం లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ పై (ఎల్టీసీజీ) కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దీర్ఘకాలిక మూలధన లాభాలపై పన్నుని 20 శాతం నుంచి 12.5 శాతానికి తగ్గించి ఇండెక్సేషన్ బెనిఫిట్ ని తొలగించింది. అయితే ఇండెక్సేషన్ బెనిఫిట్ తొలగింపు వల్ల నష్టపోతామని ప్రాపర్టీ యజమానులు, రియల్ ఎస్టేట్ వర్గాలు, పన్ను చెల్లింపుదారుల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం ఇండెక్సేషన్ బెనిఫిట్ ని వెనక్కి తీసుకొచ్చింది. 2024 జూలై 23కి ముందు ఎవరైతే ప్రాపర్టీలు కొనుగోలు చేశారో.. వారికి పన్ను చెల్లింపు విషయంలో రెండు ఆప్షన్లు ఇచ్చింది కేంద్రం. ఈ మేరకు ఫైనాన్స్ బిల్లులో మార్పులు చేసింది.

ఇండెక్సేషన్ బెనిఫిట్ ఆప్షన్ ని ఎంచుకోవడం లేదా ఇండెక్సేషన్ బెనిఫిట్ లేకుండా 12.5 శాతం పన్ను చెల్లించే ఆప్షన్ ని ఎంచుకోవడం గానీ చేయవచ్చునని కేంద్రం తెలిపింది. ఇండెక్సేషన్ బెనిఫిట్ ని ఉపయోగించుకుని మిగిలిన దానికి ప్రాపర్టీ విలువలో 20 శాతాన్ని చెల్లించాల్సి ఉంటుంది. ఈ రెండు ఆప్షన్స్ లో ఏది ప్రయోజనకరంగా ఉంటుందో ఆ ఆప్షన్ ని ఎంచుకునే వెసులుబాటుని కల్పించింది. 2024 ఏడాది జూలై 23వ తేదీకి ముందు ఎవరైతే భూములు, ఇళ్లు వంటి ప్రాపర్టీలు కొన్నారో వారికి మాత్రమే ఈ అవకాశం ఉంటుంది. అందులోనూ భారతీయులు, హిందూ అవిభాజ్య కుటుంబాలకు మాత్రమే ఈ ప్రయోజనాలు వర్తిస్తాయి. నాన్ రెసిడెంట్ ఇండియన్స్ కి ఈ ప్రయోజనాలు వర్తించవు.

ఇండెక్సేషన్ బెనిఫిట్ ఉండడం వల్ల బంగారం, స్థలం, భూమి వంటి ప్రాపర్టీ విలువ నుంచి ద్రవ్యోల్బణం విలువని తీసివేయగా మిగతా అమౌంట్ కి మాత్రమే 20 శాతం పన్ను చెల్లించే అవకాశం ఉంటుంది. ఉదాహరణకు 20 ఏళ్ల క్రితం ఒక వ్యక్తి ల్యాండ్ కొన్నారు. దాని విలువ అప్పుడు 10 లక్షలు. ఇప్పుడు కోటి రూపాయలు అనుకుందాం. ఆ కోటి రూపాయల్లోంచి ద్రవ్యోల్బణం విలువని 80 లక్షలుగా చూపించి మిగతా 20 లక్షలకు 20 శాతం పన్ను అంటే 4 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది. దీని వల్ల ప్రాపర్టీ యజమానులకు బాగా ప్రయోజనం ఉంటుంది. అయితే వార్షిక బడ్జెట్ లో ఈ ఇండెక్సేషన్ బెనిఫిట్ ని తీసేసి లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ ని 20 శాతం నుంచి 12.5 శాతానికి తగ్గించింది.

ద్రవ్యోల్బణంతో పని లేదు.. ప్రాపర్టీ ధర ఎంత ఉన్నా గానీ అందులో 12.5 శాతం పన్ను చెల్లించాల్సిందే. 20 ఏళ్ల క్రితం 10 లక్షలకు కొన్న భూమి విలువ ఇప్పుడు కోటి రూపాయలు అనుకుంటే అందులో 12.5 శాతం పన్ను అంటే 12 లక్షల 50 వేలు చెల్లించాల్సి ఉంటుంది. ఇందుకే ప్రాపర్టీ యజమానులు, రియల్ ఎస్టేట్ వర్గాలు గగ్గోలు పెట్టాయి. దీని వల్ల తీవ్రంగా నష్టపోతామని.. రియల్ ఎస్టేట్ పై తీవ్ర ప్రభావం చూపుతుందని మొరపెట్టుకోవడంతో ప్రభుత్వం ఇండెక్సేషన్ బెనిఫిట్ ని వెనక్కి తీసుకొచ్చింది. అయితే ఈ రెండు ఆప్షన్స్ లో ఏది ప్రయోజనకరంగా ఉంటుందో దాన్ని ఎంచుకునే అవకాశం కల్పిస్తుంది.