iDreamPost
android-app
ios-app

అద్దంకిలో గొట్టిపాటిని ఓడించేందుకు YCP భారీ వ్యూహం!

అద్దంకిలో గొట్టిపాటిని ఓడించేందుకు YCP భారీ వ్యూహం!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయంలో  ప్రకాశం జిల్లాకు ప్రత్యేక స్థానం ఉంది. ఈ జిల్లాకు చెందిన ఎందరో నాయకులు రాష్ట్ర రాజకీయాల్లో  కీలక పాత్ర పోషించారు. అలాంటి ప్రకాశం జిల్లాలోని అద్దంకి అసెంబ్లి నియోజకవర్గానికి  కూడా ప్రత్యేక ఉంది. ప్రస్తుతం ఈ నియోజవర్గంలో గొట్టిపాటి రవికుమార్ ఎమ్మెల్యేగా ఉన్నారు. 2019లో జగన్ సునామిని తట్టుకుని నిలబడి విజయం సాధించిన 23 మంది టీడీపీ ఎమ్మెల్యేలు గొట్టిపాటి ఒకరు. అయితే వచ్చే ఎన్నికల్లో ఆయను ఎలాగైన ఓడించాలని వైసీపీ భావిస్తున్నాట్లు, అందుకు తగినట్లే వ్యూహాలు రచిస్తున్నారని టాక్ వినిపిస్తోంది.

ప్రకాశం జిల్లాలోని కీలక నేతల్లో గొట్టిపాటి రవికుమార్ ఒకరు. ఆయన 2014 వ‌ర‌కు అద్దంకిలో వైసీపీకి బ‌ల‌మైన నాయ‌కుడిగా ఉన్నారు. అప్పట్లో వైసీపీ తరపున ఎమ్మెల్యేగా గెలిచి.. త‌ర్వాత టీడీపీ అధినేత పిలుపుతో పార్టీ మారి టీడీపీ సైకిల్ ఎక్కారు. దీంతో అద్దంకిలో వైసీపీ బ‌ల‌మైన నాయ‌కుడు లేకుండా పోయారు. 2014 ఎన్నిక‌ల్లో నియోజ‌క‌వ‌ర్గంలో బ‌ల‌మైన వ‌ర్గంగా ఉన్న క‌ర‌ణం బలరాం.. గొట్టిపాటి వ‌ర్గం ఉన్నప్పుడు వైసీపీ త‌రఫున గొట్టిపాటి విజ‌యం సాధించారు. గ‌త ఏడాది ఎన్నిక‌ల్లో వైసీపీ.. బాచిన గ‌ర‌ట‌య్యకు అవ‌కాశం ఇచ్చింది. ఆయ‌న కూడా బ‌ల‌మైన పోటీ ఇచ్చారు. దాదాపు 92 వేల‌పైచిలుకు ఓట్లు సాధించారు.

అయితే అనంతరం గరటయ్యా స్థానంలో ఆయ‌న కుమారుడు బాచిన కృష్ణ చైత‌న్యను నియోజకవర్గ ఇన్ ఛార్జీగా నియ‌మించారు. అతడు గత నాలుగేళ్ల నుంచి నియోజవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ప్రజల సమస్యలు తెలుసుకుని పరిష్కారిస్తున్నారు. 2024లో అద్దంకిలో ఎలాగైన వైసీపీ జెండా ఎగరాలని.. విస్తృత్తంగా ప్రజల్లో ఉంటున్నాడు బాచిన కృష్ణ చైతన్య. అక్కడ వ‌రుస‌గా నాలుగుసార్లు గెలుస్తూ వ‌స్తోన్న గొట్టిపాటి ర‌విని ఓడించేందుకు వైసీపీ గట్టి వ్యూహాలే రచిస్తుంది. కృష్ణ చైతన్య పేరుతో పాటు కరణం బలరాం కుమారుడు వెంకటేష్ పేరును కూడా అధిష్టానం పరిశీలిస్తున్నట్లు పొలిటికల్ టాక్ వినిపిస్తుంది.

అద్దంకిలో వెంక‌టేష్‌ కూడా రంగంలో ఉండటం వ‌ల్ల ప్రయోజ‌నం ఉంటుంద‌ని వైసీపీ అధిష్టానం భావిస్తుందట. ఇలా కరణం వెంకటేష్, కృష్ణ చైతన్య ఇద్దరిలో ఎవరికి టికెట్ ఇచ్చిన గొట్టిపాటిని ఓడించడమే లక్ష్యంగా వైసీపీ పెట్టుకుంది. అలానే అద్దంకి నియోజవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు కూడా ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అనేక అభివృద్ధి పనులను సీఎం శంకుస్థాపనులు చేశారు. ఇలా అభివృద్ధి మంత్రంతో పాటు ప్రజల సమస్యలను తెలుసుకుంటూ గొట్టిపాటిని ఓడించే దిశా వైసీపీ దూసుకెళ్తున్నట్లు పొలిటికల్ కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరి..సోషల్ మీడియాలో వినిపిసున్న ఈ వార్తలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి