iDreamPost
android-app
ios-app

అమరావతి హైకోర్ట్ తీర్పు సమాచార హక్కుకి గొడ్డలిపెట్టు-విజయసాయిరెడ్డి ప్రత్యేక వ్యాసం

  • Published Oct 08, 2020 | 6:54 AM Updated Updated Oct 08, 2020 | 6:54 AM
అమరావతి హైకోర్ట్ తీర్పు సమాచార హక్కుకి గొడ్డలిపెట్టు-విజయసాయిరెడ్డి ప్రత్యేక వ్యాసం

అమరావతి భూములపై ఆంధ్రప్రదేశ్‌ హైకోర్ట్ తీర్పు వారం రోజులుగా ఆంధ్రప్రదేశ్ మీడియా వర్గాల్లో పెద్ద చర్చకు దారితీసింది. మొన్నటి సెప్టెంబర్ 15 నాడు మాజీ అడ్వకేట్ జనరల్ దాఖలు చేసిన పిటీషన్ లో వెలువడిన మధ్యంతర ఉత్తర్వులు దీనికి ప్రధాన కారణం. అవినీతి నిరోధక విభాగం (ఏసీబీ) నమోదు చేసిన ఎఫ్‌ ఐ ఆర్ లో మాజీ ఏజీతో పాటుగా ఇతర ఉన్నత వ్యక్తుల పేర్లు నమోదయ్యాయి.

ఈ కేసులో దర్యాప్తు కొనసాగకుండా కోర్టు ఆదేశాలతో నిలిచిపోయింది. అంతేగాకుండా కేసుకి సంబంధించిన వివరాలు ప్రసారం, ప్రచారం చేయకుండా కోర్ట్ ఆదేశాలు ఇచ్చింది. కోర్టు తన ఉత్తర్వులో ఇలా పేర్కొంది “ నమోదయిన ఎఫ్ఐఆర్ కి సంబంధించి లేదా ఎఫ్ ఐ ఆర్ లోని అంశాలను వార్తలుగా ఎలక్ట్రానిక్, ప్రింట్ లేదా సోషల్ మీడియాలోనూ బహిర్గతం చేయరాదు.. మాజీ అడ్వకేట్ జనరల్ మరియు ఇతర నిందితుల విషయంలో కూడా ఇది వర్తిస్తుంది. ” కానీ ఈ ఉత్తర్వులలో కేసు యొక్క వాస్తవాలను నివేదించడం పిటిషనర్‌కు ఎలా హాని కలిగిస్తుందన్నది పేర్కొనలేదు. అలా ప్రచారం నిలిపివేయడం వల్ల అతనికి ఏ విధంగా ప్రయోజనం చేకూరుస్తుందనే విషయంపై కూడా ఎటువంటి వివరణ లేదు.

మీడియాలో గాగ్(GAG) ఆర్డర్ అనేది రెండంచెల కత్తిలాంటిది. ఇది వాక్ స్వాతంత్ర్యాన్ని హరించడం మాత్రమే కాకుండా పౌరుల సమచార హక్కును కూడా ప్రభావితం చేస్తుంది. ప్రజాస్వామ్యంలో ప్రతీ విషయం తెలుసుకునే హక్కు ప్రజలకు ఉంది. కీలక విభాగాలలో జరుగుతున్న అంశాలను ప్రజలను తెలుసుకోవడం ద్వారా సామాజిక ప్రయోజనాలకు మరింత మేలు జరుగుతుందన్నది ప్రాధమికాంశం. కీలక వ్యక్తులతో ముడిపడిన కేసులు వచ్చినప్పుడు అది మరింతగా వర్తిస్తుంది. రెండోది అమరావతి రాజధాని కి సంబంధించిన భూమి విషయం కాబట్టి ఈ కేసు యొక్క ప్రాధాన్యత మరిన్ని రెట్లు పెరుగుతుంది. అదే సమయంలో ఈ కేసుకి సంబంధించిన అంశాలను గోప్యంగా ఉంచడం ఆంధ్రప్రదేశ్ ప్రజల ప్రయోజనాలకు విఘాతం అవుతుంది.

భారత రాజ్యాంగం ఆర్టికల్ 19 లో పేర్కొన్న సమాచార స్వేచ్ఛను గాగ్ ఆర్డర్ ఉల్లంఘించినట్టవుతుంది. ఆర్టికల్ 19 (20) ప్రకారం కేవలం దేశ సార్వభౌమధికారం, సమగ్రత, దేశ భద్రత, విదేశీ దేశాలతో సంబంధాలు వంటి అంశాలలో నియంత్రణ కు ఆస్కారం ఉంటుంది. కోర్టు ధిక్కారం, పరువు నష్టం లేదా నేరానికి ప్రేరేపించడం వంటి సందర్భాలలోనూ వర్తిస్తుంది. కానీ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తాత్కాలిక ఉత్తర్వులను చూస్తే పైన పేర్కొన్న ఎటువంటి పరిణామాలు ఉత్పన్నం కాకపోయినా గాగ్ ఆర్డర్‌ ఇచ్చిన తీరు సమర్థనకు కూడా ఆస్కారం లేదు.

గాగ్ ఆర్డర్ ఏ సందర్భంలో వర్తిస్తుందనే నిర్వచనం స్పష్టంగా లేకపోయినప్పటికీ న్యాయస్థానాలు నిర్ణయాలు చేసి మార్గనిర్దేశం చేయాల్సిన సందర్భాలలో పలు అంశాలు పరిగణలోకి తీసుకోవాలి. మీడియాను నియంత్రించాలనే అంశం తొలిసారిగా దేశంలో 1988 లో రిలయన్స్ పెట్రోకెమికల్స్ లిమిటెడ్ వర్సెస్ ప్రొప్రైటర్స్ ఆఫ్ ఇండియన్ ఎక్స్‌ప్రెస్ న్యూస్‌పేపర్స్ బాంబే (పి) లిమిటెడ్ కేసులో సుప్రీంకోర్టు ముందు తలెత్తింది. ఈ కేసులో కోర్టు గమనించిన ప్రకారం మీడియాపై ఏవైనా నిరోధక ఉత్తర్వులు న్యాయం యొక్క పరిపాలనను అప్రమత్తంగా ఉంచడానికి సహేతుకమైన కారణాల ఆధారంగా ఉండాలి. దానికి తోడుగా “పేర్కొన్న ప్రమాదం నిజమైనది మరియు విశ్వసించేందుకు సహేతుకమైన ఆధారం కూడా ఉండాలి అని అర్థమవుతోంది.

గాగ్ ఆర్డర్ కోసం కారణాలను నిర్ణయించడంలో తరచుగా పరిగణలోకి తీసుకునే మరో ముఖ్యమైన కేసు 2012 లో ముందుకొచ్చింది. అది సహారా వర్సెస్ సెబీ కేసు. ఆ సందర్భంగా కోర్ట్ ఉత్తర్వులను గమనిస్తే “వాయిదా ఉత్తర్వులు ఇచ్చినందున (మీడియాను రిపోర్ట్ చేయకుండా తాత్కాలికంగా ఆపివేయడానికి సంబంధించిన అంశం) పక్షపాతం లేకుండా నిజమైన తీర్పులు ఇవ్వడానికి గణనీయమైన ప్రమాదం ఉన్న సందర్భాల్లో మాత్రమే గాగ్ ఆర్డర్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇది జస్టిస్ కార్డోజో మాటలలో ” న్యాయ సంబంధిత విషయాలలో సమతుల్యత (న్యాయం మరియు మీడియా స్వేచ్ఛ యొక్క పరిపాలన యొక్క అవసరాల మధ్య) లేకపోతే పరిమిత కాలానికి మాత్రమే గాగ్ ఆర్డర్ కి తగినది. వార్తలు ప్రచురించకుండా నిలుపుదల చేయడం స్వల్పకాలానికే ఉండాలి “అని పేర్కొన్నారు.

ఈ నేపథ్యంలో సమాజానికి సంబంధించిన విషయాలలో ప్రెస్ అనేది హృదయంతో సమానమైన ప్రాధాన్యత కలిగి ఉంటుంది. సామాజిక ప్రయోజనాలను పరిరక్షించడానికి ఏర్పాటు చేయబడిన సంస్థలు మరియు సమాజం మధ్య అనుబంధమే ప్రెస్ బాధ్యత. పత్రికల గొంతును అణచివేసే ఏ ప్రయత్నమైనా అది పారదర్శకతను దెబ్బతీస్తుంది, ప్రజాస్వామ్యానికి ప్రెస్ పునాది వంటిది. అందువల్ల వార్తలను సకాలంలో ఇవ్వకూడదనే ఉత్తర్వులు దాని విలువను కుదించేందుకు దోహదం చేస్తాయి.

ఇప్పటికే అనేక సందర్భాల్లో అత్యున్నత న్యాయస్థానం ఇలాంటి ఉత్తర్వులను కొట్టివేసింది. దిగువ కోర్టులు ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేసిందని పేర్కొనాలి. ఉదాహరణకు, 2018 లో పాట్నా హైకోర్టు ముజఫర్పూర్ షెల్టర్ హోమ్ కేసుపై వార్తలు ప్రచురించకుండా మీడియాను నియంత్రించింది. ఈ అంశంపై బాధ్యతాయుతంగా నివేదించాలని మీడియాను కోరడం ద్వారా సుప్రీంకోర్ట్ దాదాపుగా కింది కోర్ట్ ఉత్తర్వులను పక్కన పెట్టింది. అదే విధంగా అమరావతి భూ కుంభకోణం కేసులో కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు న్యాయం కోసం సుప్రీంకోర్ట్ అంతిమ అవకాశం. ప్రజాస్వామ్యంలో ఎప్పుడైనా పత్రికా స్వేచ్ఛకు చాలా ప్రాముఖ్యత ఉంది. ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్యం యొక్క ప్రెస్‌పై గాగ్ ఉత్తర్వు జారీ చేసినప్పుడు ఎటువంటి సంకేతాన్నిస్తుంది? అంతేకాకుండా ఇలాంటి పరిస్థితులు దీర్ఘకాలంలో మరిన్ని గాగ్ ఉత్తర్వులు వెలువడేందుకు తలుపులు తెరిచినట్టవుతుంది.

ఈ ఉత్తర్వుల పట్ల సామాన్యులు కూడా ఆశ్చర్యపోతున్నారు “నేను ఎందుకు, సమాజంలో ఒక భాగం, నేను నివసిస్తున్న సమాజం గురించి తెలుసుకోవటానికి నా ప్రాథమిక హక్కు నుండి మినహాయించబడ్డానా? ” అని వారు ఆలోచించుకునే పరిస్థితి వచ్చింది. కేసుకి సంబంధించిన వాదనలు, వివరాలు తెలుసుకోకుండా నియంత్రించే ఉత్తర్వులు వెలువడడమే దానికి కారణం. ఇలాంటి ఏ సందర్భంలో, ఎందుకు ఇస్తారనేది కూడా ప్రశ్నార్థకంగానే మారుతోంది.

ఇది విజయసాయి రెడ్డి గారి ఇంగ్లీష్ ఆర్టికల్ కు తెలుగు అనువాదం.
https://www.dailyo.in/politics/andhra-pradesh-high-court-amaravati-land-deal-case-right-to-freedom-of-speech-and-expression-media-gag-order/story/1/33709.html