Idream media
Idream media
రాజకీయాల్లో తమదైన ముద్ర వేయాలంటే ఎవరికైనా దశాబ్ధాలు పడుతుంది. అతి తక్కువ మంది మాత్రమే స్వల్ప కాలంతో ఉన్నత స్థాయికి చేరుకుంటారు. ఇలాంటి వారిలో వైసీపీ కీలక నేత, రాజ్యసభ్యుడు వేణుంబాక విజయసాయిరెడ్డి ముందు వరసలో ఉంటారు. ఏపీ రాజకీయాల్లో స్వల్ప కాలంలోనే తనదైన ముద్ర వేసిన విజయసాయి రెడ్డి.. 2019లో వైసీపీ అధికారంలోకి రావడంలో కీలక పాత్ర పోషించారు.
2011 వరకు విజయసాయి రెడ్డి అంటే పెద్దగా పరిచయం లేని పేరు. వైఎస్ కుంటుంబ ఆడిటర్‌గా, ఆర్థిక సలహాదారుడుగా మాత్రమే పరిచయం. వైఎస్ కుటుంబంతో మూడు తరాల అనుబంధం విజయసాయిరెడ్డిది. వైఎస్ రాజశేఖరరెడ్డి అకాల మరణం తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో యువకుడైన వైఎస్ జగన్ వెన్నంటి ఉన్న విజయసాయి రెడ్డి రాజకీయంగా వైసీపీలో చురుకైన పాత్ర పోషించారు. వైఎస్ జగన్‌పై ముప్పెట దాడి చేసినా, ఆయనతోపాటు తనను ఇబ్బందులకు గురి చేస్తారని తెలిసినా.. వైఎస్ కుటుంబాన్ని వీడని ధృడసంకల్పంతో కూడిన నిబద్ధత విజయసాయి రెడ్డిది.
Also Read : తొలి పరీక్షలో నెగ్గితే రేవంత్ రెడ్డికి తిరుగులేనట్లే..!
2016లో రాజ్యసభకు ఎన్నికైన సమయంలో.. రాజకీయంగా అనుభవం లేని వ్యక్తి ఎలా రాణిస్తారనే అనుమానాలను పటాపంచలు చేస్తూ.. తన పనితీరుతో జాతీయ స్థాయిలో వైసీపీ ప్రతిష్టను ఇనుమడింపజేశారు విజయసాయి రెడ్డి. ప్రజా సమస్యల పరిష్కారం, సంక్షేమం కోసం పలు ప్రైవేటు బిల్లులు పార్లమెంట్లో ప్రవేశపెట్టి అందరి దృష్టిని ఆకర్షించారు. పరువు హత్యల నివారణ, కులాంతర వివాహాలు చేసుకునేవారికి వేధింపుల నుంచి రక్షణ, ఆరోగ్య హక్కును ప్రాథమిక హక్కుగా గుర్తించేందుకు రాజ్యాంగ సవరణ బిల్లు, మహిళల అదృశ్య నివారణకు తగు చర్యలు కోరుతూ ప్రవేశపెట్టిన బిల్లులు వైసీపీతోపాటు విజయసాయి రెడ్డికి జాతీయ స్థాయిలో పేరు తెచ్చి పెట్టాయి.
ఆది నుంచి పార్టీ వ్యవహారాల్లో వైఎస్ జగన్‌కు చేదోడుగా ఉంటూ నేతలను సమన్వయం చేస్తూ.. శ్రేణులను ముందుకు నడిపారు. పార్టీ ఏర్పాటు తర్వాత తొలి ఎన్నికల్లో అపజయం ఎదురై.. ఆటుపోట్లు వచ్చినా పార్టీని నిలబెట్టడంలో విజయసాయి రెడ్డిది కీలక పాత్ర. ముఖ్యంగా ఉత్తరాంధ్రలో పార్టీ బాధ్యతలను భుజష్కంధాలపై వేసుకుని.. పోయిన చోటే వెతుక్కోవాలన్న చందంగా 2019లో ఉత్తరాంధ్రలో వైసీపీకి తిరుగులేని విజయాన్ని అందించారు విజయసాయి రెడ్డి.
Also Read : కృష్ణా జలాల వివాదంలో ఆకుకి అందకుండా, పోకకి చెందకుండా టీడీపీ ఎందుకున్నట్టు..?
వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత విజయసాయి రెడ్డి బాధ్యత మరింత పెరిగింది. వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేతగా రాష్ట్ర, కేంద్రం సంబంధాలను మెరుగుపరచడంలో చాతుర్యాన్ని ప్రదర్శించారు. కేంద్రంలోని బీజేపీతో గొడవలు పెట్టేందుకు ప్రత్యర్థులు వేసిన ఎత్తులను చిత్తు చేస్తూ.. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడారు. వైఎస్ జగన్‌కు కుడి భుజంగా మారిన విజయసాయి రెడ్డిని ఆయనకు దూరం చేసేందుకు టీడీపీ వేసిన ఎత్తులు, చేసిన దుష్ప్రచారం వైఎస్ జగన్‌కు విజయసాయి రెడ్డికి మధ్య ఉన్న అనుబంధం ముందు పటాపంచలయ్యాయి. ఉత్తరాంధ్ర జిల్లాల పార్టీ ఇంఛార్జిగా ఉన్న విజయసాయి రెడ్డిని దెబ్బతీస్తే తప్పా.. మళ్లీ అక్కడ పుంజుకోలేమనే భావనలో టీడీపీ ఉందంటే.. ఏపీ రాజకీయాల్లో అనతికాలంలోనే విజయసాయి రెడ్డి ఎంతటి బలమైన నేతగా ఎదిగారో అర్థం చేసుకోవచ్చు.
ఈ రోజు విజయసాయి రెడ్డి జన్మదినం సందర్భంగా..