స్థానిక సంస్థల కోటా వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులను పార్టీ అధిష్టానం ప్రకటించింది. పార్టీ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి. మొత్తం 14 లో 7 ఓసీలకు, 7 ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ లకు కేటాయించారు. ఏపీలో మొత్తం 11 స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ స్థానాలు భర్తీ కానున్నాయి. అయితే కృష్ణా జిల్లాకు తలశిల రఘురాం అలాగే, డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ లకు జగన్ టికెట్లు కేటాయించారు. డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ ముందు నుంచి కూడా వైఎస్ జగన్ కు చాలా నమ్మకంగా ఉండేవారు. యూత్ కాంగ్రెస్ లో చాలా కాలం పని చేసిన మొండితోక అరుణ్ కుమార్ కు రాష్ట్ర రాజకీయాల మీద చాలా పట్టు ఉండేది.
అయితే అనంతర పరిణామాల్లో జగన్ వెంట నడిచిన ఆయనకి 2014 – 2019 ఎన్నికలలో నందిగామ ఎమ్మెల్యే టిక్కెట్ వస్తుందని అందరూ భావించారు. కానీ ఆయన సోదరుడు మొండితోక జగన్ మోహన్ రావుకు టికెట్ కేటాయించింది వైసిపి. అయితే 2014 ఎన్నికలలో తంగిరాల ప్రభాకర రావు చేతిలో ఆయన ఓటమి పాలవగా 2019 ఎన్నికల్లో ఆయన కుమార్తె తంగిరాల సౌమ్య మీద మంచి మెజారిటీతో గెలుపొందారు. ఇక మొండితోక అరుణ్ కుమార్ పనితనాన్ని మెచ్చిన జగన్ ఆయనకు ముందు మరో కీలక పదవి కూడా కట్టబెట్టారు.
ఈ ఏడాదిలోనే ఆయన ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా కూడా నామినేట్ చేయబడ్డారు. అయితే మొండితోక అరుణ్ కుమార్ పార్టీకి చేసిన సేవలను గుర్తించిన జగన్ ఆయనకు మరో బంపర్ ఆఫర్ ఇచ్చినట్లు చెప్పాలి. అందులో భాగంగానే ఆయనకు ఈ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కోటాలో టికెట్ కేటాయించడం. వైసీపీ చేపట్టిన అన్ని కార్యక్రమాల్లో ముందుండే మొండితోక అరుణ్ కుమార్, ప్రభుత్వ సంక్షేమ పథకాలను పేద ప్రజల్లోకి తీసుకు వెళ్లడంలో కూడా చురుకైన పాత్ర పోషిస్తూ ఉంటారు. నియోజకవర్గం మీద పూర్తి స్థాయిలో పట్టు ఉన్న మొండితోక అరుణ్ కుమార్ కి ఈ టికెట్ లభించడంతో నియోజకవర్గంలో వైసీపీ శ్రేణుల్లో ఆనందం వ్యక్తం చేస్తున్నాయి. వృత్తిరీత్యా ఆయన డాక్టర్ కాదు కానీ పీహెచ్డీ చేయడంతో ఆయన డాక్టర్ అరుణ్ కుమార్ అయ్యారు.