iDreamPost
android-app
ios-app

బాలకృష్ణ చూసి వెళ్లాడు.. ఇక్బాల్‌ ఆదుకొని వచ్చాడు..

  • Published Feb 03, 2020 | 8:21 AM Updated Updated Feb 03, 2020 | 8:21 AM
  • Published Feb 03, 2020 | 8:21 AMUpdated Feb 03, 2020 | 8:21 AM
బాలకృష్ణ చూసి వెళ్లాడు.. ఇక్బాల్‌ ఆదుకొని వచ్చాడు..

ఆపదలో ఉన్న వారిని ఆదుకునే విషయంలో పార్టీలు చూడాల్సిన అవసరం లేదంటూ వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ మహమ్మద్‌ ఇక్బాల్‌ నిరూపించాడు.పక్షవాతంతో బాధపడుతున్న టీడీపీ నాయకుడిని పరామర్శించి, ఆర్థిక సహాయం అందించి మానవత్వాన్ని చాటుకున్నారు. అందుకు సంబంధించిన వివరాలు.. హిందూపురానికి చెందిన తిమ్మారెడ్డి టీడీపీ అభిమాని. ఎన్టీఆర్‌ హయాం నుంచి టీడీపీలో కార్యకర్తగా కొనసాగుతున్నాడు. మొన్నటి ఎన్నికల్లో కూడా బాలకృష్ణ తరుఫున తీవ్రంగా ప్రచారం చేశాడు.

అయితే 6 నెలల కిందట తిమ్మారెడ్డికి పక్షపాతం వచ్చింది. పూర్తిగా మంచానికే పరిమితమయ్యారు. టీడీపీ నాయకులెవరూ ఆయన్ను పట్టించుకున్న పాపాన పోలేదు. ఎమ్మెల్యే బాలకృష్ణ కూడా అతనికి సాయం అందించలేదు. చివరికి మొన్న హిందూపురం వచ్చినప్పుడు ఓ ఐదు నిమిషాలు అతని ఇంటికి వెళ్లి వచ్చాడు. ఆర్థిక సహాయం గురించి అటుంచి.. వైద్య సాయంపై ఎలాంటి భరోసా ఇవ్వకుండా హైదరాబాద్‌ వెళ్లిపోయారు.

ఆ టీడీపీ నేత ఇబ్బందులను తెలుసుకున్న వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ మహమ్మద్‌ ఇక్బాల్‌.. అతని ఇంటికి వెళ్లి పరామర్శించారు. కొంత ఆర్థిక సహాయం అందించారు. మెరుగైన చికిత్స కోసం ప్రభుత్వ పరంగా కూడా సాయం అందించేందుకు కృషి చేస్తానని భరోసా కల్పించారు. ప్రత్యర్థి పార్టీ అయినా తన వద్దకు వచ్చి భరోసానిచ్చిన ఇక్బాల్‌కు తిమ్మారెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. టీడీపీ కోసం దశాబ్ధాలుగా కష్టపడుతున్న అతనికి సాయం అందించకుండా వెళ్లిపోయిన బాలకృష్ణ శైలిపై స్థానిక టీడీపీ నాయకులు విమర్శలు వ్యక్తం చేస్తున్నారు

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetturboslothızlıcasinohızlıcasinohızlıcasinoturboslotzenbetjojobetnakitbahiscasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetjojobetcasibom girişCasibomgrandpashabetJojobet Giriş