iDreamPost
android-app
ios-app

Nellore Corporation, YCP – నెల్లూరు కార్పొరేషన్‌: క్లీన్‌ స్వీప్‌ దిశగా వైసీపీ

Nellore Corporation, YCP – నెల్లూరు కార్పొరేషన్‌: క్లీన్‌ స్వీప్‌ దిశగా వైసీపీ

నెల్లూరు కార్పొరేషన్‌ కూడా అధికార వైసీపీ ఖాతాలో చేరడం ఖాయమైంది. ఈ రోజు ఉదయం ఓట్ల లెక్కింపు ప్రారంభం కాగా.. ఆది నుంచి వైసీపీ ఆధిక్యంలో కొనసాగింది. ప్రతిపక్ష పార్టీలు వైసీపీకి దరిదాపుల్లో కూడా రాలేకపోయాయి. మొత్తం 54 డివిజన్లను వైసీపీ గెలుచుకునే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే 20 డివిజన్లలో వైసీపీ విజయం సాధించింది. టీడీపీ, జనసేన, బీజేపీ, సీపీఎం లు ఖాతా తెరవలేదు.

నెల్లూరు కార్పొరేషన్‌లో మొత్తం 54 డివిజన్లు ఉండగా 8 డివిజన్లు ఏకగ్రీవమయ్యాయి. ఆ డివిజన్లను వైసీపీ గెలుచుకుంది. మిగతా 46 డివిజన్లకు పోలింగ్‌ జరగ్గా.. ఇప్పటి వరకు 20 డివిజన్ల ఫలితాలు వచ్చాయి. అవన్నీ వైసీపీ ఖాతాలోనే పడ్డాయి. దీంతో ఇప్పటి వరకు వైసీపీ గెలుచుకున్న డివిజన్ల సంఖ్య 28కి చేరుకుంది. ఇంకా 24 డివిజన్లలో వైసీపీ అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. మరో రెండు డివిజన్లలోనే పోటీ నెలకొంది. లెక్కింపులో ఇదే ట్రెండ్‌ కొనసాగితే.. వైసీపీ క్లీన్‌ స్వీప్‌ చేయడం ఖాయం.

టీడీపీ.. సీపీఎంతో అధికారికంగా పొత్తు, బీజేపీ, జనసేన పార్టీలతో లోపాయికారి ఒప్పందం చేసుకున్నా.. ఆ పార్టీకి ఆశించిన ఫలితం రాలేదు. ఆ పార్టీ నేతలు కోటం రెడ్డి శ్రీనివాసులు, మాజీ మేయర్‌ అజీజ్‌లు.. పోలింగ్‌ రోజు వైసీపీ వాళ్లు తమ పార్టీ నేతలపై దాడులు చేశారంటూ హడావుడి చేసి సింపతి కోసం యత్నించినా.. ఫలితం లేకుండా పోయింది. ఇరిగేషన్‌ శాఖ మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌ ఒంటి చేత్తో వైసీపీని విజయం వైపు నడిపిస్తున్నారు.

Also Read : Chandrababu, YCP, Kuppam Municipality – చంద్రబాబుకు బిగ్ షాక్.. కుప్పంలో మెజారిటీ మార్క్‌ను చేరుకున్న వైసీపీ