Idream media
Idream media
ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి నాయకత్వంలోని వైసీపీ ప్రభుత్వం విజయవంతంగా ఏడాది పాలన పూర్తి చేసుకునే సందర్భంగా రేపటి నుంచి ఈ నెల 30వ తేదీ వరకు వివిధ అంశాలపై ప్రత్యేకంగా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ మేరకు ఆయా కార్యక్రమాల వివరాలను రాష్ట్ర ప్రణాళికా సంఘం కార్యదర్శి విజయ్‌కుమార్ వెల్లడించారు. రేపటి నుంచి వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన 30వ తేదీ వరకూ ‘మన పాలన – మీ సూచన’ పేరు పై ఈ కార్యక్రమాలు జరుగుతాయని ఆయన వెల్లడించారు.
ఇదీ షెడ్యూల్..
– 25న పరిపాలన సంస్కరణలు, సంక్షేమంపై సదస్సు
– 26న వ్యవసాయం, అనుబంధ రంగాలపై సదస్సు
– 27న విద్యారంగం సంస్కరణలు, పథకాలపై సదస్సు
– 28న పరిశ్రమలు, పెట్టుబడుల రంగంపై సదస్సు
– 29న వైద్య, ఆరోగ్య రంగంలో సంస్కరణలు, పథకాలపై సదస్సు
– 30న రైతు భరోసా కేంద్రాలను సీఎం వైఎస్ జగన్ చేతుల మీదుగా ప్రారంభం
ఈ కార్యక్రమాల్లో సీఎం వైఎస్ జగన్ తాడేపల్లి నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొంటారు. జిల్లా కేంద్రాల్లో ఆయా జిల్లాల మంత్రుల ఆధ్వర్యంలో 50 మందికి మించకుండా సదస్సులు నిర్వహించనున్నారు. ప్రతి రోజూ మధ్యాహ్నం 2:30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ ఈ సదస్సులు జరగనున్నాయి. ప్రజల నుంచి ఆయా అంశాల్లో సూచనలు, సలహాలు ప్రభుత్వం తీసుకోనుంది.