iDreamPost
android-app
ios-app

ఏపీ ప్రజలకు ప్రజా సంకల్ప పాదయాత్ర కానుక

ఏపీ ప్రజలకు ప్రజా సంకల్ప పాదయాత్ర కానుక

వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజా సంకల్ప పాదయాత్ర ప్రారంభించి నేటికి మూడేళ్లు.. అయిన సందర్భంగా జగన్‌ సర్కార్‌ ఏపీ ప్రజలకు పాదయాత్ర కానుక ఇచ్చింది. ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి వైఎస్‌ జగన్‌.. తాము పాలకులం కాదు.. ప్రజా సేవకులం అనేలా పరిపాలన సాగిస్తున్నారు. ఈ క్రమంలో సంక్షేమ పథకాల అమలును గత ప్రభుత్వానికి భిన్నంగా అర్హతే ఆధారంగా అందిస్తున్నారు. వలంటీర్ల వ్యవస్థ ద్వారా ప్రభుత్వాన్ని ప్రజల ముందుకే తీసుకెళ్లారు.

గడచిన ఏడాదిన్నర కాలంలో అనేక సంక్షేమ పథకాలను వైఎస్‌ జగన్‌సర్కార్‌ ప్రారంభించి, విజయవంతగా అమలు చేస్తోంది. ఇందులో పలు పథకాలకు అర్హత ఉండి లబ్ధి పొందలేని వారు దరఖాస్తు చేసుకునేందుకు ప్రభుత్వం అవకాశం ఇచ్చింది. ప్రజా సంకల్ప పాదయాత్ర మూడేళ్లు అయిన సందర్భంగా.. కాపు నేస్తం, వాహన మిత్ర, జగనన్న చేదోడు, వైఎస్సార్‌ నేతన్న హస్తం, వైఎస్సార్‌ చేయూత పథకాలకు అర్హత ఉన్న వారు దరఖాస్తు చేసుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ నెల 12వ తేదీ వరకు ఈ పథకాలకు అర్హులైన వారు దరఖాస్తు చేసుకొచ్చు. వారి అర్హతలను వలంటీర్లు పరిశీలించిన తర్వాత.. ఆయా పథకాలను వారికి వర్తింపచేయనున్నారు.

కాపు నేస్తం, వాహన మిత్ర, జగనన్న చేదోడు, వైఎస్సార్‌ నేతన్న హస్తం, వైఎస్సార్‌ చేయూత పథకాల ద్వారా రాష్ట్రంలో ఇప్పటికే 28.19 లక్షల మంది లబ్ధిపొందుతున్నారు. తాజాగా ఇచ్చిన అవకాశంతో ఈ సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉంది. ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి అర్హులైన ప్రతి ఒక్కరికీ పథకాలు అందించాలనే లక్ష్యంతోనే వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం పని చేస్తోంది. ఈ క్రమంలో పథకం ప్రారంభించిన తర్వాత కూడా నెల రోజుల వరకూ అర్హులైన వారు దరఖాస్తు చేసుకునేలా అవకాశం కల్పించింది. ప్రజల సమస్యలను తెలుసుకుని పరిపాలన సాగించేలా చేసిన వైఎస్‌ జగన్‌ ప్రజా సంకల్ప పాదయాత్ర చరిత్రలో నిలిచిపోయింది.