iDreamPost
android-app
ios-app

వైసీపీ జోరు.. టీడీపీది అదే తీరు..

వైసీపీ జోరు.. టీడీపీది అదే తీరు..

ఊహించినట్లుగానే ఏలూరు మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. అధికార వైసీపీ తన సత్తాను చాటుతోంది. ఇప్పటి వరకు వెల్లడైన ఫలితాల్లో వైసీపీ అభ్యర్థులే ఎక్కువ డివిజన్లను గెలుచుకున్నారు. 50 డివిజన్లకుగాను మూడు డివిజన్లు ఏకగ్రీవం కాగా.. పోలింగ్‌ జరిగిన మిగతా 47 డివిజన్లలో ఇప్పటి వరకు 11 డివిజన్ల ఫలితాలు వెల్లడయ్యాయి. 2, 12, 22, 33, 37, 38, 39, 41, 42, 45, 46 డివిజన్లలో ఫలితాలు వెల్లడి కాగా.. 37వ డివిజన్‌లో టీడీపీ అభ్యర్థి విజయం సాధించగా.. మిగతా 10 డివిజన్లలో వైసీపీ అభ్యర్థులు విజయదుందుబి మోగించారు.

2వ డివిజన్‌లో కనక నరసింహారావు విజయం సాధించారు. 12వ డివిజన్‌లో కర్రి శ్రీను, 22వ డివిజన్‌లో సుధీర్‌ బాబు, 33వ డివిజన్‌లో రామ మోహన్, 38వ డివిజన్‌లో హేమ మాధురి, 39వ డివిజన్‌లో జ్యోతి, 41 కళ్యాణి దేవి, 42 సత్యవతి, 45వ డివిజన్‌లో చంద్రశేఖర్, 46వ డివిజన్‌లో ప్యారీ బేగంలు గెలుపొందారు. 37వ డివిజన్‌లో టీడీపీ అభ్యర్థి ఫృద్వి శారద విజయం సాధించారు. ఏకగ్రీవమైన మూడు డివిజన్లతో కలిపి వైసీపీ గెలుచుకున్న డివిజన్ల సంఖ్య 14కు చేరింది.

Also Read : ఏపీలో మళ్లీ స్థానిక ఎన్నికల హడావుడి..