వైయస్ జగన్, ఎవరు అర్హులు అని భావిస్తూ వచ్చారో వాళ్ళందరికీ వాళ్లకు తగ్గ ఫలాలు అందిస్తూ వచ్చారు. అందులో భాగంగానే విజయవాడ మైనారిటీ వర్గానికి చెందిన కరీమున్నీసాకు ఎమ్మెల్సీ సీటు దక్కింది. కార్పొరేటర్ పదవే ఎక్కువని భావించే కరీమున్నీసా అనే మహిళా మైనారిటీ నేతను ఏకంగా ఎమ్మెల్సీ పదవే వెతుక్కుంటూ వచ్చి వరించింది. విజయవాడ నగరంలోని అజిత్‌సింగ్‌నగర్ డాబాకొట్లు ప్రాంతంలో కరీమున్నీసా కుటుంబం నివాసం ఉండేది. ఆమె భర్త పేరు సలీం కాగా ఆ దంపతులకు ఐదుగురు కుమారులు వారంతా వేర్వేరు వ్యాపారాల్లో సెటిలయ్యారు.
అయితే వీరిలో చిన్న కుమారుడు రుహుల్లా వైసీపీ మైనార్టీ విభాగం రాష్ట్ర కార్యదర్శిగా ముందు నుంచి కొనసాగుతున్నారు. కరీమున్నీసా కుటుంబానికి దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి అంటే ప్రాణం కాగా ఆయన మరణానంతరం ఆయన కుమారుడు వైఎస్ జగన్ స్థాపించిన వైసీపీకి ప్రాణం పెట్టి పని చేస్తున్నారు. ఈ నేపథ్యంలో 2014లో విజయవాడ నగరంలోని 54వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థిగా కరీమున్నీసా వైసీపీ తరపున బరిలో నిలిచి నెగ్గారు. అనంతరం వార్డుల పునర్విభజనలో భాగంగా 54వ డివిజన్, 59వ డివిజన్‌గా మారింది. ఈ క్రమంలో మొన్న విజయవాడ మున్సిపల్ ఎన్నికలు జరిగిన సమయంలో ఆమె మరోసారి ఆ డివిజన్ నుంచి వైసీపీ తరపున పోటీకి దిగారు. ఈ నేపథ్యంలో ఆమెకు అనుకోని విధంగా ఎమ్మెల్సీ అయ్యే అవకాశం ఇచ్చారు జగన్.
అయితే ఎనిమిది నెలలు కూడా పూర్తి చేసుకోకుండానే ఆమె గుండెపోటు కారణంగా నవంబర్ నెలలో మరణించారు. అయితే తాజాగా అందుతున్న సమాచారం మేరకు వైఎస్ జగన్ ఆయన చిన్న కుమారుడు వైసీపీ విద్యార్థి విభాగం లో కీలకంగా వ్యవహరిస్తున్న రుహుల్లాకు ఎమ్మెల్సీ అవకాశం ఇస్తున్నట్లు తెలుస్తోంది. 2010 నుంచే జగన్‌తో రుహుల్లాకు మంచి సంబంధాలున్నాయి. వైఎస్ఆర్సీపీ ప్రారంభం నుంచి పార్టీలో అన్ని కార్యక్రమాలలోనూ అన్నీ తామై నిలిచే ఆయనకు ఈ పదవి దక్కనుండడంతో మైనారిటీ వర్గాల వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అన్ని వర్గాల వారికి న్యాయం చేసేది జగన్ మాత్రమే అని వారు భావిస్తున్నారు. అయితే బలాబలాల దృష్ట్యా రుహుల్లా కూడా ఏకగ్రీవంగా ఎన్నికయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Also Read : తిక్కారెడ్డిపై హత్యాయత్నం జరిగిందా..?