iDreamPost
android-app
ios-app

ఇంగ్లండ్‌కు అసలైన బజ్‌బాల్‌ దెబ్బ రుచిచూపించిన జైస్వాల్‌! ఏం కొట్టాడు గురూ!

  • Published Jan 25, 2024 | 7:30 PM Updated Updated Jan 25, 2024 | 7:30 PM

ఇండియాపై బజ్‌బాల్‌ స్ట్రాటజీని ఉపయోగిస్తాం అంటూ గొప్పలు చెప్పుకున్న ఇంగ్లండ్‌ తొలి టెస్ట్‌ తొలిరోజే తిప్పలు పడింది. పైగా భారత యువ ఆటగాడు జైస్వాల్‌ అసలైన బజ్‌బాల్‌ ఎలా ఆడాలో నేర్చుకుంది. మరి ఆ విశేషాలు ఇప్పుడు చూద్దాం..

ఇండియాపై బజ్‌బాల్‌ స్ట్రాటజీని ఉపయోగిస్తాం అంటూ గొప్పలు చెప్పుకున్న ఇంగ్లండ్‌ తొలి టెస్ట్‌ తొలిరోజే తిప్పలు పడింది. పైగా భారత యువ ఆటగాడు జైస్వాల్‌ అసలైన బజ్‌బాల్‌ ఎలా ఆడాలో నేర్చుకుంది. మరి ఆ విశేషాలు ఇప్పుడు చూద్దాం..

  • Published Jan 25, 2024 | 7:30 PMUpdated Jan 25, 2024 | 7:30 PM
ఇంగ్లండ్‌కు అసలైన బజ్‌బాల్‌ దెబ్బ రుచిచూపించిన జైస్వాల్‌! ఏం కొట్టాడు గురూ!

హైదరాబాద్‌లోని ఉప్పల్‌ స్టేడియం వేదికగా భారత్‌-ఇంగ్లండ్‌ మధ్య తొలి టెస్ట్‌ మ్యాచ్‌ షురూ అయింది. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన ఇంగ్లండ్‌ తొలుత బ్యాటింగ్‌కు దిగింది. సిరీస్‌ ఆరంభానికి ముందు వాళ్ల సక్సెస్‌ఫుల్‌ ఫార్ములా బజ్‌బాల్‌ స్ట్రాటజీని ఇండియాపై కూడా ప్రయోగిస్తామని ఇంగ్లండ్‌ జట్టులోని ఆటగాళ్లు ప్రకటించారు. మ్యాచ్‌ స్టార్ట్‌ అయిన ఓ అరగంట సేపు అదే స్ట్రాటజీ చూపించారు. కానీ, ఎప్పుడైతే.. టీమిండియా స్పిన్నర్లు రంగంలోకి దిగారో.. ఇంగ్లండ్‌ బజ్‌బాల్‌ తుస్సుమంది. రవిచంద్రన్‌ అశ్విన్‌, రవీంద్ర జడేజా, అక్షర్‌ పటేల్‌.. స్పిన్‌తో ఇంగ్లండ్‌ బ్యాటర్లకు చుక్కలు చూపించారు. దీంతో.. బజ్‌బాల్‌ అటుంచి.. కనీసం వికెట్‌ కాపాడుకున్నా చాలా దేవుడా అంటూ ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌ సాగింది.

మొత్తంగా 64.3 ఓవర్లలోనే కేవలం 246 పరుగులకే ఇంగ్లండ్‌ జట్టు ఆలౌట్‌ అయింది. ఆ జట్టు కెప్టెన్‌ బెన్‌ స్టోక్స్‌ ఒక్కడే.. ఇండియన్‌ స్పిన్‌ మ్యాజిక్‌ను తట్టుకుని కొద్దిసేపు పోరాటం చేశాడు. 88 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సులతో 70 పరుగులు చేసి రాణంచాడు. మిగతా బ్యాటర్ల పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. ఓపెనర్లు జాక్‌ క్రాలే 20, డకెట్‌ 35, ఓలీ పోప్‌ 1, జో రూట్‌ 29, బెయిర్‌స్టో 37, బెన్‌ ఫోక్స్‌ 4 పరుగులు మాత్రమే చేశారు. భారత బౌలర్లలో రవిచంద్రన్‌ అశ్విన్‌, రవీంద్ర జడేజా మూడేసి వికెట్లు పడగొట్టారు. అక్షర్‌ పటేల్‌, జస్ప్రీత్‌ బుమ్రా చెరో రెండు వికెట్లు తీసుకున్నారు. ఇంగ్లండ్‌ బజ్‌బాల్‌ గేమ్‌ తమ స్పిన్‌ అస్త్రంతో అడ్డుకున్న టీమిండియా.. తొలి ఇన్నింగ్స్‌కు దిగి.. ఇంగ్లండ్‌పై రివర్స్‌లో బజ్‌బాల్‌ను ప్రయోగించింది. ముఖ్యంగా టీమిండియా యువ ఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌ అయితే.. ఏదో టీ20 మ్యాచ్‌ ఆడుతున్నట్లు రెచ్చిపోయాడు.

ఇన్నింగ్స్‌ను ఏకంగా బౌండరీతోనే మొదలుపెట్టాడు. అంతటితో ఆగాడా.. రెండో ఓవర్‌లో ఏకంగా రెండు భారీ సిక్సులు బాది.. ఇంగ్లండ్‌కు దిమ్మతిరిగే షాకిచ్చాడు. ఇతనేంటి ఇలా ఆడుతున్నాడు.. బజ్‌బాల్‌ ఎలా ఆడాలో మనకే చూపిస్తున్నాడంటూ ఇంగ్లండ్‌ ఆటగాళ్లు ఉలిక్కిపడేలా బ్యాటింగ్‌ చేశాడు. ఇంగ్లండ్‌ డెబ్యూ బౌలర్‌ టాప్‌ హార్ట్లీని టార్గెట్‌ చేసి కొట్టాడు జైస్వాల్‌. అతను వేసిన తొలి మూడు ఓవర్లలో జైస్వాల్‌ ఏకంగా 33 పరుగులు పిండుకున్నాడు. మొత్తంగా 70 బంతుల్లోనే 9 ఫోర్లు, 3 సిక్సులతో 76 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. మరో ఓపెనర్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ 27 బంతుల్లో 3 ఫోర్లతో 24 పరుగులు చేసి జాక్‌ లీచ్‌ బౌలింగ్‌లో అవుట్‌ అయ్యాడు. మొత్తంగా 23 ఓవర్లలో ఒక వికెట్‌ నష్టానికి 119 పరుగులు చేసి తొలి రోజు ఆటను ముగించింది. జైస్వాల్‌తో పాటు వన్‌డౌన్‌లో వచ్చిన శుబ్‌మన్‌ గిల్‌ 14 పరుగులతో నాటౌట్‌గా ఉన్నాడు. మరి బజ్‌బాల్‌ గేమ్‌ ఆడటంతో విఫలమైన ఇంగ్లండ్‌కు.. ఇదిరా అసలైన బజ్‌బాల్‌ గేమ్‌ అంటూ తన జైస్‌బాల్‌ గేమ్‌ చూపించిన యశస్వి జైస్వాల్‌ బ్యాటింగ్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.